టాలెంట్... ఈ ఒక్కటి ఉంటే చాలు... ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా హ్యాపీగా బ్రతికేయచ్చు .. చాలా మందిలో ఓ అభిప్రాయం ఉండిపోయింది. కేవలం చదువుల్లో నెంబర్ వన్ మార్క్స్ వస్తేనే టాలెంట్ ఉన్నట్టు లేదా టాలెంట్ లేనట్టు.. ఇది చాలా తప్పు. టాలెంట్ కు , చదువుకు ఎలాంటి సంబంధం లేదని ఎంతో మంది నిరూపించారు...
నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి టాలెంట్ లో ఫిల్మ్ మేకింగ్ కూడా ఒకటి. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఈ ఫీల్డ్ లో యువత తమ టాలెంట్ కి పదును పెడుతున్నారు.
విక్స్ బిళ్లలతోనూ కిచ్‌కిచ్ పోయేనూ.
థమ్స్ అప్ టేస్ట్ ద థండర్.. ఉదయం టివి ఆన్ చేసిన దగ్గర నుంచి ఆఫ్ చేసేంత వరకు వినిపించే యాడ్ లు ఇవి. అవును... ఏదైనా ఒక ప్రొడక్ట్ వినియోగదారులకు చేరువ కావటంలో ఈ యాడ్ ఫిల్మ్స్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి.. చాలా తక్కువ సమయంలోనే ప్రొడక్ట్ గురించి హైలైట్ చేస్తూ , ఫీచర్స్, ప్లస్ పాయింట్స్ , ధర ఇవన్నీ ప్రేక్షకుడికి అర్థం అవ్వాలి. ఇంత తక్కువ సమయంలో అన్ని విషయాలు చెప్పటానికి ఎంతో సృజనాత్మకత అవసరం. ఇప్పడు దాదాపుగా మెట్రో సిటీస్ లో చాలా మంది యువత , ఉత్సాహవంతులు యాడ్ ఫిల్మ్ రంగంలో రాణిస్తున్నారు. తమకు ఉన్న పరిజ్ఞానంలో అద్భుతమైన యాడ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్నారు..
మనం ఏ ప్రొడక్ట్ తయారు చేసినా, ఏ బ్రాండ్ తో మార్కెటింగ్ చేసినా దానికంటూ ఒక గుర్తింపు రావాలి అంటే మాత్రం యాడ్ తప్పక ఉండాలి. అందు కోసమే యాడ్ ఫిల్మ్స్ నిర్మిస్తారు. ఒకప్పుడు అంటే కేవలం టివిల్లో మాత్రమే టెలికాస్ట్ చేసేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. యాడ్ ప్రదర్శించే అవకాశాలు కూడా పెరిగాయి.
ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్... యుట్యూబ్ యాప్ కచ్చితంగా ఉంటోంది అందంలో అతిశయోక్తి లేదు. యుట్యూబ్ మొత్తం కొన్ని కోట్ల వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ టార్గెట్ YouTube. ఏదైనా ఒక వీడియో మధ్యలో కొన్ని సెకన్ల ఈ యాడ్ ప్లే అవుతూ ఉంటుంది. అంతే కాకుండా వెబ్ సైట్ లు ఏవి ఓపెన్ చేసినా కూడా మనకు యాడ్ లు దర్శనం ఇస్తున్నాయి. వీటన్నింటితో పాటు సినిమా థియేటర్స్‌లో సినిమా ప్రారంభానికి ముందు కూడా యాడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఉండే వారికి రీచ్ అవడానికి టీవీల్లో టెలికాస్ట్ చేస్తున్నారు...
ఇలా అవకాశాలు పెరగడంతో యాడ్ ఫిల్మ్ మేకింగ్ కూడా పెరుగుతోంది.
