కరోనా మహమ్మారి వలెనే సతమతం అవుతుంటే ఇప్పుడు తుఫాన్ అందర్నీ భయ పెడుతోంది. ఈ యాస్ తుఫాన్ కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే..
రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖ లోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని తీరం వెంబడి రాబోయే నాలుగు రోజుల పాటు గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రాష్ట్రంపై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.
తూర్పు మధ్య బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం ఆదివారం రాత్రి వాయు గుండంగా మారింది. దీనితో అది సోమవారం ఉదయానికి మరింత బలపడి తుపాన్‌గా మారనుంది అని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుత పరిస్థితి ఎలా వుంది అనేది చూస్తే.. పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర వైపు 560 కి.మీ దూరం లో, ఒడిశా బాలాసోర్‌కు ఆగ్నేయ దిశగా 590 కి.మీ, పశ్చిమ బెంగాల్ దిఘాకు ఆగ్నేయ దిశగా 670 కి.మీ దూరం లో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఇది క్రమాన వాయువ్య దిశకు కదులుతోంది. ఇది ఇలా ఉంటే 26వ తేదీ ఉదయం ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకుంటుంది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ మీదుగా పారాదీప్ - సాగర్ ఐలాండ్స్ వద్ద 26వ తేదీ సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల లో వడ గాలుల తో కూడిన వర్షం:
ఈ తుఫాను కారణంగా కొన్ని చోట్ల ఎండల తీవ్రత పెరుగుతుందని, వడ గాలులు వీస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడ గాలులు వీస్తాయని అంటున్నారు అధికారులు.
తుఫానుని దృష్టిలో పెట్టుకుని ప్రభత్వం జారీ చేసిన హెల్ప్‌లైన్స్:
విశాఖపట్నం లోని రెస్క్యూ బృందాలను ఐఎన్ఎస్ డేగా నుంచి నేవల్ హెలికాఫ్టర్లు, ఇండియన్ ఆర్మీకి చెందిన మూడు ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి.
ఇది ఇలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా ఆక్సిజన్ అవసరం అవుతోంది. అయితే కొరత రాకుండా, పేషంట్స్ కి ఇబ్బంది కలుగకుండా ఉండాలని బాధితులకు ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్మ్డ్ ఫోర్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది.
ఇది ఇలా ఉంటే భువనేశ్వర్, కోల్‌కతాకు పది, పోర్ట్‌బ్లెయిర్‌కు ఐదు విపత్తు సహాయక బృందాలు తరలించారు. తూర్పు నౌకాదళం నుంచి 8 యుద్ధ నౌకలు, నాలుగు డైవింగ్ బృందాలు, 10 ఫ్లడ్ రిలీఫ్ కోలమ్స్‌ని తరలించారు.
అంతే కాదు భారత రక్షణ దళాలు తుపాన్ సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 950 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాల తో పాటు జామ్ నగర్, వారణాసి, పాట్నా, అరక్కోణం నుంచి 70 టన్నుల సహాయక సామాగ్రిని కోల్‌కతా, భువనేశ్వర్, పోర్టు బ్లెయిర్‌కు పంపించారు.
కరోనాని దృష్టి లో ఉంచుకుని చేసిన పనులు ఇవి:
కరోనా మహమ్మారి కారణంగా ఎందరో మంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. అక్కడ కూడా కొరత ఉన్నట్లు మనం చూస్తున్నాం.
అయితే ఈ కరోనాని దృష్టిలో పెట్టుకుని ఈ తుఫాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఒడిస్సా నుండి అదనపు ఆక్సిజన్ నిల్వలను తెప్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి అన్నారు.
మూడు ప్లాంట్లతో పాటు అన్ని ఆసుపత్రికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా రెండు రోజులుగా ఒడిస్సా నుండి వస్తున్నట్లు కూడా ఆయన అన్నారు. ఇప్పటికే ఒడిశా రోర్కెల నుండి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తగ్గించినట్లు చెప్పారు. రోడ్డు మార్గంలో మరో రెండు వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కూడా తీసుకు వస్తున్నట్లు సంప్రదింపులు జరుపుతున్నారు.
అదే విధంగా విశాఖపట్నం లోని స్టీల్‌ప్లాంట్, ఎలెన్‌బారీ ఇండస్ట్రీస్, శ్రీకాకుళంలోని లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మూడు ప్లాంట్ల ద్వారా 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
అంతే కాక సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే 49 ఆక్సిజన్ రీఫిల్లర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టింది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అన్ని ఆసుపత్రుల్లో ఉండేట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు:
తుఫాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులను ఆదేశించారు జగన్. తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేస్తామని సీఎంకు అధికారులు చెప్పారు.
తుఫాన్ వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను జగన్ సూచించారు ఆస్పత్రులకు కరెంట్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆసుపత్రులకు కేటాయించాలని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న కోవిడ్ పేషెంట్లను తరలించడం అవసరం అనుకుంటే ఆశ్చర్యంగా వెంటనే పూర్తి చేయాలని కూడా అన్నారు.
కోవిడ్ సెంటర్లలో కరెంటు సప్లై కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తి స్థాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా లోని లోతట్టు ప్రాంతంలో నుంచి ప్రజల తరలింపును వెంటనే ప్రారంభించామన్నారు.