BREAKING NEWS

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచనలు...!

కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టి పీడిస్తోంది. ఇటువంటి సమయం లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కరోనా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసేసింది. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం తో జస్టిస్ డి వై చంద్ర చడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర బట్ తో కూడిన సుప్రీం కోర్టు తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు ఇచ్చింది వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.
 
చాలా మంది కరోనా పేషెంట్స్ ఆక్సిజన్ లేక మరణిస్తున్నారు. ప్రాణ వాయువు కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యం లో దేశ వ్యాప్తంగా అత్యవసరాలు కోసం బఫర్ స్టాక్ లో ఆక్సిజన్ ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో కేంద్రం నిర్వహించాలి.
 
దేశ వ్యాప్తంగా వికేంద్రీకరించాలి. అయితే రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలు నిర్వహించాలని  సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే లాక్ డౌన్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. 
 
సామాజిక ఆర్థిక ఇబ్బందులు కూడా లాక్ డౌన్ ఉంటే ఎక్కువ అవుతాయి. అయితే కరోనా నిజంగా అనేక ఇబ్బందులు తీసుకొస్తున్న నేపథ్యం లో ప్రజల ఆరోగ్య సంరక్షణ గురించి దృష్టి లో ఉంచుకుని లాక్ డౌన్ విధించడం పై పరిశీలించమని చెప్పింది. 
 
లాక్ డౌన్ కనుక విధించినట్లు అయితే వర్గాల అవసరాలను తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని అంది. అదే విధంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రయోజనాల కోసం కొన్ని సూచనలు, సలహాలు కూడా సుప్రీం కోర్టు ఇవ్వడం జరిగింది. వాటి కోసం కూడా మనం ఇప్పుడు చూద్దాం..!
 
వీటిపై ప్రభుత్వాన్ని దృష్టి పెట్టమని చెప్పింది. అవి ఏమిటి అనేది చూస్తే.... సామూహిక సమావేశాలు, సభలు, వైరస్‌ని ఎక్కువగా వ్యాపించడానికి దారి తీస్తాయి. కనుక ఈ  కార్యక్రమాల పై కఠిన నిషేధం విధించాలి అని తెలిపింది.
 
అలానే రూ.50 లక్షల కరోనా బీమా వర్తించిన 22 లక్షల మంది వైద్య ఆరోగ్య సిబ్బంది లో ఇప్పటి వరకు మరణించిన వారికి సంబంధించిన 287 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు చెప్పారు. 
 
మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటి వరకు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి అని అన్నారు.
 
ఈ మహమ్మారి సమయం లో తమ ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యుల సేవలను గుర్తించడానికి వాళ్ళ కోసం జాతీయ స్థాయి లో ఒక విధానం రూపొందించాలి. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి అని చెప్పడం జరిగింది.
 
ఇది ఇలా ఉండగా ఎంతో మందిని పగలు, రాత్రి అనేది లేకుండా సేవలని అందించిన వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు చూడలేదు. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిష్కరించాలి అని చెప్పారు.
 
అదే విధంగా  వైద్య సిబ్బందికి కావాల్సిన ఆహారం, పని విరామ వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి స్థలం, రవాణా సౌకర్యం ఇవ్వాలని తెలిపింది. అదే విధంగా కోవిడ్ కి గురైనప్పుడు జీతాలు, సెలవుల్లో కోతలు విధించరాదు అని వెల్లడించింది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక సమయం విధులు నిర్వహించిన వారికి ఓవర్‌టైం అలవెన్స్‌ ఇవ్వాలి అని చెప్పింది.
 
సాయం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా అర్థించే వారిని అధికార యంత్రాంగం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది.
 
అలానే ఢిల్లీ లో ఆక్సిజన్‌ సమస్యను మే 3వ తేదీ అర్ధ రాత్రి లోపు పరిష్కరించండి అని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఇలా సూప్రీం కోర్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సూచనల్ని ఇవ్వడం జరిగింది. 
 
ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో  కరోనా కేసులు పెరుగుతుండడం తో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 5 నుంచి పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే... ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే షాపులని తెరిచి ఉంచాలని అంది. 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 
 
ఇప్పుడు కరోనా తీవ్రంగా ఉండడం తో కోవిడ్ పరిస్థితుల పై ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఎక్కువగా ఉండడం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల పాటు కర్ఫ్యూ  ఉంటుంది. 
 
అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.. ఇప్పుడు పగటి పూట కూడా కర్ఫ్యూ అమలు లోకి వస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ అమలలో ఉండనుంది.  ఇలా ఈ మార్పులు చేయడం జరిగింది. దీనితో కరోనా వైరస్ ని కట్టడి చెయ్యడానికి ఇది బాగా వర్క్ అవుట్ అవ్వొచ్చు.