BREAKING NEWS

కట్నాలు - కానుకలు

ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం అయినా  కానుకలు ఇవ్వడం తప్పనిసరి. పూర్వం అయితే కేవలం   ఉపనయనం , వివాహం లాంటివి మాత్రమే బంధు మిత్రులందరినీ పిలుచుకుని వేడుకగా చేసుకునేవారు. రజస్వల , పుట్టినరోజు లాంటివి మాత్రం  అయిన వారి సమక్షంలో సాదాసీదాగా జరుపుకునేవారు.
 కానీ ... కాలం మారింది ...

 ఒకరిని చూసి ఇంకొకరు ఘనంగా ఫంక్షన్స్  చేస్తున్నారు. 
  ఉపనయనాలు , నిచ్చితార్థాలు ,  వివాహాలు , సీమంతాలు ,  పుట్టినరోజులు , బారసాలలు ,  రజస్వలలు , స్కూల్లో చేర్పించడాలు , పరీక్షలలో పాస్ అవడాలు , ఉద్యోగాలు , ప్రమోషన్స్ , పదవీవిరమణలు , విదేశీ పర్యటనలు , స్వదేశీ ఆగమనాలు ఇలా ఒకటని కాదు ప్రతి చిన్న కారణానికి విందులు ఏర్పాటు  చేస్తున్నారు.  ఎవరి స్తోమతను బట్టి వారు డబ్బు ఖర్చుకు వెనుకాడ్డం లేదు ...

  ఇళ్లల్లో , హోటల్స్ లో , ఫంక్షన్ హాల్స్ లో , పబ్ లలో , బార్ లలో , బీచ్ లలో , తోటల్లో ,,,,,ఎక్కడ ఎవరికి ఎలా వీలయితే అలా కానిస్తున్నారు.
  ఒక వివాహం జరిగే ఖర్చుతో   " పిల్లాడి మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు" కొంతమంది జరుపుతున్నారు.

   సరే ...
   మొత్తానికి వేడుక ఏదయినా ,,, అందరినీ పిలవడం , 
   వారు పిలిచారు కాబట్టి , వెళ్లకపోతే వారెక్కడ ఫీల్ అవుతారో అని వీలు చేసుకుని మరీ కొంతమంది , ఎవరు ఎప్పుడు పిలుస్తారా  వెళ్దాం  అని ఎదురు చూసే సరదా వ్యక్తులు కొంతమంది హాజరు అవుతున్నారు.
   హాజరు అయిన గెస్ట్ లు అందరూ హోస్ట్ కు ఏదో ఒక కానుక ఇవ్వడం రివాజు.
   ఇక్కడ ఆరంభం ... అసలు కధ ...

   పూర్వం రోజుల్లో చాలా మంది ,,,    ఇప్పుటి రోజుల్లో కొంతమంది ,,,    ఫంక్షన్ జరిగే చోట అందరికీ కనబడే విధంగా టేబుల్ ఒకటి వేసుకుని రెండో మూడో కుర్చీల్లో కూర్చుని ,      బుక్ , పెన్ , క్యాష్ బాగ్ పట్టుకుని ఉంటున్న   దృశ్యాలు మనం చూడచ్చు.  విందు ఆరగించిన అనంతరం ఇక్కడకు వచ్చి అవసరమైతే క్యూలో నిలబడి తమపేరు వ్రాయించుకుని ఎంతో కొంత ముట్టచెబుతారు. దీనికి మళ్ళీ ఓ లెక్కుంది ...    ఉదాహరణకు ..
   ఇప్పుడు ఒక వ్యక్తి మన ఫంక్షన్ కు  వచ్చి ఓ వంద రూపాయలు  చదివిస్తే  ,,, భవిష్యత్తులో అదే వ్యక్తి వాళ్ల ఫంక్షన్ కు  పిలిచినప్పుడు ,,, మనం ఆ వందరూపాయలకు ఎంతోకొంత కలిపి వారికి చదివించాలన్న మాట. 

