BREAKING NEWS

తాతకి తగ్గ మనవడు: యంగ్ టైగర్

సినీ పరిశ్రమలో నటవారసులు వస్తూనే ఉంటారు. కానీ నిలకడగా నిలదొక్కుకొని స్టార్ డమ్ దక్కించుకొన్నవారు కొద్దిమందే ఉంటారు.

తాత గొప్ప స్టార్ హీరో...
బాబాయ్ మరో స్టార్..
నాన్న ఇంకో స్టార్...

ఇంట్లో వారసుడిగా ఆదరణ దక్కలేదు. అయితేనేం,
తన నటనతో 'తాతకు తగ్గ మనవడని'పించుకున్నాడు.
 
హీరో కం విలన్ గా 'జై లవకుశ'లో త్రిపాత్రాభినయం చేసి అబ్బురపరిచారు. హాస్యంతో ద్విపాత్రాభినయం చేసి 'అదుర్స్' అనిపించారు.

'రాఖీ'వరకు లావుగా ఉన్నా, 'యమదొంగ'లో ఎవ్వరు ఊహించనంతలా సన్నబడ్డారు. 

'నాన్నకు ప్రేమతో' అంటూ క్లాస్ లుక్ తో లక్షల్లో ఫాలోవర్స్ ను దక్కించున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంగా వస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

ఆయనే యంగ్ టైగర్- 'ఎన్టీఆర్'…
 
చిన్న వయసులో అల్లరిని మాన్పించడానికనీ నేర్పిన కూచిపూడి.. 
భవిష్యత్తును నిర్దేశిస్తుందని.. ప్రత్యేకంగా అభిమానుల్ని తెచ్చిపెడుతుందని ఈ రంగంలోకి దిగేదాక ఆయనకు తెలియదు.
ఒక హిట్ దక్కిందనుకునేలోపు ఇంకో ప్లాఫ్…మరోవైపు తండ్రిని, అన్నని ఆక్సిడెంట్ మింగేసింది. ఇలా ఆయన సినీ,జీవిత కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో 'కొమరం భీమ్'గా అభిమానులకు విందు ఇవ్వబోతున్నారు - ఎన్టీఆర్. ఈ నెల(మే 20న) ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ, జీవిత విశేషాలనూ ప్రత్యేకతంగా తెలుసుకుందాం:
 
బాల్యం: -
1983 మే 20న నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు మెహదీపట్నంలో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నపుడు అల్లరి బాగా చేస్తున్నాడని, వాళ్ళమ్మగారు కూచిపూడి నృత్యం నేర్పించారు. నృత్యం నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. హైదరాబాద్ లోని విద్యారణ్య పాఠశాలలో హై స్కూల్ చదువు పూర్తి చేశారు. 
 
సినీరంగ ప్రవేశం, విశేషాలు :-

◆1991లో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలో భరతుని పాత్రతో తెరంగేట్రం చేశారు. ఈ పాత్రలో ఎలా నటించాలి, ఎలా హావభావాలు పలికించాలనే విషయాలపై తాతగారు మెళకువలు నేర్పించి, ఎన్టీఆర్ కు నటగురువయ్యారు. 

◆1996 ఏప్రిల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'బాల రామాయణం'తో ఉత్తమ బాలనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తారక్ నటనను మెచ్చిన తాతగారు 'వీరిది నా అంశ, భవిష్యత్తులో గొప్ప నటులు అవుతారని' దీవించారంట. 

◆నందమూరి కుటుంబం తనని, తన తల్లిని అంగీకరించకపోయినా తాతగారు ఆదరించారని సంతోషపడ్డారు. కానీ అదే సంవత్సరంలో తాత నందమూరి తారకరామారావుగారు చనిపోవడం వారిద్దర్ని బాగా కుంగదీసింది. 

