గత కొన్ని సంవత్సరాలుగా చదువులు బాగా బరువెక్కిపోయాయి. తల్లితండ్రులకు ఆర్థికంగాను , పిల్లలకు పుస్తకాలపరంగాను..
పిల్లలు పుట్టడం భయం .. ఓ రెండు సంవత్సరాలు కాబోలు ,,, ఇంటిపట్టున ఆడుతూ పాడుతూ ముద్దు ముచ్చట జరిపిస్తారు.
అప్పుడు మొదలు ,,
ఆ తల్లిదండ్రులకు అనిపించకపోయినా , ఇరుగు పొరుగు , చుట్టాలు పక్కాలు ఇంకా పిల్లాడిని స్కూల్లో వెయ్యలేదా ??
మొండి తేరిపోతారు సుమా ... వెంటనే మంచి స్కూల్ చూసి పడేయండి వెధవని ..
ఇలా ఇస్తారు ఉచిత సలహాలు ... పాపం ఆ తల్లిదండ్రులులోమొ దవుతుంది అప్పుడు ఒకటే టెన్షన్ !!!
వాళ్ళది కూడా చిన్నవయస్సే ..
మంచి స్కూల్ కోసం వెదకడం , భారీ మొత్తంలో ఫీజు కట్టడం , బోల్డు డబ్బు పోసి పుస్తకాలు , యూనిఫామ్ కొనడం ,స్కూల్ ఆటో కుదుర్చుకోవడం అన్నీ చక చకా జరిగిపోతాయి.
అప్పటి నుండి ఆ పసిపిల్లాడికి , ఆ తల్లితండ్రులకు అనుక్షణం జీవిత ఖైదు విధించబడినట్లే ...
ఊబిలో అడుగు పెట్టిన క్షణం అది ...
ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా పిల్లలను స్కూల్ మానిపించకూడదు. వాళ్ళు ఇంటికి వచ్చినవెంటనే ఏదో తినిపించి , వారిచేత హోమ్ వర్క్ చేయించాలి. ఎవరి ఇంటికి వెళ్ళడానికి వీలు కుదరదు. ఇంక ఎట్టి పరిస్థితిలోనూ తప్పించుకోలేము అంటేనే ...
అది కూడా ... పిల్లాడిని స్కూల్ కి పంపించి వెళ్ళాలి. మళ్ళీ పిల్లాడు స్కూల్ నుండి వచ్చే సమయానికి ఇంటికి చేరాలి. వాడు ఒక్కో సంవత్సరం పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింతగా జటిలమవుతుంది. దేశంలో ఉన్న చదువులు , విదేశాల్లో చదువులు కూడా అయ్యాక ఉద్యోగం . పోనీ ఉద్యోగం వచ్చేసింది కదా ...అప్పుడేనా హాయిగా పెళ్లి చేసుకుని , అమ్మానాన్నలతో చక్కగా గడుపుదాం ,,, ఇన్నాళ్లు కోల్పోయింది ఇప్పుడైనా పొందుదాం అనుకుంటారా అంటే అదీ లేదు.
ఇంకా ఇంకా పేద్ద పేద్ద ఉద్యోగం సంపాదించి ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి. ఈ ఇంకా అన్నదానికి అంతే లేదు ... అప్పుడు ఆలోచిస్తే ...
ఆ తల్లితండ్రులకు గానీ పిల్లలకు గానీ అర్ధం అవుతుంది. వారి జీవితంలో ఎంత విలువైన సమయం అంతకు మించి స్వేచ్ఛ కోల్పోయారో ...
కానీ ,,, అప్పుడు చేసేదేమీ ఉండదు.
ఇదంతా ...
స్కూల్ అన్న పదం నుండి వచ్చింది.
అసలు " స్కూల్ " అంటే అర్ధం ఏమిటి ??
లాటిన్ భాషలో స్కూల్ అంటే ఖాళీ సమయం .
పూర్వకాలం ప్రజలందరూ ఎవరి కుల వృత్తి వారు చేసే వారు. పంట పండించడం కొంతమంది , ప్రజలకు కావలసిన సరుకులు విక్రయిస్తూ కొంతమంది , బట్టలు ఉతకడానికి కొంతమంది, క్షౌర కర్మలు చెయ్యడానికి కొంతమంది , ఊరికి కావలసిన పనులు చెయ్యడానికి కొంతమంది , మంచీ చెడ్డా చూసి చెప్పడానికి కొంతమంది , అవసరమైన చికిత్య చెయ్యడానికి కొంతమంది ఇలా జీవి పుట్టిన దగ్గర నుండి గిట్టినవరుకు వారికి కావలసిన అన్ని అవసరాలు తీర్చడానికి ఎవరి పాత్ర వారు అనుక్షణం పోషిస్తూ నిరంతరం శ్రమించేవారు.
ఆ రోజుల్లో చదువులు తెలియవు.
అలాంటి నేపద్యంలో ...
