BREAKING NEWS

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సులువైన మార్గాలు..

కరోనా మహమ్మారి అందరిని ఇబ్బందులకు గురి చేస్తోంది అనుకుంటే.... బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వంటివి కూడా ఇప్పుడు వచ్చాయి. ఏ సమస్య ఉన్నా సరే రోగ నిరోధక శక్తి ఉంటే పెద్ద సమస్య అవ్వదు. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని మీరు అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా నిపుణులు చెబుతున్న ఈ విషయాలను గ్రహించండి. ఈ సులభమైన చిట్కాలను మీరు అనుసరించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు మీకు రావు. మరి ఇక ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే తెలుసుకుందాం..
 
రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్ళు ఇన్ఫెక్షన్ల తో పోరాడ లేరు. కాబట్టి తప్పకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. 
 
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని టిప్స్ మీకోసం:
 
మంచి నిద్రని పొందండి:
 
ప్రతి ఒక్కరి నిద్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మంచి నాణ్యమైన నిద్ర ద్వారా అనారోగ్యం నుంచి సులభంగా బయట పడవచ్చు. పెద్దలు అయితే కనీసం 6 గంటల వరకు నిద్ర పోవడం మంచిది. నిద్ర పోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. యువత అయితే 8 నుండి 10 గంటల వరకు నిద్ర పోవచ్చు. పిల్లలు అయితే 14 గంటల వరకు కూడా నిద్ర పోవచ్చు. పెద్దవాళ్ళు కనీసం ఆరు, ఏడు గంటల పాటు నిద్ర పోయే లాగ చూసుకోండి మంచిది.
 
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నిద్రపోవడానికి గంట ముందు మీ ఫోన్ టీవిని 
బ్యాండ్ చేసేయండి. ఎందుకంటే ఫోన్ టీవీ ద్వారా వచ్చే బ్లూ లైట్ కారణంగా నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు ఈ చిన్న టెక్నిక్ అనుసరించండి. అదే విధంగా  మీరు నిద్రపోయే గది లో చీకటిగా ఉండేటట్లు చూసుకోండి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి నిద్రను పొందవచ్చు.
 
ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోండి:
 
ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు కూడా రోగ నిరోధక శక్తి కోసం సహాయ పడుతుంది. ఎక్కువగా ఇది మనకి ఆలివ్ ఆయిల్, సాల్మన్ లో దొరుకుతాయి. ఇంఫ్లేమేషన్ ని తగ్గించడం మాత్రమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. 
 
క్రానిక్ సమస్యలు కూడా తగ్గి పోతాయి. అదే విధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సాల్మన్ లాంటివి తీసుకుంటే ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది ఈ విధంగా వీటిని మీరు మీ డైట్ లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి వీలవుతుంది.
 
 మొక్కల నుండి వచ్చే ఆహారం:
 
మొక్కల ద్వారా వచ్చే ఆహారం అంటే కూరగాయలు, పండ్లు, నట్స్, సీడ్స్ ఇలాంటివి తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. హృదయ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి మీ డైట్ లో ఎక్కువగా పండ్లు కూరగాయలు తీసుకుంటూ ఉండండి. విటమిన్-సి కూడా మీ డైట్ లో తీసుకోవటం మంచిది. 
 
షుగర్ తక్కువగా తీసుకోండి:
 
ఎంత తక్కువ షుగర్ ఉన్న పదార్థాలు వాడితే అంత మంచిది. పంచదార తక్కువగా తీసుకోవడం మంచిది.  పంచదార తగ్గించడం వల్ల  క్రానిక్ సమస్యలు కూడా మీకు ఉండవు. కాబట్టి మీరు మీ డైట్ లో వీటిని కూడా పాటించండి. 
 
డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండండి:
 
డీహైడ్రేట్ అయిపోకుండా మీరు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండండి. అనారోగ్యం వుంది అంటే డీహైడ్రేషన్ కూడా ఒక సమస్య. డీహైడ్రేషన్ కారణంగా తల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండండి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండండి.
 
ఒత్తిడిని మ్యానేజ్ చేయండి:
 
ఒత్తిడి కారణంగా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే మీరు మెడిటేషన్, యోగా లాంటివి ప్రయత్నం చేయండి. మరీ ఎక్కువ ఒత్తిడి ఉంటే కౌన్సిలింగ్ లేదా థెరపిస్ట్ ని కన్సల్ట్ చేయండి. అలాగే విటమిన్ సి, విటమిన్ డి, జింక్, వెల్లుల్లి లాంటివి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. దీంతో మీకు సమస్య రాకుండా ఉంటుంది.
 
 ప్రతిరోజు వ్యాయామం చేయడం:
 
ప్రతి రోజు వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. వాకింగ్ కూడా చాలా మంచిది. సన్నగా ఉండే వాళ్ళు వాకింగ్ చేయక్కర్లేదు వ్యాయామం అనవసరం అని అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరు వ్యాయామానికి కాస్త సమయం ఇవ్వాలి. 
 
రెగ్యులర్గా వ్యాయామం చేస్తే ఫిట్ గా ఉంటారు మరియు ఆరోగ్యంగా కూడా ఉండగలరు. ఈ విధంగా మీరు ఈ చిట్కాలను పాటిస్తే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండగలరు మరియు రోగ నిరోధక శక్తి కూడా సులువుగా పెరుగుతుంది.