యాడ్ ఫిల్మ్ కదా.. మహా అయితే ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. చాలా సింపుల్ గా చేసేయొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ నిజానికి సినిమా తీయడం కన్నా యాడ్ ఫిల్మ్ తీయడమే చాలా కష్టం అని చెప్పాలి. సినిమా షూటింగ్‌కు,యాడ్ ఫిల్మ్ షూటింగ్‌కు చాలా తేడా ఉంది. క్రూ విషయంలో, ఎక్విప్మెంట్ విషయంలో తేడాలు ఉంటాయి.
ముఖ్యంగా క్రియేటివిటీ విషయంలో ఈ రెండూ భిన్నంగా ఉంటాయి. ఒకవేళ సినిమాల్లో ఫస్ట్ హాఫ్ బాగా లేకపోయినా సెకండ్ హాఫ్ బాగుంటుంది అని చూసే అవకాశం ఉంది. కానీ యాడ్ ఫిల్మ్స్ విషయంలో అలా కాదు.. ఫస్ట్,సెకండ్ పార్ట్ లు ఉండవు. కాబట్టి యాడ్ స్టార్ట్ అయ్యిన మొదటి
సెకెండ్ లోనే ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసేలా ఉండాలి. అప్పుడే ఆ యాడ్‌ను పూర్తిగా చూస్తారు. లేదా చేతిలోనే రిమోట్ ఉంటుంది కాబట్టి వెంటనే చానెల్ మార్చేస్తారు. ఆ ప్రాడక్ట్ ఉపయోగాలు, ధర, ప్రత్యేకత ఇవన్నీ కూడా కేవలం 40 సెకన్స్ లోపలే చెప్పాలంటే ఎంతో క్రియేటివిటీ కావాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఎంతో మంది డైరెక్టర్లు కూడా మరచిపోలేని ఎన్నో యాడ్ లు రూపొందించారు. 40 సెకన్లు యాడ్ అయినా మనపై చాలా ప్రభావం చూపిస్తాయి ప్రకటనలు. తాజాగా వచ్చిన బ్రూ కాఫీ ప్రకటనలో వచ్చే పాట అందరి నోళ్లలో నానుతూ వైరల్ గా మారింది... కొన్ని సార్లు మనకు ఆ వస్తువు అవసరం ఉన్నా లేకపోయినా కేవలం ఆ ప్రకటన చూసిన వెంటనే కొనేస్తూ ఉంటాం.
సాధారణంగా ఏదైనా ప్రొడక్ట్ లేదా కంపెనీల చిన్న యాడ్ ఫిల్మ్ చేయడానికి రూ.10 వేల నుంచి ప్రారంభం అవుతాయి. షూటింగ్,ఎడిటింగ్,డబ్బింగ్ ఇలా మొత్తం ప్యాకేజీ అందుబాటులో ఉంది. అలాగే కాన్సెప్ట్ బేస్‌గా చేసే యాడి ఫిల్మ్స్ రూ.20 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక మ్యాగ్టిమం అంటే కస్టమర్ నీ బట్టి ఉంటుంది. పెద్ద సినీ స్టార్స్‌తో చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మన ఆంధ్రాలో బేసిక్ యాడ్ లు ఎక్కువ వస్తున్నాయి. స్టార్ హీరోల యాడ్ లు అన్ని ముంబై లేదా సినిమా వాళ్లే తయారు చేస్తున్నారు. కానీ ఫ్యూచర్ లో మాత్రం ఈ కల్చర్ ఎక్కువ అవుతుంది అని యాడ్‌ఫిల్మ్ ఏజెన్సీలు చెబుతున్నారు.
జనాభా పెరుగుతున్నారు. వస్తు ఉత్పత్తి, కంపెనీలు ఎక్కువ అవుతున్నాయి. పోటీ పెరుగుతుంది. దీంతో యాడ్ ఫిల్మ్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ రంగంలో భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. మనకు టాలెంట్ ఉండాలే కానీ ఆకాశమే హద్దుగా ఈ రంగంలో రానించవచ్చు.