ఒక్కోసారి ,,,,
పనులన్నీ అయ్యాక రాత్రి సమయంలో భోజనాలు అయ్యాక పిల్లా - పెద్దా అందరూ గ్రామంలో ఓ చోట చేరి , వారికి తెలిసిన విషయాలు అందరితో పంచుకుంటూ ,
పాటలు , పద్యాలు , పల్లెపదాలు , నృత్యాలు , కోలాటాలు, డముకువాద్యాలు , ఇలా ఒకటేమిటి ,,,
ఎవరికి తెలిసిన దానిని వారు అందరికీ నేర్పిస్తూ ,, తద్వారా ,,, అంతవరకూ వారు పడిన శ్రమను మరిచిపోయి కేరింతలు కొట్టుకుంటూ సరదాగా గడిపి , ఎవరింటికి వారు పోయి నిద్రించేవారు. మర్నాడు మళ్ళీ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారు.
అదిగో ... అలా మొదలయింది ... తమకు తెలియని విషయాన్ని తెలుసుకుందాం అనే ప్రయత్నం.
అలా ఖాళీసమయంలో కేవలం కాలక్షేపం కోసం నేర్చుకునే విషయాలు ,,, భవిష్యత్ కాలంలో ఖాళీ సమయం అంటే అర్థమే తెలియనంతగా
" వామనావతారంలా " సర్వాంతర్యామి అవుతుందని బహుశా అప్పుడు వారు ఊహించి ఉండరు పాపం ...
అదంతా గతం ...
మరి ప్రస్తుతానికి వస్తే ...
సరే !! ఫీజుల మోత ప్రక్కన పెడితే ,,,
పుస్తకాల బరువు మొయ్యలేక వీపులు వంగిపోయి , జబ్బలు పులిసిపోయి , అయిదారు అంతస్తులు మెట్లెక్కి దిగి ఉదయం 5,6 గంటలకు ఇల్లు వదిలేసి , రాత్రి 7,8 గంటలకు ఇల్లు చేరి , పోనీ అప్పుడైనా TV చూడడం గానీ , అమ్మానాన్నలతో సరదాగా కబుర్లు చెప్పడం గానీ లేకుండా , మర్నాడు చూపించాల్సిన వర్క్ చేసుకుంటూ , తిండి తినక , నిద్ర లేక ప్రత్యక్ష నరకం వారు అనుభవిస్తూ , తల్లితండ్రులను కూడా క్షోభ పెడుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ విద్యావిధానం మారడం లేదు.పుస్తకాల బరువు తగ్గించాలని అనేకసార్లు కోర్టులు చెప్పినా , TV లలో డిబేట్లు పెట్టినా పరిస్థితి మారలేదు.
గతంలో అయితే స్కూల్ చదువుల్లో
" టైమ్ టేబుల్ " ఉండేది. దాని ప్రకారం ఏ రోజు ఏ క్లాస్ ఉంటుందో ఆ రోజు ఆ పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లేవారు. కాలేజ్ చదువులు అయితే కేవలం ఒకేఒక రఫ్ బుక్ పట్టుకెళ్లేవారు.
మరి ,,, అప్పుడు తయారవలేదా ????
IAS లు , IPS లు , డాక్టర్లు , ఇంజినీర్లు , గ్రూపు 2 అధికారులు , టీచర్లు , బ్యాంక్ ఉద్యోగులు , టెక్నీషియన్లు మొదలైన వారు.
వారు వెళ్లలేదా విదేశాలకు ???
వారు సంపాదించలేదా కోట్లు ???
వారు అవలేదా పారిశ్రామికవేత్తలు ???
పోనీ ,,,
ఈ రోజుల్లో జీవితాన్నే ఫణంగా పెట్టి 24 గంటలు కష్టపడి చదివిన వారందరూ కచ్చితంగా కోటీశ్వరులయ్యారా ???
అందరూ పెద్ద ఉద్యోగాలు సంపాదించారా ???
అందరూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డారా ???
లేదా ,,,
జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ,
అంతంత మాత్రం చదివి ,
ఏదోలా బొటాబొటీ మార్కులతో పాస్ అయిన వారందరూ ఎందుకూ పనికి రాకుండా అనామకులుగా
మిగిలిపోతున్నారా ??? లేదే ...
అన్నీ త్యజించి తపస్సులా చదివిన ప్రతివారూ గొప్పవారు అయిపోలేదు. ఏదోలా ఆడుతూ పాడుతూ చదివిన ప్రతివారూ పాపర్స్ అయిపోలేదు...
ఆలోచన అవసరం.
చదువు అందరికీ తప్పనిసరిగా అవసరమే ...
కానీ ,,, ఆ పేరుతో పిల్లల ఎదుగుదలకు అత్యంత కీలకమైన వారి బాల్యాన్ని చే జేతులా నాశనం చేయకండి ...
ఎంతో మంది పరిశోధనలు చేసి మరీ చెప్పారు.
కనీసం 5 సంవత్సరాల వయసు రానిదే చదువులపేరుతో పిల్లలను ఇబ్బంది పెట్టకండి. వారిని బాగా చదివించాలనే తాపత్రయంతో మీ జీవితాలలో మధురానుభూతిని కోల్పోవద్దు...
" కోటి విద్యలు - కూటికొరకే "
అన్నది నానుడి ...
మీరు - మీ పిల్లలు - వారి పిల్లలవరకూ ఆలోచించండి .. తప్పులేదు ...
కానీ ,,, మీ తర్వాత పది తరాలవరకూ కూడా మీరే సంపాదించి పడేద్దాం .. అనుకోకండి ...