BREAKING NEWS

ఇప్పటికైనా మీరు మేలుకోవాలి అని కేంద్రానికి లాన్సెట్ హెచ్చరిక...!

కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా విలయతాండవంని ఆపలేకపోతున్నాము. ఎందరో మంది ఆసుపత్రి పాలైపోతున్నారు. చాలా మంది కరోనా కారణంగా మరణిస్తున్నారు. నిజంగా కరోనా ప్రతి ఒక్కరిని కూడా అతలాకుతలం చేస్తోంది. మరో పక్క కరోనా వైరస్ టీకాలు కూడా కొనసాగుతున్నాయి.
 
ప్రజలు ఇంటి పట్టునే ఉండడం ముఖ్యం. అదే విధంగా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు తప్పని సరిగా మాస్కు ధరించాలి. కరోనా వైరస్ ఎంతో తీవ్రంగా ఉన్నా సరే చాలా మంది మాస్కులు ధరించడం లేదు అని నిపుణులు కూడా ఈ విషయాన్ని చెప్పారు. మహమ్మారి అయి పోయినా సరే చాలా మంది మాస్కులు ధరించడం లేదని ఇంత లైట్ గా తీసుకుంటే కష్టమనే చెప్తున్నారు.
 
శానిటైజర్ ని లేదా హ్యాండ్ వాష్ ను ఉపయోగించి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. మంచి పోషకాహారం తీసుకుని రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవాలి. అయితే కరోనా వైరస్ కేవలం వైరస్ బారిన పడిన వాళ్ళు దగ్గినా, తుమ్మినా మాత్రమే కాదు గాలి ద్వారా కూడా వస్తుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని వెల్లడించింది.
 
ఎవరైనా ఇన్ఫెక్షన్ బారిన పడినా, వాళ్ళు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా ఆ చిన్న చిన్న తుంపరలు గాలి లో ఉండి వైరస్ ని ఒకరి నుంచి మరొకరికి అందిస్తాయి. ఏకంగా ఇవి 15 నిమిషాల నుంచి గంట పాటు కూడా ఉండొచ్చు. వెంటిలేషన్ సరిగ్గా లేని చోట ఇది మరీ ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి గమనించాలి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ తీవ్రంగా ఉండడం తో దేశ వ్యాప్తంగా విధించాలని ప్రధాని మోదీ కి చాలా వైపు నుంచి ఒత్తిడి వస్తోంది.
 
దేశంలో కోవిడ్ పరిస్థితి పై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కరోనా మహమ్మారి ఆగస్టు 1 వరకు ఉంటుందని సుమారుగా పది లక్షల మంది కరోనా వైరస్ కి గురువుతారని కూడా హెచ్చరించింది. ఎక్కువ మంది మరణించకుండా ఉండాలంటే నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పింది.
 
ఒక వేళ కనుక సరిగ్గా జాగ్రత్తలు పాటించక పోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే అందరికీ బాధ్యత ప్రధాని మోడీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఈ సంక్షోభ సమయం లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని అణచి వేయాలని ఈ తీరు చాలా బాధాకరమని ఇలాంటి చర్యలు ఎంత మాత్రం క్షమించమని తెలిపింది.
 
ఇప్పటికే అనేక మంది కరోనా బారిన పడడం తో ఆసుపత్రి లో అన్నీ కూడా నిండి పోయాయి. ఒక పక్క మందులు, బెడ్లు, ఆక్సిజన్ వంటి కొరత కూడా చూస్తున్నాం. తగినంత మంది వైద్యులు సిబ్బంది కూడా లేరు. కాబట్టి సరిగ్గా వ్యవహరించాలని లాన్సెట్ పేర్కొంది.
 
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇటువంటి సంక్షోభం నుండి ఎలా బయట పడాలి ఆలోచించాలని కూడా చెప్పింది. కోవిడ్ కట్టడి చర్యలు శరవేగంగా చేపట్టాలని ముందుగా లాక్ డౌన్  విధించాలని ఆ తరువాత టీకాలను వేగంగా పంపిణీ చేయాలని కూడా సూచించింది.
 
ఇదిలా ఉంటే ఢిల్లీ లో మూడో సారి లాక్ డౌన్ పొడిగించారు. దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ని మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ లాక్ డౌన్ ని 17 వరకు ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆదివారం ప్రకటించడం జరిగింది.
 
గత నెల 19 నుంచి ఢిల్లీ లో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  కేజ్రీవాల్ ఇప్పుడు మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు చెప్పడం జరిగింది. లాక్ డాన్ విధించిన తర్వాత ఢిల్లీ లో 35 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని చెప్పారు. ఒక దశ లో రోజు 25 వేలకు పైగా కేసులు వచ్చాయని ప్రస్తుతం 17,000 కి తగినట్లు కేజ్రీవాల్ చెప్పడం జరిగింది.
 
దీనితో లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.  ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడానికి సద్వినియోగం చేసుకుంటాం.. కేంద్ర సహకారం తో ప్రస్తుతం పరిస్థితి కొంత పర్వాలేదు అని కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. ఆక్సిజన్ కొరత పై ఢిల్లీ హైకోర్టు సుప్రీం కోర్టు సీరియస్ గానే స్పందించిన విషయం మనం చూసాం.
 
కేంద్రం పై న్యాయ స్థానాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆక్సిజన్ సరఫరా, పంపిణీకి 12 సభ్యుల తో జాతీయ స్థాయి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రోజు వారి కరోనా కేసులు నాలుగు లక్షలు దాటుతున్నాయి. మరణాలు కూడా రెండో రోజు వరుసగా నాలుగు వేలు నమోదయ్యాయి.