◆రాఘవేంద్రగారిని కలిసి పరిచయం చేసుకుని సినిమావకాశం ఇవ్వమని అడిగారట. 2001లో 'నిన్ను చూడాలని' పేరుతో సినిమా విడుదలైంది. ఆ సినిమా బాగా ఆడకపోయిన అచ్చం తాతగారిలానే ఉన్నారని 'తాతకి తగ్గ మనవడని' ప్రశంసించారట. రాజమౌళిగారు స్టూడెంట్.1 సినిమా తీశారు. అది మంచి హిట్ అందుకుంది. తరువాత 'సుబ్బు' ప్లాఫ్ అయింది. 

◆వి.వి. వినాయక్ గారు 'ఆది' సినిమా కథను సిద్ధం చేసి, వినిపించారు. 2002 మార్చిలో ఈ సినిమా విడుదలై స్టార్ పేరు తెచుకున్నారు. 'అల్లరి రాముడు', 'నాగ' పరాజయం పొందాయి. 

◆2003లో 'సింహాద్రి' హిట్ అయింది. ఇది చూసి తారక్ మావాడంటూ బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ లు ఎన్టీఆర్ ను తమ్ముడంటూ పిలవడం మొదలు పెట్టారు. 
వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ భారీ పరాజయాలు పొందాయి. 

◆2006లో వచ్చిన 'రాఖీ' హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. 

◆నువ్వు సన్నబడితేనే నీతో 'యమదొంగ' తీస్తానని దర్శకుడు రాజమౌళి చెప్పడంతో లైపోసెషన్ చేయించుకొని ఎవరూ ఊహించినంతగా సన్నబడ్డారు. 

◆2007 ఆగస్టులో ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. చూసినవారంతా యముడి పాత్రకు ఫిదా అయిపోయారు. 

◆2009లో తెలుగు దేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా బాబాయ్ బాలకృష్ణ అనడంతో సరేనని వెళ్లారట. అలా ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా నల్గొండలోని సూర్యాపేట వద్ద ఆక్సిడెంట్ జరిగింది. బాగా గాయాలయ్యాయి. కనీసం సంవత్సరంపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, డాన్స్ కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. కానీ ఆరు నెలల్లో కోలుకుని 'అదుర్స్' సినిమా షూటింగ్ లో పాల్గొని, డాన్స్ లకు స్టెప్పులు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 2010లో విడుదలై మంచి హిట్ సాధించింది. అదే హిట్ ఖాతాలో 'బృందావనం' చేరింది. 

◆2011లో వచ్చిన 'శక్తి', 'ఊసరవెల్లి', 'దమ్ము' నిరాశపరిచాయి. 2013లో వచ్చిన 'బాద్ షా' యావరేజ్ హిట్ అయింది. 'రామయ్య వస్తావయ్యా', 'రభస' ఆయన సినీ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచాయి. 

◆2014 డిసెంబర్ లో అన్నయ్య జానకీ రాం ఆక్సిడెంట్ లో మరణించారు. 

◆2015లో 'టెంపర్' విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లోని మరో కొత్త కోణాన్ని మనకు పరిచయం చేశారు. ◆2016లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలోని ఆయన లుక్ కి లక్షల్లో ఫాలోవర్స్ రావడం విశేషం! 
అదే ఏడాదిలో వచ్చిన 'జనతా గ్యారేజ్'తో మరింతగా అభిమానుల్ని చేరువ చేసింది. 

◆2017లో 'జై లవ కుశ'లో చేసిన త్రిపాత్రాభినయంతో తన నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రంలో 'జై' పాత్ర ప్రత్యేకతను చాటుకుంది. 

◆2018 ఆగస్టు 29న నాన్న హరికృష్ణ ఆక్సిడెంట్ లో మరణించడం తీరని లోటనే చెప్పుకోవచ్చు. అదే సంవత్సరంలో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' హిట్ తో బాధ నుంచి కోలుకున్నాడు.

సేఫ్ డ్రైవింగ్ గురుంచి పలు ఆడియో ఫంక్షన్లు, మూవీ మీట్ లలో తన కుటుంబం ఇద్దర్ని కోల్పోయిందని.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయమని, మీకోసం ఇంటి దగ్గర మీవాళ్ళు ఎదురుచేస్తుంటారని ఎంతో ఉద్వేగ భరితమైన స్పీచ్ ఇచ్చారు. 

