BREAKING NEWS

బ్లాక్ ఫంగస్ విజృంభణ... భయాందోళనలతో ప్రజలు...!

కరోనా వైరస్ సెకండ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అదే విధంగా వేలల్లో ప్రజలు మరణిస్తున్నారు. ఇటువంటి సమయం లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఈ టెన్షన్ ఏ ఎక్కువయింది అనుకుంటే.. ఒక పక్క బ్లాక్ ఫంగస్ వల్ల ఎందరో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. నిజంగా ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని చెప్పొచ్చు.
 
బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ గురించి కొన్ని విషయాలు చూద్దాం... బ్లాక్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇది అన్ని రాష్ట్రాలకు కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది.
 
తెలంగాణ  లో ఇప్పటికే ఒక వ్యక్తి బ్లాక్ ఫంగస్ కారణంగా మృతి చెందడం జరిగింది. అలానే ఉత్తరప్రదేశ్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో 73 కేసులు బయటపడ్డాయి. అలానే వారణాసిలో 20 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. లక్నో లో 15, గోరక్ పూర్ లో 10, ప్రయాగ్ రాజ్ లో 6,  గౌతమ్ బుద్ధ నగర్ లో ఐదు, మీరట్లో 4, కాన్పూర్ మధురలో రెండు చొప్పున కేసులు నమోదవగా.. ఆగ్రా లో ఒక కేసు నమోదు అయ్యింది.
 
నిజంగా దీని వల్ల చాలా మంది సతమతమవుతున్నారు. మధురలో ఇద్దరు, లక్నో లో ఒక పేషెంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగా కంటి చూపును కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యం లో యూపీలోని యోగి ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే దాన్ని ఎదుర్కొనేందుకు 14 మంది వైద్య నిపుణుల తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
 
ఒకవేళ కనుక ఫంగస్ ఉందో లేదో అనేది ఈ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు యూపీ వైద్యులు చెప్పడం జరిగింది. కళ్ళు, ముక్కు చుట్టూ ఎర్రబడడం. జ్వరం, తలనొప్పి, దగ్గు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, నొప్పులు, బ్లడ్ వాంటింగ్స్, చురుకుదనం లో మార్పులు రావడం లాంటివి దీనికి లక్షణాలు అని గుర్తించారు. అయితే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉండే వాళ్ల లో సుదీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడే వాళ్లలో బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్ నియంత్రించ లేని స్థాయిలో ఉన్న వారికి కూడా ఈ ప్రమాదం వస్తుందని వైద్యులు అంటున్నారు.
 
కరోనా బాధితులు బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం తో దీనిని గుర్తించాలని చికిత్స చేయడం చాలా అవసరమని ప్రజలకి కూడా దీని మీద అవగాహన కల్పించడం చాలా అవసరమని తెలుస్తోంది. ఎక్కువగా అనారోగ్యంతో బాధ పడే వాళ్ళకి చూపు కూడా పోతోంది. 
 
అయితే ఈ తప్పులు మాత్రం మీరు అస్సలు చేయొద్దని వైద్యులు అంటున్నారు..
 
స్టెరాయిడ్స్ పద్ధతి ప్రకారం వాడాలి. అవసరం  దాటి వాడకూడదు.

చికిత్సలో మోతాదు ప్రకారమే యాంటీబయాటిక్స్ ని వాడాలి. అంతే కానీ ఎక్కువ వాడడం వల్ల ప్రమాదం వుంటుంది.

 మధుమేహంతో బాధ పడే వాళ్ళకి కరోనా వస్తే  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక రక్తంలోని చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రక్తం స్థాయిలు ఎక్కువే వరకు చెక్ చేయించుకోకుండా ఉండకండి.

ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యూమిడీఫైర్స్ లో పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలి. అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

కరోనా సోకి చికిత్స తీసుకునేటప్పుడు ముక్కలు మూసుకుపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోవడం పొరపాటు. కాబట్టి తప్పకుండా అవసరమైతే వైద్యుల్ని సంప్రదించండి.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూడా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ జాగ్రత్తగా ఉండటం. మొదటి దశ తో పోలిస్తే ఈ కరోనా  వైరస్ తీవ్రత ఈ దశ లో చాలా ఎక్కువగా ఉంది. ఒక వైపు లాక్ డౌన్ ని  కూడా మనం చూస్తున్నాం. ఈ మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండడం ముఖ్యం.
 
ఒకవేళ బయటకు వెళ్లే అవసరం వస్తే ఖచ్చితంగా మాస్కు ధరించాలి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం కూడా చాలా అవసరం. చాలామంది 25 నుండి 40 సంవత్సరాల మధ్య లోపు ఉన్న వయసు వారు ప్రాణాలు కోల్పోవడం భయాందోళనలను కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో రోజుకి పది మందికి పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం కలవర పెడుతోంది అనే చెప్పాలి.
 
మనో ధైర్యమే కరోనా కి దివ్యౌషధం:
 
 కరోనా పాజిటివ్ వస్తే మానసిక ఒత్తిడి పెరిగి భయభ్రాంతులకు ఊపిరి వదిలేస్తున్నారు కొంతమంది మరి కొందరైతే చుట్టుపక్కల వాళ్ళకి లేదా వార్తల్లో కరోనా అంటే వాళ్ల గుండెల్లో పిడుగు పడినంత పని అవుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి.
 
మనసు ప్రశాంతంగా ఉండే పనులు చేసుకోవాలి. యోగా, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవాలి. మీకు కనుక ఊపిరి ఆడటంలేదు అనిపిస్తే టెన్షన్ పడకుండా ఆక్సీ మీటర్ తో చెక్ చేసుకోండి. ఆక్సి మీటర్ ని ఉపయోగించడం వల్ల మీ ఆక్సిజన్ లెవెల్స్ మీకు తెలుస్తాయి. వీలైనంత వరకు ధైర్యంగా ఉండండి. అదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి చేయూవలి. ఎంత ధైర్యంగా ఉంటే అంత రక్షణ ఉంటుంది.
 
కరోనా వచ్చిన కొంతమంది రోగులుని మీరు గమనిస్తే వారి పరిస్థితి భయపడకుండా ఎంతో ధైర్యంగా ఉంటున్నారు. చిన్నపాటి ఒత్తిడి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ప్రశాంతకరమైన పనులు చేయడం పాజిటివ్ గా ఆలోచించడం లాంటివి చేయండి.