BREAKING NEWS

కర్పూరమే ఆమె ఆహారం

     ఆహారం ఏమీ తీసుకోకుండా ఒక మనిషి ఎన్ని రోజులు  తకగలడు...ఎలాంటి ఘనాహరం లేకుండా కేవలం పాలు మాత్రమే తాగుతూ ఎన్నాళ్ళు జీవించి అవకాశం ఉంది? మహా అయితే ఓ వారం రోజులు.. ఇంకా ఎక్కువ అనుకుంటే ఓ పది రోజులు. ఆ తర్వాత మెల్లగా నీరసం ఆవహిస్తుంది.

ఏ పనీ  యలేకుండా కనీసం మాట్లాడడానికి కూడా ఓపిక లేని స్థితికి  చేరుకుంటాం... దైవ భక్తి  ఉన్నవాళ్లు ఎంతో మంది ప్రతీవారం ఉపవాసాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.. అది కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే..  కానీ ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా సంవత్సరాల పాటు ఓ వ్యక్తి జీవిస్తున్నారు అంటే నమ్మగలరా? మామూలుగా అయితే అసాధ్యం అనే అంటారు. కానీ ఇది నిజం. ఈ వింత ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే.. అది కూడా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో... అక్కడ ఉండే ఆ వృద్ధురాలిని చూస్తే ఎవ్వరైనా సరే ఔరా అంటారు. ఇంతకీ ఏమిటా కథ... తెలుసుకోవాలంటే చదవండి ఈ స్టోరీ...

             సుమారు 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది...   విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పెదకాద గ్రామం... దేవుడమ్మ కు అప్పుడు 12 సంవత్సరాలు వుంటాయి. ఎప్పుడూ చూసినా దేవుడు ధ్యాస తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఉండేది.

చుట్టుపక్కల ఏం జరిగినా దైవ భక్తి నుంచి బయటకు వచ్చేది కాదు. దేవుడు తనను ఇక్కడ ఉండకూడదు అని కొండ మీదకు వచ్చేయమన్నాడు అని గ్రామం పక్కనే ఒక కొండపై  ఉన్న ఆ వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటికీ ఆ స్వామి వారి సన్నిధే దేవుడమ్మ నివాసం. ఆలయం దాటి బయటకు రాదు.

రావాలని కూడా అనిపించలేదట... ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు దైవ సేవ తప్ప బయట ప్రపంచంతో సంబంధం లేదు. దేవుడమ్మ ఈ కొండకు వచ్చినప్పుడు చుట్టూ దటమైన అడవి ఉండేదట. ఎలుగుబంట్లు, జంతువులు అన్నీ తిరిగే అంత అడవి. అయినా సరే దేవుడమ్మను గాని , వచ్చే భక్తులను గానీ ఆ జంతువులు ఏమీ ఇబ్బంది పెట్టలేదని అప్పటి వాళ్ళు కథలు కథలుగా చెప్తున్నారు... 

             ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వృద్ధురాలు పేరే దేవుడమ్మ... వయసు సుమారు డెబ్బై అయిదు సంవత్సరాలు... ఊరు పెదకాద గ్రామం... విజయనగరం జిల్లాకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం... సంవత్సరాల తరబడి ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ఆ వృద్ధురాలు ఈమె.. మరి బతకడానికి , ఒంట్లో శక్తికి ఆహారం ఎలా అనే కదా మీ సందేహం... అది చాలా సీక్రెట్... ప్రతిరోజూ మంచి కర్పూరం, కమ్మని అగరొత్తులు పొగ.. ఇవే ఈమె ఆహారం.  అప్పుడప్పుడు కాసిన్ని పాలు... అంతే... వేరే ఇతర ఎలాంటి ఆహారం ఆమెకు అవసరం లేదు.

దాదాపుగా గత 50 సంవత్సరాల నుంచీ ఇదే ఆమె దినచర్య. తనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆలయానికి వచ్చేసిన దేవుడమ్మ ఆ తర్వాత ఒక్కసారి కూడా తన ఊరు గాని, ఇంటికి గాని వెళ్ళలేదు. కనీసం ఆలయం దాటి బయటకు రాలేదు. నిత్యం స్వామి సేవ తప్ప బయట ప్రపంచంతో తనకు సంబంధం లేదని అంటోంది దేవుడమ్మ..

               దేముడమ్మకు తన పన్నెండు ఏళ్ల వయసులో వెంకటేశ్వర స్వామి కలలో కనబడి పెదకాద కొండపై కొలువైన్నట్లుగా స్వామి వారు చెప్పారని దేవుడమ్మ అంటోంది.. అప్పుడు గ్రామ పెద్దలు అక్కడ ఆలయం నిర్మించడం జరిగిందని అప్పటి నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారని గ్రామస్తులు చెబుతుంటారు... కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల ఎంతో నమ్ముతారు.. దేవుడమ్మనను సాక్షాత్తు పద్మావతి దేవిగా గ్రామస్తులు భావిస్తూ వుంటారు.. ప్రతి ఏటా పద్మావతి వెంకటేశ్వర స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా ఇక్కడ దేవుడమ్మ జరిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు..

గ్రామంలో ఎవరికీ ఏ ఇబ్బందీ ఉన్నా దేవుడమ్మ చేత్తో అలా ఒకసారి తాకితే చాలు. సమస్యలు తీరిపోతాయి అని గ్రామస్థులు విశ్వాసం. గ్రామంలో ఏ ఆవు / గేదె ఈనినా మొదటి పాలు ఈ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 

            గతంలో ఈ ఆలయంలో ఘనంగా జాతర నిర్వహించేవారు. అయితే రెండు ఊర్ల తగాదాల వలన జాతర సరిగ్గా నిర్వహించడం లేదని అంటున్నారు. పైగా ఈ ఆలయం కాలక్రమేణ అభివృద్ధికి నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరిందని గ్రామస్తులు అంటున్నారు... ఏది ఏమైనా డెబ్బైఅయిదు సంవత్సరాలు వచ్చినా వెంకటేశ్వరస్వామి ఆ దేవుడి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది

Photo Gallery