BREAKING NEWS

ప్రసంగాలలో - పొరబాట్లు

            సోషల్ మీడియా... ఎప్పుడైతే మన ముందుకు వచ్చిందో సజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది... ఎక్కడ ఏ మూలన ఏ విషయం జరిగినా నిమిషాల్లో మనకి తెలిసిపోతుంది. ఇక రాజకీయ నాయకుల విషయంలో సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ ప్రత్యర్థి దొరుకుతారా? సోషల్ మీడియాలో వైరల్ చేసేద్దామా అని ఎదురు చూస్తుంటారు..

               సాధారణ పరిస్థితుల్లో ఎంతో చక్కగా మాట్లాడగలిగే చాలా మంది , పదిమందిలో మాట్లాడవలసి వచ్చినప్పుడు  ఒక్కసారిగా తడబడతారు. సభలో వేదిక మీద మైక్ ముందు  కనుక మాట్లాడాలంటే  మరికొంత బెదురు ఉంటుంది. అదే విలేఖరుల సమక్షంలో మాట్లాడాలంటే ,,,, అసలు నోరు పెగలదు ... అలాంటప్పుడు  కంగారులో ఒకటి మాట్లాడబోయి మరోటి మాట్లాడేసి , ఆ తర్వాత నాలుక కరుచుకునే సందర్భాలు చాలా మందికి ఎదురు అవుతూ ఉంటాయి.

ఇలాంటి సందర్భాలు పూర్వకాలంలో కూడా ఉన్నప్పటికీ , అప్పట్లో ప్రత్యక్ష ప్రసారాలు గానీ వీడియో షూటింగ్ లు కానీ లేకపోవడం వలన కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉన్నందున  పొరబాటుగా వారు మాట్లాడిన మాటలను వార్త రూపంలో వ్రాయకుండా కేవలం వారి భావాన్ని మాత్రమే వార్తగా వ్రాసేవారు. వారు ఏం మాట్లాడారో మనకు తెలిసేది కాదు.

కానీ సమాచార విప్లవంలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రవేశంతో  ...
ముందుగా ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి , దానిని  షూట్ చేసి , ఎడిటింగ్ చేసి , వీడియో రూపంలో  ప్రసారం చేసేవారు.  కాబట్టి మాట తడబడినా బయటకు తెలిసేది కాదు.  
            కానీ  ప్రత్యక్ష ప్రసారాలు , యూ ట్యూబ్ ఛానెల్స్ , ఫేస్ బుక్ లు , స్మార్ట్ ఫోన్ లు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులు మాట్లాడిన మాటలు యధాతధంగా మనం చూడగలుస్తున్నాం. కాబట్టి వారు తడబడి మాట్లాడిన తప్పులు మనకు తెలుస్తున్నాయి. ఇక అక్కడనుండి మొదలుపెడతారు  ట్రోల్ చెయ్యడం ,, అనేక రకాలుగా ...

ఈ బాధ ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి అలా తడబడి తప్పుగా మాట్లాడిన ప్రముఖులు తీవ్ర మనస్తాపానికి గురి అయ్యి , ఆత్మ న్యూనతా భావంతో స్వంత కుటుంబసభ్యుల దగ్గర కూడా భాద పడుతున్నారు.

పోనీ.. ఇలా ట్రోల్ చేసేవారు ... నిండు సభలో అనర్గళంగా మైక్ ముందు మాట్లాడగలరా ??? అమ్మా నాన్నలు కొనిచ్చిన  ఖరీదైన సెల్ ఫోన్ లలో  పనికిమాలిన పోస్టింగ్ లు పెట్టడం మాత్రమే వచ్చు గానీ , ఎదుటి వారి భావాలను ,  మనోభావాలును  గౌరవించడం చేతకాదు. 

జయంతి అనబోయి , వర్ధంతి అన్నా  ,,  భాద్యులను కఠినంగా శిక్షించాలని అనబోయి , బాధితులను కఠినంగా శిక్షించాలని అన్నా ,, బీకామ్ లో  ఫిజిక్స్ చదివానన్నా ,, డిగ్రీలో  హెచ్ యి సి  చదివానన్నా ,, అంతవరకూ ఉన్న పార్టీ కాదని , వేరే పార్టీలోకి జంప్ అయి ఆ పార్టీ గుర్తుతో పోటీ చేస్తూ , ప్రచారంలో  మాత్రం అతని పూర్వపు పార్టీ గుర్తుకే  ఓటు వేయమని కోరినా , అవినీతి లేని పాలనే మా లక్ష్యం అనబోయి , అవినీతి పాలనే మా లక్ష్యం అని అన్నా ,,, నీతిగా పాలించడంలో మన ప్రభుత్వం నెంబర్ వన్ పొజిషన్లో ఉందని అనబోయి , అవినీతిలో మన ప్రభుత్వం నంబర్ వన్ పొజిషన్లో  ఉందని అన్నా పొరబాటుగా నోటినుండి వచ్చినవి తప్ప , వాళ్ల ఉద్దేశ్యం మాత్రం అది కాదు కదా ...
                  కాబట్టి సంధర్భాన్ని  బట్టి వారి ఆంతర్యం గ్రహించాలే తప్ప వారిని అదేపనిగా ట్రోల్ చెయ్యకూడదు ... ఒకరిని బాధ   పెట్టే  హక్కు ఎవరికీ లేదు కదా ... ఈ రోజు వారవ్వచ్చు .. రేపు మనం కావచ్చు కదా ....

Photo Gallery