BREAKING NEWS

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వలన కలిగే లక్షణాలు, ట్రీట్మెంట్ పద్దతి...!

కరోనా మహమ్మారి ఎంతో మందిని పట్టి పీడిస్తోంది. ఇటువంటి సమయం లో తప్పని సరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. డబల్ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటివి చేయాలి. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలి. అయితే కరోనా వైరస్ బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు వణికిస్తోంది. 
 
అసలు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి..?, ఇది వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి...? ముకోమైకోసిస్ అంటే ఏమిటి...? ఇలా అనేక విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.
 
కరోనా వైరస్ తో అనేక మంది సతమతమౌతున్నారు. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి వేలల్లో ప్రజలు మరణిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ నిజంగా ఇప్పుడు అందర్నీ వణికిస్తోంది. 200 మందికి పైగా మహారాష్ట్ర లో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ఇది నిజంగా అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. అయితే దీని వల్ల మరణాల రేటు 50 శాతం కంటే ఎక్కువ అవుతుందని వైద్యులు చెప్పడం జరిగింది.
 
ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధి కోసం చాలా మందికి అవగాహన లేదు. దీనిని క్లుప్తంగా చూస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. పైగా లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి కూడా మీరు తెలుసుకో వచ్చు. ఇప్పటికే కరోనా వైరస్ అంటే ప్రజలు వణికి పోతున్నారు. 
 
ఇటువంటి సమయంలో బ్లాక్ ఫంగస్ అనేది కూడా వచ్చింది ఇప్పటికే నిపుణులు మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రాల లో ఉంది. కరోనా నుండి కోరుకున్న వారిలో మైక్రొమైకుసెస్ అని పిలిచే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ని చూస్తున్నట్లు చెప్పారు.
 
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరికి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తోందని ఇది వచ్చిన తర్వాత కొంత మంది కంటి చూపును కూడా కోల్పోతున్నట్లు వెల్లడించారు. నిజంగా ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. అవసరమైతే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అనవసరంగా మీకు తోచిన మందులు వాడరాదు.
 
నిపుణులు సహాయంతోనే మందులు వాడండి. స్టెరాయిడ్స్ కూడా మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉపయోగించ వద్దు. గత పదిహేను రోజుల్లో సూరత్ 40 మందికి ఈ వ్యాధి సోకింది. అయితే ఇందులో ఎనిమిది మంది కంటి చూపు కోల్పోయినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మన మహా రాష్ట్ర లో చూసుకున్నట్లయితే 200 మంది పైగా ఈ వ్యాధి బారిన పడినట్టు తెలుస్తోంది.
 
ఇప్పుడు ఈ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ మరణాల రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. నిజంగా దీని నుంచి బయట పడడం కష్టం అని నిపుణులు అంటున్నారు. ఇక దీని కోసం మరిన్ని వివరాలను కూడా ఇప్పుడు చూసేద్దాం. 
 
మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ అధిపతి ఈ వ్యాధి గురించి మన తో పూర్తిగా షేర్ చేసుకున్నారు. దీనితో మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. వాటి కోసం కూడా ఓ లుక్ వేసేయండి. 
 
అసలు ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి అంటే ఏమిటి..? 
 
ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి మ్యుకమైకుసెస్ అనే వైరస్ ద్వారా వస్తుంది. కరోనా సోకిన వారిలో ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవడం ముఖ్యం.
 
ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏమిటి...?
 
ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ ఏమిటో తెలుసుకున్నారు కదా.. ఇప్పుడు దీని యొక్క లక్షణాలు కూడా చూద్దాం... మొదటగా సైనస్ లో చేరి తరవాత కళ్ల పై ఇది దాడి చేస్తుంది. ఆ తర్వాత 24 గంటల్లో బ్రెయిన్ వరకు కూడా ఇది చేరుతుంది. 
 
బ్రెయిన్ వరకు వెళ్తే బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది. అలానే మొదటగా ఈ వ్యాధి సోకగానే తల నొప్పి, జ్వరం, ముఖం లో వాపులు, కాళ్ళ వాపులు తో పాటుగా అవయవాల్లో నల్లటి మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. ముక్కు ఒక వైపు మూసుకు పోవడం ఇలా కొన్ని రకాల లక్షణాలు కనబడుతూ ఉంటాయి.
 
డయాబెటిస్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలా ...?
 
డయాబెటిస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఎందుకు బ్లాక్ ఫంగస్ కి డయాబెటిస్ కి సంబంధం ఉంది అనేది చూస్తే... తీవ్రమైన డయాబెటిస్ తో ఇబ్బంది పడే వారు త్వరగా కోలుకునేందుకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు.  
 
ఇది బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి  దారి తీస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. వీలైనంత వరకు ఈ వ్యాధి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు రావు.
 
 ఈ బ్లాక్ ఫంగస్ కి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా ..?
 
ఈ బ్లాక్ ఫంగస్ కి ట్రీట్మెంట్ ఉంది అని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీనిని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ చేసే ప్రాణాలను కాపాడవచ్చు అని అంటున్నారు. అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎవరైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధ పడతారో వాళ్లకి 20 రోజుల పాటు ఇంజక్షన్ ఇస్తారు.
 
 ఆ తర్వాత మందులు వంటివి కూడా ఇస్తారు. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఇస్తున్నారు. దీంతో ప్రమాదం నుండి బయట పడవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.