BREAKING NEWS

పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మార్గాలు...!

రోగ నిరోధక శక్తి ఇప్పుడు చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్నారులు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఈ మహమ్మారి సమయం లో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పై కాస్త శ్రద్ధ పెట్టాలి. పిల్లలు కూడా కరోనా బారిన పడి పోతున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు మరింత శ్రద్ధ తీసుకోవాలి.
 
మంచి పోషకాహారం తీసుకోవడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు తినడం వలన ఆరోగ్యాన్ని మరింత ఇంప్రూవ్ చేస్తాయి. అయితే పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని చిట్కాలని చెప్పారు. వీటి ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం సులభమవుతుంది.
 
అంతే కాకుండా మెటబాలిజం బాగుంటుంది. అజీర్తి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా పిల్లల్లో అనేక మార్పులు మీరు గమనించ వచ్చు. అయితే మరి ఇక ఆయుర్వేద మూలికల గురించి చూసేద్దాం...
 
 మీ పిల్లలకి ఈ ఆయుర్వేద మూలికలు ఇచ్చారంటే తప్పకుండా వాళ్లలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్పడం జరిగింది. ఇక వాటి కోసం చూస్తే...
 
ఉసిరి:
 
 ఉసిరి వల్ల చాలా రకాల బెనిఫిట్స్ మనం పొందచ్చు. ముఖ్యంగా ఉసిరి లో విటమిన్ సి ఉంటుంది. ఇది దగ్గు, జలుబు కి కూడా బాగా పని చేస్తుంది. ఉసిరి లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్ నుంచి రిలీఫ్ కూడా ఇస్తుంది అలాగే కంటి సంబంధిత సమస్యలు కూడా ఉసిరి తరిమికొడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కూడా మీ సొంతమవుతుంది. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 
 తిప్పతీగ:
 
తిప్పతీగని ఆయుర్వేద వైద్యం లో ఎక్కువగా వాడుతుంటారు. దీనిలో ఔషధీ గుణాలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా పనికొస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దగ్గు జలుబు వంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి మీ పిల్లలకి తిప్పతీగను కూడా మీరు ఇవ్వచ్చు.
 
 తులసి:
 
 మనం పూజించే తులసి లో ఔషద గుణాలు కూడా ఉన్నాయి. దీని కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లోనే ఉంటుంది. తులసి లో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు విటమిన్ కె సమృద్ధిగా ఉన్నాయి. జ్వరాన్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది అదే విధంగా హృదయ సంబంధిత సమస్యలకు కూడా ఇదే చెక్ పెడుతుంది. తులసిని మీ పిల్లలకు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
 
కాబట్టి ప్రతి రోజూ తులసి ఆకుల్ని కానీ తులసి రసాన్ని కానీ వాళ్ళకి ఇవ్వండి. దీంతో వారి ఆరోగ్యం బాగుంటుంది పైగా ఎన్నో సమస్యలకు కూడా వాళ్లు సులువుగా చెక్ పెట్టొచ్చు. ఆయుర్వేదం లో తులసి లో అనేక ఔషధాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా దగ్గు మందు వంటి వాటిలో తులసి కచ్చితంగా వాడతారు.
 
పసుపు:
 
 పసుపు లో మంచి గుణాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి రోజు మనం వంటల్లో ఉపయోగించే ఈ పసుపు లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అదే విధంగా పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనం చేసుకునే వంటల్లో ఇవి మంచి రుచి కూడా ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పసుపుని తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు ఉండవు. 
 
అంతే కాదు పసుపులో యాంటి క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే చర్మానికి కూడా పసుపు ఎంతగానో మేలు చేస్తుంది. పసుపుని అనేక ఫేస్ ప్యాక్స్  లో కూడా వాడుతూ ఉంటారు. ఇలా పసుపు అందానికి ఆరోగ్యానికి మరియు ఏమైనా గాయాలైన వెంటనే పరిష్కారం చూపిస్తుంది. ఇలా చిటికెడు పసుపు ఎంతో మాయ చేస్తుంది
 
అశ్వగంధ:
 
 అశ్వగంధ లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది సులువుగా గాయాలుని మాయం  చేస్తుంది మానసిక ఆరోగ్యం కూడా అశ్వగంధ తో మనం పెంచుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి బాగా సహాయ పడుతుంది. పెద్దలు పిల్లలు తమ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అశ్వగంధ ఉపయోగించుట ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.  బ్రెయిన్ ఫంక్షన్ ని డెవెలప్ చేసుకోవడానికి కూడా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది.
 
పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పకుండా వాళ్ళకి ఇవి ఇవ్వండి. అశ్వగంధ క్యాప్సిల్స్, అశ్వగంధ పొడి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతున్నాయి. కాబట్టి సులువుగా వాళ్ళు  తీసుకోవచ్చు ఇప్పుడు కరోనా మహమ్మారి చాలా తీవ్రంగా మారింది. రోజుకి ఎంతో మంది కరోనా  వైరస్ బారిన పడిపోతున్నారు ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం.
 
బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా మాస్క్ ధరించడం సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటివి చేయాలి. అదే విధంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. రోగ నిరోధక శక్తి బాగా పెంచుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్ ఇలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించడం వల్ల ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు.