మూగ జీవాలు తమ పిల్లలకు కొంత కాలం మాత్రమే ఆహారం అందించి , తరువాత స్వయంగా తమ ఆహారాన్ని తామే సంపాదించుకునే విధానంతో బాటు , ఎలా బ్రతకాలో కూడా నేర్పించి గూడు నుండి పంపేస్తాయి . అంతే గానీ తమ పిల్లలే అయినప్పటికీ జీవితాంతం పోషించవు. మనుషుల్లో కూడా ఇదే విధానం అనాదిగా వస్తోంది.
ఒక కుటుంబంలో తండ్రి తమ పిల్లలను ఒక వయస్సు వరకు మాత్రమే పోషించి , అప్పటి నుండీ అతని బ్రతుకు అతన్ని బ్రతకమని చెబుతాడు. అందుకు తగిన ఏర్పాట్లు మాత్రం చేసి తన భాద్యత తీర్చుకుంటాడు. ఏ పనీ చెయ్యలేని వైకల్యం ఉంటే తనకు తానుగా సంపాదించుకోలేడు కాబట్టి తాను బ్రతికినన్నాళ్లు పోషిస్తాడు ఆ తండ్రి. అంతే గాని అన్ని బాగున్నా ఏళ్లతరబడి పోషిస్తూ వారిని చేజేతులారా సోమరిపోతులుగా తయారుచెయ్యరు.
కానీ ... అదేమి విచిత్రమో ...
ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు అన్నీ ఉచితంగానే ఇస్తామంటుంది. ఈ ఉచితాలవలన ఎవరికి లాభం ?
ఎవరికి నష్టం ??
ప్రధానంగా చెప్పాలంటే ఈ ఉచితాల వలన రాజకీయపార్టీలు మాత్రమే పూర్తి స్థాయిలో లాభపడుతున్నారన్నది సుస్పష్టం. అధికార పక్షంలో ఉన్న పార్టీవారు ఏదైనా ఉచిత పథకం ప్రకటించిన మరుక్షణమే ప్రతిపక్షపార్టీవారు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. పోనీ అదే పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఉచితాలు రద్దు చేస్తారా ?? అబ్బే .. చెయ్యరు సరికదా .. మరికొన్ని ఉచిత పథకాలు ప్రవేశపెడతారు.
అప్పుడు మళ్ళీ మొదలు పెడతారు అప్పటి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు. అసలు ఈ ఉచితాలు ఎందుకు ఇవ్వాలి ?
దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటి ?? మొదటి అంశం .. వీళ్ళు పెట్టే ఉచిత పథకాలకు ఓట్లు పడతాయి అని ఒక భావన .. రెండవ అంశం ... ఈ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకోవచ్చు. ఎలా అంటే .. ఏదో ఓ ఉచిత పథకానికి ఎవరో ఒకరు ప్లాన్ వేస్తారు. అది అలా అలా అంచెలంచెలుగా సంబంధిత ఉన్నతాధికారికి చేరుతుంది. అప్పుడు DPR రెడీ చేయమంటారు. ఇక్కడ DPR అంటే ... ఈ పథకంలో వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుంది ? ఎంతవరకు అధికంగా ఖర్చు చూపించవచ్చు ? ఎంత మిగులుతుంది ?
ఎవరి వాటా ఎంత ?? ఇలాంటి " డీటైల్డ్ ప్రాజక్ట్ రిపోర్ట్ " తయారుచేసి అప్రోచ్ అవుతారు. ఈ DPR రెడీ అయ్యాక పై అధికారులకు , అక్కడ నుండి మంత్రి పేషికి , అక్కడ నుండి ముఖ్యమంత్రి పేషికి , అక్కడ నుండి ఆర్థికశాఖకు , చివరగా చీఫ్ సెక్రటరీకి చేరి ఇంప్లిమెంట్ అవుతుంది.
ఈ క్రమంలో కొంతమందికి అసలు విషయం తెలియవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ,,, జరిగే విధానం మాత్రం ఇదే !! అసలు ప్రజలు ఎవరైనా మాకు ఉచితంగా ఇవ్వండి అని ఆడిగారా ...
బ్రతికే మార్గం చూపించండి , కొనుక్కునేందుకు వీలుగా ధరలు నియంత్రణలో ఉంచండి ... వైద్యం , విద్య అందుబాటులో ఉంచండి అనే కదా ప్రజలు అడిగేది ...అది మానేసి కేవలం రాజకీయలబ్ది కోసం అవసరం ఉన్నా లేకున్నా ఉచితంగా ఇవ్వడం ఉద్దేశ్యకపూర్వకమైన తప్పు.
అసలు ఈ ఉచిత పథకాలు పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు ?? ఏ ముఖ్యమంత్రి అయినా అతని స్వంత డబ్బు ఏమైనా ఖర్చు పెడతారా ?? లేదు కదా !!! మన డబ్బులే వారు ఖర్చు పెడతారు కదా !! ఇక్కడో చిన్న ఉదాహరణ. ఓ కుటుంబాన్ని తీసుకుంటే ... తల్లి , తండ్రి , ఇద్దరు కుమారులు , ఓ కుమార్తె ఉన్నారనుకుందాం. కుమార్తె వివాహం అయిపోయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. సంపాదన లేకపోయినా ,, ఇంటి బాధ్యతలు తండ్రే చూస్తున్నాడు కదా అని ఇద్దరు కొడుకులు సంపాదించిందంతా తండ్రికే ఇచ్చేస్తున్నారు.
ఆ తండ్రి ఏం చెయ్యాలి ?? అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టి , అనవసరమైన ఖర్చులు తగ్గించి చక్కగా తన బాధ్యత నిర్వర్తించాలి. కానీ డబ్బులు చేతిలో పడేసరికి , ముందు వెనుక ఆలోచించకుండా దేనికి ఖర్చు చెయ్యాలి, దేనికి అక్కర్లేదు అని చూడకుండా అత్తారింటికి వెళ్లిపోయిన ఆడపిల్లకు కొంత , చిన్న కొడుకుకి కొంత , బంధువులకు కొంత ఇచ్చేస్తుంటే ,,, ఆ పెద్దకొడుక్కి ఎలా ఉంటుందో ??
ఒక్కసారి ఆలోచించాలి ... తన కష్టార్జితాన్ని అపాత్రాదానం చేస్తున్న తండ్రిపట్ల అంత వరకూ ఉన్న గౌరవం పోయి , అసహ్యం కలుగుతుంది. ఫలితంగా అంతవరకూ లేని మనస్పర్థలు మొదలవుతాయి.
తన సంపాదన తానే రహస్యంగా దాచుకోవడం మొదలుపెడతాడు.
ప్రభుత్వం కూడా కుటుంబమే ... ముఖ్యమంత్రిది తండ్రి స్థానం . కాబట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి కొంతమందికి ఉచితంగా ఇచ్చిన దానిని మరికొంత మందికి రెట్టింపు ధరకు ఇవ్వడం మంచిదికాదు. ఈ రోజుల్లో తెల్లరేషన్ కార్డు ఉన్నవారు అందరూ నిజమైన పేదవారు కాదు. తెల్ల రేషన్ కార్డు లేనివారందరూ ధనవంతులు కారు.
అసలు ఆ మాటకొస్తే ... పేదవారు అంటూ ఎవరూ లేరిక్కడ ... ఎందుకంటే ,,, ప్రతివారూ కనీసం 60 , 70 వేలు ఖరీదు చేసే వాహనాలు వాడుతున్నారు. బాల్కనీ టికెట్ తో సినిమాలు చూస్తున్నారు. బియ్యం KG 40 రూపాయలకు కొంటున్నారు. కలర్ TV , ఫ్రిజ్ కామన్ అయిపోయాయి. కష్టపడే తత్వం ఉండాలే కానీ ,, ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి న్యాయమార్గంలో నెలకు కనీసం 20 వేలు సంపాదించుకునే పరిస్థితులు ఈ రోజు మనకు ఉన్నాయి . కాబట్టే ... పైన చెప్పినవన్నీ సాధ్యమవుతున్నాయి.
అభివృద్ధిని ఆకాంక్షించాలి కానీ ,,, అభివృద్ధి నిరోధకాన్ని కాదు ...
కేవలం రాజకీయలబ్ది కోసం పేదవారు అనే ఓ ట్యాగ్ తగిలించి మీకు అన్నీ ఉచితం అంటే నిజమేమో అనుకుంటున్నారు కానీ ,, ఆ ఉచితంగా ఇచ్చిన దానికి రెండు మూడు రెట్లు తమ వద్దనుండి మరో రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లుగా కొంతమంది గ్రహించలేకపోతున్నారు.
కొంతమందిని అన్ని సమయాలలోను మోసం చెయ్యొచ్చు .
కొన్ని సమయాలలో అంతమందినీ మోసం చెయ్యొచ్చు . కానీ ,,,
అన్ని సమయాలలోనూ అంతమందినీ మోసం చెయ్యలేరు ...
కాబట్టి ,,, ఇప్పటికైనా పాలకులు స్వలాభం మానుకుని " ఉచితం కాని " ఉచితాలను " ప్రోత్సహించకుండా "
" ఉచితమైన " " ఉచితాలను " మాత్రమే అమలు చేసి , ప్రజారంజక పాలన అందించాలి ...