BREAKING NEWS

బంగారు కళ

             ఎక్కడైనా ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనకు తెలియకుండానే 'పుత్రడి' బొమ్మలా ఉందంటూ ఒక కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తాం... అమ్మ కొడుకును ముద్దాడలంటే నా 'బంగారు'కొండ అంటుంది. మెడ తిరగాలి... “మేలిమి”

కావాలి. ఇది ఒక సామెత... ఇలా అకేషన్ ఏదైనా, సందర్భంగా ఏదైనా బంగారం అనే మాట లేనిదే రోజు కూడా గడవదు. అలాంటి బంగారం కొనాలి అంటే ఏదో ఒక షాప్ కు వెళ్లి కొనుక్కుంటాం... అయితే ఇదంతా ఇప్పుడు. కానీ ఒకప్పుడు బంగారం అంటే విశాఖపట్నం తో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి తెలిసిన ప్రాంతం "కురుపాం మార్కెట్" మాత్రమే.  

                ఒకప్పడు గోల్డ్‌ మార్కెట్‌ అంటే ఇక్కడే... దాదాపుగా 105 సంవత్సరాల చరిత్ర గల ఈ మార్కెట్ విశాఖలో ఇప్పటికీ ఒక ల్యాండ్ మార్క్. ఎన్నో తరాల నుంచి బంగారం తయారీ ప్రధాన వృత్తిగా ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు... పేరు మోసిన ఎన్నో పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్‌ వచ్చినా వాటిని తట్టుకుంటూ రకరకాల కొత్త డిజైన్స్‌తో అట్రాక్ట్‌ చేస్తున్నారు....

ఇతర జిల్లాల నుంచి కూడా నిత్యం ఎంతో మంది వినియోగదారులు వెతుక్కుంటూ మరి వచ్చేవారు. వారికి కావాల్సిన బంగారు ఆభరణాలు కస్టమర్స్ కి నచ్చిన విధంగా తయారుచేసి చెప్పిన సమయానికి అందించేవారు.

కొన్నాళ్ళ క్రితం వరకు కూడా  బాగానే ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి
లేదు. ఎక్కడికక్కడే బంగారం షాపులు ప్కుప్పలు తెప్పలుగా రావడంతో స్వర్ణకారులకు పని బాగా తగ్గింది. షాపింగ్‌
మాల్స్‌తో పోటీని తట్టుకుంటూ మెరుగైన
డిజైన్లతో ధీటైన ఆభరణాలు తయారు చేస్తు
న్నా తగిన గుర్తింపు ఉండడం లేదు.   
       
             హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబల్.. చేత్తో తయారు చేసే వస్తువులకు విలువెక్కువ. కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు. డబ్బుతో వెల కట్టలేనంత... బంగారం షోరూంకు వెళితే అక్కడ మీకు చాలా రకాల డిజైన్స్‌ ఎన్నో చూపిస్తారు. అందులో మనకు కావలసినవి సెలక్ట్‌ చేసుకోవాలి... అదే నేరుగా స్వర్ణకారుల దగ్గరకి వెళ్తే మీరు చెప్పినట్టుగా , మీకు కావలసినట్టు గా తయారు చేసి ఇస్తారు. డిజైన్ ను బట్టి వారం రోజుల్లోగా మీకు నచ్చిన, మీరు మెచ్చిన డిజైన్ మీ చేతిలో ఉంటుంది. షోరూం లో కొనే వాటి కన్నా ధర కాస్త తక్కువగానే ఉంటుంది... క్వాలిటీ విష
యంలో కూడా ఎక్కడా రాజీ ఉండదు. వీళ్ల
దగ్గర కొన్న ఆభరణాలకు ప్యూరిటీ సర్టిఫి
కేట్‌ కూడా ఇస్తారు.

                     అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్ ను బట్టి చూస్తే అన్ని నగలు చేత్తో తయారుచేయడం , సమయానికి అందించడం కాస్త కష్టమైన విషయమే. పెద్ద పెద్ద బంగారం షాప్ లు రావాలి, ప్రజలకు వివిధ రకాల మోడల్స్ అందుబాటులో ఉంచాలి. దీన్ని ఎవ్వరూ కాదనరు. అనలేరు. ఇక్కడే ఒక విషయం గుర్తించాలి. నగరంలో ఎన్నో వందల కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

కంపెనీల్లో ఉద్యోగాల విషయంలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి అనే నిబంధన ఉంది. మరి అలాంటి నిబంధన స్వర్ణకారులు విషయంలో మాత్రం ఎందుకు వర్తించదు??? ఎక్కడో ముంబై లో మెషిన్ ల తో తయారయ్యే ఆభరణాలు అన్నీ ఇక్కడ షాప్స్ లో విక్రయిస్తారు. చేత్తో చేయాల్సిన ఆభరణాలు కూడా ఎక్కడి నుంచో తెప్పిస్తారు. అలా కాకుండా విశాఖలో ఉన్న స్వర్ణకారులు కు ఆ కాంట్రాక్ట్ ఇస్తే వారికి కూడా ఉపాధి పెరుగుతుంది. స్వర్ణకారులు కు పూర్వ వైభవం వస్తుంది... 

               ఏ ఆభరణాన్ని మిషనరీతో పనిలే
కుండా చేత్తోనే తయారుచేస్తారు. ఉదాహరణకు ఒక ఉంగరం తయారీకి ఒక రోజు సమయం పడుతుంది. అదే పెద్ద పెద్ద సిటీస్‌లో మిషన్లపై రోజులో వందకు పైగా
ఉంగరాలు తయారవుతాయి. చేత్తో తయా
రుచేసిన ఈ నగలు చాలా వాల్యుబుల్‌. ధర
కూడా బయట కన్నా కాస్త తక్కువే.
ఆభరణాలు చేత్తో తయారు చేయడం
చాలా కష్టతరమైన పని. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఆభరణం షేప్‌లో మార్పు వచ్చేస్తుంది. అందుకే చాలా ఏకాగ్రతతో తయారుచేయాలంటున్నారు స్వర్ధకారులు. వాళ్లు చేసే డిజైన్‌లు బయట మార్కెట్ లో ఎక్కడా దొరకవు. ఎంతో ఆలోచించి రకరకాల డిజైన్స్‌లో ఆభరణాలు
తయారుచేస్తారు. సో ఈ సారి మీకు ఏదైనా బంగారు ఆభరణాల కావాలంటే ఒక్కసారి స్వర్ణకారులు దగ్గర ట్రై చేయండి. 
 

Photo Gallery