BREAKING NEWS

అబాకస్ - మ్యాథ్స్ మేడ్ ఈజీ

      చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే ప్రతి విద్యార్థికి ఏదో ఒక సబ్జెక్ట్ అంటే కచ్చితంగా భయం ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, హిందీ ఇలా అన్నమాట... ఆ సబ్జెక్ట్ పేరు ఎత్తితే చాలు గజ గజ వణికిపోతుంటారు. కేవలం ఆ ఒక్క సబ్జెక్ట్ వలన మిగిలిన సబ్జెక్ట్స్ పై ఏకాగ్రత చూపలేరు.

సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నా 99 శాతం విద్యార్థుల భయం మాత్రం మ్యాథ్స్ ను చూస్తేనే... అవును కదా..  నిజానికి నాకు కూడా సేమ్ ఫీలింగ్. లెక్కలు అంటే అస్సలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు విద్యార్థులు ఎంత భయమైనా మ్యాథ్స్ ను హ్యాపీగా చేసేస్తున్నారు. ఎలా అంటారా...

            మ్యాథ్స్‌... చాలా మంది పిల్లలకు ఆ మాటంటేనే ముచ్చెమటలు పట్టేస్తాయి. అన్ని సబ్జెక్టుల్లో అదరగొట్టే ఆ బ్యాచ్  లెక్కల దగ్గరికి వచ్చేసరికి మాత్రం బిక్కమొహం వేస్తారు. చిన్నప్పడు ప్లస్‌లు, మైనస్సులంటే ఉన్న భయమే ఆ తర్వాత లెక్కల సబ్జెక్ట్ అంటేనే అయిష్టతకు దారి తీస్తోంది .. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి హాయిగా ఆడుతూ పాడుతూ చిన్నప్పుడే లెక్కలు చేయగలిగితే? ఎంత పెద్ద లెక్కలకు అయినా ఫౌండేషన్‌ లాంటి కూడికలు, భాగహారాలను కళ్ళు మూసి తెరిచేలోగా చేయగలిగితే? ఇక ఆ తర్వాత అంతా మంచినీళ్ల ప్రాయమే కదా...

చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ పై భయం పోగొట్టి ఆసక్తి కలిగేలా చేస్తే పై చదువుల్లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా హ్యాపీగా లెక్కలు చేసేయొచ్చు.. అందుకే చాలా మంది పిల్లలు తేలికైన ఈ కిటుకును ఇట్టే అలవాటు చేసుకుంటున్నారు. వ్యాపారాలు, వ్యవహారాల్లో తరతరాలుగా అలవాటైన అబాకస్ ను ఇప్పుడు లెక్కలకు ఆసరాగా చేసుకుంటున్నారు.

         మూడు నాలుగు కలిపితే ఎంత? దానికి 32 కలిపితే ఎంత? అందులోనుంచి ఎనిమిది తీసేస్తే ఎంత?.. ఇవే... సరిగ్గా ఇలాంటి లెక్కలంటే పిల్లలు అమ్మో అంటారు.  వారిని భయపెడతాయి కూడా. చేతుల వేళ్లు లెక్కపెడుతూ వాళ్లు పడే తిప్పలు మొదట మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ ఈ తిప్పలే తర్వాత వాళ్లను లెక్కలకు దూరం చేస్తాయి. ఈ చిక్కులు ఏవీ లేకుండా లెక్కల్ని చేసే పద్ధతిని వాళ్లకు పరిచయం చేసేదే ఈ అబాకస్‌. మానవ నాగరికత ప్రారంభంలో లెక్కల కోసం వాడిన ఈ తేలికైన పరికరం తర్వాత హైస్పీడ్‌ కాలిక్యులేటర్ల రూపకల్పనకు ఒక మోడల్ గా మారింది. ఇదే అబాకస్‌ చాలా కాలంగా పిల్లలకు తేలిగ్గా లెక్కలు చేయడాన్ని పరిచయం చేస్తోంది.

సిటీలో చాలా మంది పిల్లలకు ఇదో ఆట వస్తువులా ఉత్సాహాన్నిస్తోంది. అందుకే ఇప్పుడు చాలా నగరాల్లో ఈ అబాకస్‌ సెంటర్ల జోరు పెరుగుతోంది. పిల్లల్లో ఈ అబాకస్ నేర్చుకోవడం వలన మంచి మార్పులే కనిపిస్తున్నాయి. 

            అబాకస్‌ ఉపయోగించి ఒకప్పుడు వర్తకులు చాలా సులువుగా లెక్కలు చేసేవారు. ఇప్పటికీ జపాన్‌లో అబాకస్‌ను ఉపయోగించి ఎంత క్లిష్టమైన లెక్కయినా చేస్తారు. పలకలా ఉండే ఈ పరికరాన్ని ఉపయోగించి ఎంత పెద్ద లెక్క అయినా సరే సెకన్లలో చాలా ఈజీగా చెప్పేయచ్చు. అందుకే పిల్లలకు దీనిని అలవాటు చేసేలా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ లు అందుబాటులోకి వస్తున్నాయి. .
అబాకస్‌లో మొత్తం ఆరు స్టెప్స్‌ ఉంటాయి. మొదటి స్టెప్‌లో కూడికలు,రెండో స్టెప్‌లో తీసివేతలు, మూడో స్టెప్‌లో గుణకారాలు, నాలుగో స్టెప్ లో భాగహారాలు, ఐదు,అరు స్టెప్స్‌లో స్క్వేర్‌ రూట్స్‌ ఉంటాయి. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా    చ్చేశాక...విజువల్‌ అబాకస్‌ను నేర్పిస్తారు... ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లోకి అబాకస్‌ను అనుమతించరు కాబట్టి... అబాకస్‌ మన చేతిలో ఉన్నట్టుగానే ఊహించుకుని 'లెక్కలు చేయడమే విజువల్ అబాకస్.... అబాకస్‌ వల్ల కేవలం లెక్కలు రావడమే కాదు, జ్ఞాపకశ్తి, ఏకాగ్రత, చురుకుదనం కూడా రెట్టింపు అవుతాయి.
దీని వల్ల పిల్లలు పెద్దయ్యాక కాంపిటేటీన్‌ ఎగ్జామ్స్‌లో సులువుగా విజయం సాధించవచ్చు...

Photo Gallery