◆2017లో మాటీవీలో ప్రసారమైన 'బిగ్ బాస్'కి వ్యాఖ్యాతగా చేసి, 72రోజులపాటు ఆ షోని రక్తి కట్టించాడు. ఆ షో జరిగినన్నీరోజులు మాటీవి అత్యధిక రేటింగ్ ను సాధించింది.

◆2011 మే 5న లక్ష్మీ ప్రణీతతో వివాహం జరిగింది. వీరికి అభిరామ్, భార్గవ్ రామ్ ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నివాసముంటున్నారు.
 
గుర్తింపు, అవార్డులు:-

◆1996లో 'బాల రామాయణం'కు నంది అవార్డుతో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది.

◆2001లో 'ఆది'కి నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చాయి. 

◆2003లో 'సింహాద్రి', 'యమదొంగ'కు, సిని'మా' అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.

◆2008లో 'కంత్రీ'కి ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2010లో 'అదుర్స్', 'బృందావనం'లకు ఫిల్మ్ ఫేర్ లు, అలాగే 2015లో వచ్చిన 'టెంపర్'కు ఫిల్మ్ ఫేర్, కళాశోభా అవార్డులు వరించాయి.

◆2016లో 'జనతా గ్యారేజ్'కు ఐఫా అవార్డ్ రాగా, 'కింగ్ ఆఫ్ బాక్సాఫీస్'గా ఈ సినిమాకు గుర్తింపు దక్కింది. ◆2017లో 'జై లవకుశ'కు 'త్రీ రోల్ ఎక్స్ పరిమెంట్' అవార్డు వచ్చింది.
 
ఇతరాంశాలు:-

◆సీనియర్ ఎన్టీఆర్ కు మనవడు ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అచ్చు గుద్దినట్లు తనలానే ఉన్న పోలిక, ఒకసారి చెప్పిన డైలాగ్ ను పొల్లుపోకుండా తిరిగి అప్పజెప్పడం చూసి ఎంతో మురిసిపోయేవారట.

◆ఎన్టీఆర్‌ నటించిన ‘బాద్‌షా’ జపనీస్‌లో డబ్‌ అయింది, అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, రజనీకాంత్‌ తర్వాత జపాన్‌లో అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటుడుగా తారక్‌ నిలిచాడు.

◆ఎన్టీఆర్‌ తను పనిచేసే దర్శకులకు ప్రత్యేకమైన పేర్లు పెట్టుకున్నారు.

వి.వి.వినాయక్‌ను 'వినయ్‌ అన్న' అని, రాజమౌళిని 'జక్కన్న' అని, సురేందర్‌రెడ్డిని 'సూరి' అని, వంశీని 'కటకటలా రుద్రయ్య' అని ప్రేమగా పిలుస్తారట.

◆ఎన్టీఆర్‌ ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ చిత్రం ‘దాన వీర సూర కర్ణ’.

◆ఎన్టీఆర్‌ లక్కీ నెంబర్ '9'. అందుకే ఆయన వాహనాలకు 9 నెంబర్‌ ఉంటుంది. అంతేకాదు, ట్విటర్‌ ఖాతా కూడా తారక్‌ 9999 అని ఉంటుంది.

◆ఎన్టీఆర్‌కు వంట చేయడమంటే చాలా ఇష్టం! వెజ్‌, నాన్‌వెజ్‌, బిర్యానీ ఏదైనా ఇట్టే వండేస్తారట.

◆‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్‌’, ‘శక్తి’ చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా, ‘జై లవ కుశ’లో త్రిపాత్రాభినయం చేశారు.

◆రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించారు. ‘స్టూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ ఈ మూడు సినిమాలు హిటయ్యాయి. 

◆ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నారు. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఇందులో మరొక స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తో కలిసి తెరని పంచుకోబోతున్నారు. అది కూడా 'కొమరం భీమ్'లాంటి శక్తిమంతమైన పాత్రలో కనిపించడం విశేషం!
 

TAGS: , ,

Photo Gallery