BREAKING NEWS

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ముఖ్యమైన విషయాలు...!

రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నో పద్యాలు, వ్యాసాలు, విమర్శలు రచించారు. ఈయన సుప్రసిద్ధ కవి. సాహిత్యం, జాతీయ గీతం, సాహిత్యం లో నోబెల్ బహుమతి తో ప్రసిద్ధి గాంచారు. భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన గొప్ప కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన మే 7, 1861 లో జన్మించారు. చిన్న నాటి నుండి రచనలు చేయడం అంటే ఈయనకి ఆసక్తి ఎక్కువ. ఈరోజు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు, జనగణమన, స్వాతంత్ర సాధన ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం.
 
వంగ దేశం లో రవీంద్ర నాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్,శారదా దేవిలకు 14వ సంతానంగా జన్మించడం జరిగింది. ఈయన హఠాత్తుగా కవితలు ఏమి రుచించలేదు.. బాల్యం నుండి కూడా ఈయనకి రచనలంటే, భాష అంటే ప్రీతి. అదే విధంగా ఈయన ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికి పాట్లు పడేవారుట.
 
ఈయనకి ప్రకృతి సౌందర్యం అంటే చాలా ఇష్టం. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండే ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందపడుతూ ఉండేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కి కథలంటే చాలా ఇష్టం. 
 
రవీంద్రనాథ్ ఠాగూర్ బాల్యం:
 
 సామాన్య దుస్తులతో నిరాడంబరంగా ఉండేవారు. పాఠశాలలో చదవడానికి ఇష్ట పడక ఇంటి వద్దనే క్రమశిక్షణ తో ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేసి లెక్కలు చేసి చరిత్ర భూగోళ మొదలైన సబ్జెక్టుల పాఠాలను అభ్యసించేవారు. అలాగే భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం కూడా నేర్చుకునే వారు ఇలా ఎంతో ఆసక్తి చదువు పైన ఆయన చూపించే వారు.
 
ఆంగ్ల నవలలు కూడా స్వయంగా ఆయన చదివారట. కాళిదాసు, షేక్స్పియర్ రచనలు కూడా ఈయన చదివేవారు. ఇలా భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృ భాష పట్ల అభిమానం కూడా పెంచుకోవడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సంధ్య గీత్ కావ్యాన్ని రచించారు. ఆ కావ్యాన్ని చూసి కవులందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ని ఎంతగానో ప్రశంసించారు.
 
రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి:
 
రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ఎంతో అద్భుతంగా ఉండేవి ఆయన రచనలు చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయనను అభినందించేవారు. ఎన్ని రచనలు చేసిన గీతాంజలి రచన మాత్రం చెప్పుకోదగ్గది. ఈ రచనని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాష లో రచించారు ఆ తర్వాత ఈ రచన అనేక ప్రపంచ భాషలలోకి కూడా అనువదించబడింది.
 
అయితే మనం గీతాంజలి గురించి చూస్తే... ప్రపంచ సాహిత్యంలోనే గీతాంజలి ఒక గొప్ప రచన అని చెప్పొచ్చు. ఈ రచన మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను సకల సృష్టిని ప్రేమ భావం తో చూసి శ్రమ యొక్క గొప్ప తనాన్ని సూచించే గొప్ప సందేశం అని చెప్పొచ్చు.
 
గీతాంజలి రచన నిజంగా ఎంత గొప్పదంటే... 1913వ సంవత్సరం లో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని రాసిన ఈ గీతాంజలి కి నోబెల్ బహుమతి లభించింది. ఈ రచన ఆయనకు విశ్వ కవి అనే బిరుదును తీసుకు వచ్చింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆసియా ఖండం లో మొట్ట మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్.
 
రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్:
 
చాలా మందికి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ గురించి తెలిసే ఉంటుంది. రవీంద్ర ఠాగూర్ కేవలం రచయితగా మాత్రమే కాకుండా బాలల హృదయాలను వికసింపచేయడానికి ప్రాచీన ఋషుల గురుకులం తరహా లో శాంతినికేతన్ ని స్థాపించారు. మొట్టమొదట ఈ విశ్వభారతి విశ్వవిద్యాలయం ఐదుగురు తో మొదలైంది.
 
ఆ తర్వాత ఇది క్రమంగా విస్తరించింది. అక్కడ చిన్నపిల్లలు ఉపాధ్యాయులు ఇళ్లల్లో భోజనం చేసేవారు. మంచి పద్ధతులతో దాన్ని నడిపించడం జరిగింది. పరిశుభ్రత, గురువును గౌరవించడం, కాలినడక, పెద్దలను గౌరవించడం వంటి మంచి పద్ధతుల్లో విద్యార్థులు ఉండేవారు. అదే విధంగా ఇక్కడ విద్యార్థులు వివిధ కళలను కూడా నేర్చుకునేవారు. 1919లో కళాభవన్ ని స్థాపించారు.
 
రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రకళ :
 
రవీంద్రనాథ్ ఠాగూర్ 70ఏళ్ల వయసు లో చిత్ర కళను ప్రారంభించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాల లో కూడా ప్రచురించడం జరిగింది.
 
రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటలు:
 
నిజంగా ఈ మాటలు ఎంతో మంచి సందేశం తో అద్భుతంగా ఉంటాయి. చాలా మంచి వాక్యాలను అందించారు రవీంద్రనాథ్ ఠాగూర్. వాటిని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం.
 
వెలిగే దీపం లాగ ఉండు అప్పుడు ఇతర దీపాలను వెలిగించవచ్చు..
ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద- పవిత్రత..
ప్రతి గడిచిన రోజు మనం ఏదైనా నేర్చుకున్నదై ఉండాలి. 
అబద్ధం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను..
నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది. మనిషి జీవితంలో మహాదశయాలు శిశువుల్లో అవతరిస్తూ ఉంటాయి.
భర్తకి లోకమంత ఇల్లు అయితే స్త్రీకి ఇల్లే లోకం..
కళ్ళకి రెప్పలు ఉన్నట్టే మనకి విశ్రాంతి ఉండాలి.
 
 నిజంగా ఇటువంటి చూస్తే ఆయన ఆలోచన, రచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అది మనకే తెలుస్తుంది. నిజంగా ఇవి జీవితాన్ని మంచి స్థాయి లో నడిపించడానికి ముఖ్యమైన వాక్యాలు అని కూడా చెప్పొచ్చు. వీటిని పునాది చేసుకుని మనం నడిస్తే ఎంతో బలంగా జీవితం లో నిలబడగలం.