BREAKING NEWS

క్యా(వ)రీ బ్యాగ్

                  ఓ పెద్ద షాపింగ్ మాల్.... తనకు కావలసిన సామన్లన్ని కొనుక్కుని బిల్లింగ్ కౌంటర్ కు వచ్చాడు మహేష్... 1275 రూపాయల బిల్ చేశాడా ఎంప్లాయ్... మహేష్ తీసుకున్నవి అన్నీ ఎమ్మార్పీ ఐటమ్స్.  అన్నీ లెక్కేసుకుంటే 1270కి లెక్క తేలింది. మరి ఆ 5 రూపాయలు ఎక్కువ ఎక్కడ నుంచి వచ్చింది??? అర్థం కాలేదు...

                   అదే షాప్ లో మరో పెద్దాయన కు కూడా ఇదే పరిస్థితి.. మొత్తం 2000 రూపాయలు బిల్ కాస్త 2005 అయ్యింది. మరో కస్టమర్ కి టోటల్ బిల్ మీద 10 రూపాయలు ఎక్కువ. ఏంటి ఇదంతా అనుకున్నారు అందరూ. కట్ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఆ 5/10 రూపాయలు వాళ్ళు మనకి ఇచ్చే "క్యారీ బ్యాగ్" కోసం అట... ఏ చిన్న కిళ్ళీ కొట్టుకు వెళ్ళినా సరే ఒక 20 రూపాయల వస్తువు కొంటేనే ఒక చిన్న పాలిథిన్ కవర్ ఇస్తారు.

అలాంటిది వేలకు వేలు ఖరీదు చేసే బడా షాపింగ్ మాల్స్ 5 రూపాయల విలువ చేసే కవర్ ఎందుకు ఇవ్వరు?? ఆ చిన్న అమౌంట్ కదా.. ఇచ్చేస్తే ఏమవుతుందిలే??? అనుకుంటారు చాలా మంది. కానీ ఇది కరెక్ట్ కాదు. నిత్యం లక్షల రూపాయల ఆదాయం వచ్చే అలాంటి షాపింగ్ మాల్స్ లో క్యారీ బ్యాగ్ ల ద్వారా కూడా మరింత సొమ్ము చేసుకుంటున్నారు. 

                      మనకు అమ్మే ప్రతి క్యారీ బ్యాగ్ మీద వాళ్ళ షాపింగ్ మాల్ బ్రాండ్ లోగో , పేరుతో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చిన్న లాజిక్ గమనించాలి. క్యారీ బ్యాగ్ ల మీద వారి బ్రాండ్ ఉంది అంటే వాళ్ళ షాప్ ను ప్రచారం చేసుకుంటున్నట్లు కదా...

ఏదైనా పేపర్ లో గానీ, ఛానెల్ గాని యాడ్ ఇవ్వాలి అంటే ఆ షాపింగ్ మాల్ వాడే లక్షలు రూపాయలు ఎదురు డబ్బులు ఇవ్వాలి. కానీ చాలా తెలివిగా మన దగ్గర డబ్బులు తీసుకుని మన తోనే వాళ్ళ షాప్ కు ఫ్రీ... కాదు కాదు... వాళ్ళకే లాభం చేకూరే విధంగా ప్రచారం చేయిస్తున్నారు. అంటే వాళ్ళకి మనమే బ్రాండ్ అంబాసిడర్ లన్నమాట..

మనమే ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నాం... ఇది ఎంత వరకు సరైన పద్ధతో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ బ్రాండ్ పబ్లిసిటీ లేకుండా ప్లైన్ కవర్ అయితే క్యారీ బ్యాగ్ సైజ్ కు తగినట్లుగా ఛార్జ్ చేయచ్చు...

                  నిజానికి ఇలా బ్రాండ్ పేర్లు ముద్రించి ఉన్న క్యారీ బాగ్ లు డబ్బులకు విక్రయించడం చట్ట రీత్యా నేరం. హైదరాబాద్ లోని ఓ కస్టమర్ ఇదే విధంగా ఇబ్బంది ఎదుర్కొంటే వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించాడు. కట్ చేస్తే సదరు షాపింగ్ మాల్ సుమారు 7 వేల రూపాయల పెనాల్టీ విధించింది.

సరే ఈ కేసులు, తలనొప్పి ఎందుకు అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఒకటి ఉంది. షాపింగ్ మాల్ కు వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ వారితో పాటు తీసుకెళ్లడం.. అదేమీ పెద్ద బరువు కూడా కాదు కదా. కారులోనో, బైక్ లోనో ఒక మూలన పడేస్తే చాలు.

పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు, డబ్బులు ఆదా చేసుకున్నట్లు అవుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఒకవేళ బ్యాగ్ మరచిపోయి , షాపింగ్ మాల్ బ్రాండింగ్ ఉన్న క్యారీ బ్యాగ్ కు బిల్ చేస్తే కన్జ్యుమర్ ఫోరంకు కంప్లైంట్ ఇవ్వండి. చూడడానికి చిన్న విషయమే... కానీ ఒక్కసారి ఆలోచించండి....
 
 

Photo Gallery