   ఇదీ ... చదివింపుల ఫార్ములా ...    ఇక్కడ ఇంకో లెక్క కూడా ఉంది ...
   పొరబాటున ఎవరైనా లెక్క మరచిపోయో ,  ఆ సమయానికి డబ్బులు లేకపోయో సరైన రీతిలో డబ్బులు చదివించలేకకపోతే ,, పని గట్టుకుని  గొడవ ఆడే ప్రబుద్ధులు కూడా లేకపోలేదండోయ్ ..
   కొంతమంది" కౌంటర్ " దగ్గరకు వచ్చి బుక్ లో ఎంటర్ చేయించకుండా ,, తాము ఇవ్వదలచుకున్న మొత్తం ఓ కవరులో పెట్టి  , దానిపై తమ విషెస్ , పేరు వ్రాసి హోస్ట్ చేతిలో పెట్టేవారు కూడా ఉన్నారు. 
   మరి కొంతమంది ఉన్నారు. ఏదైనా ఫంక్షన్ కు వెళ్లేముందు ,,,    వారికి ఏమి  ఇవ్వాలి ??     వస్తువు రూపంలో ఇవ్వాలా ??     క్యాష్ గా ఇవ్వాలా ??    అసలు ఎంతమంది వెళ్తున్నాం ??    అందుకు అనుగుణంగా ఇవ్వాలి కదా !!
   ఇలా రకరకాలుగా ఆలోచించి , చించి  చివరాఖరికి ఇంట్లో ఎవరో ఎప్పుడో ఇచ్చిన (వాడని ) గిఫ్ట్ ని  పట్టుకుని ఫ్యాన్సీషాప్ కు వెళ్లి  ఓ పది రూపాయలు ఇచ్చి , అందంగా  " గిఫ్ట్ ప్యాక్ " చేయించుకుని , ఆందోళనకు తెర దించి , ఓ నిట్టూర్పు విడిచి , తేలికైన మనసుతో " సకుటుంబంతో " ఆ ఫంక్షన్ కు 
   " హుందాగా "  వెళ్తారు.

  ఇంట్లో  ఎవరూ  ఇచ్చిన గిఫ్ట్ ఏదీ లేకపోతే ఏదో ఒక షాప్ కు వెళ్లి  చవగ్గా బేరం ఆడి (అలా అనుకుని) దాన్ని సాధ్యమైనంత పెద్ద సైజులో గిఫ్ట్ ప్యాక్ చేయించి ,  బహుకరించేవారు కూడా ఉన్నారు.

  వచ్చిన చిక్కంతా ఏంటంటే !!!
  నిజంగా  విలువైన వస్తువు , ఉపయోగ బడే వస్తువు అయితే పరవాలేదు  కానీ , ఎందుకూ పనికిరాని గోడ గడియారాలు  , ఫోటో ఫ్రేమ్ లు , బౌల్స్ , పింగాణీ పాత్రలు లాంటివి కొంటే ,  ఆ షాప్ యజమానులకు లాభం వస్తుంది తప్ప , హోస్ట్ కు  ఎందుకూ ఉపయోగపడదు.  అవి  అలా ఆ మూలా - ఈ మూలా అడ్డంగా పడి ఉండడం తప్ప...

  కనుక  ...   వేడుక ఏదైనా ,,,   హోస్ట్ ఎవరైనా ,,     మన స్తోమతను బట్టి  ఎంతో కొంత నగదు రూపంలో వారికి అందజేస్తే ,,, ఆ మొత్తంతో వారికి అవసరమైనది కొనుక్కుని , ఫలానా ఫంక్షన్ లో  వచ్చిన చదివింపులుతో ఇది కొన్నాము అని తలుచుకుని మురిసిపోతారు ...    సో ...    కొంతమందైనా ఈ దిశగా ఆలోచిస్తే  ,  ఇంట్లో అనవసరమైన చెత్త చేరకుండా ఉంటుందేమో  ???

Photo Gallery