చూసిపోవడానికి వచ్చినవారిని " చుట్టాలు " అని , బందంతో వచ్చినవారిని " బంధువులని" , తిధి చూడకుండా అకస్మాత్తుగా వచ్చినవారిని " అతిధులు " అని అంటారు.
మొత్తానికి మనఇంటికి ఎవరు వచ్చినా వారిని గౌరవించడం భారతీయ సంస్కృతి. పూర్వకాలంలో ఇంటి బయట కావలసినంత ఖాళీ ప్రదేశంఉండేది కాబట్టి వాస్తు ప్రకారం బావి కానీ లేదా నీళ్ల కుండీ కానీ ఉండేది. ఎవరు వచ్చినా అల్లంత దూరంనుండే చూసి , ఎదురెళ్లి మనస్ఫూర్తిగా పలకరిస్తూ చెయ్యి పట్టుకుని
ఆత్మీయంగా తీసుకొచ్చి , కాళ్ళు కడుగుకోడానికి స్వయంగా నీళ్లు అందించి ఇంట్లోకి తీసుకెళ్లేవారు.
వారు అడగకముందే దాహం ఇచ్చి , కుసలప్రశ్నలు అయ్యాక , వారి అభిరుచిని బట్టి టీయో , కాఫియో ఇచ్చేవారు. స్నానానికి నీళ్లు పెట్టి అది అయ్యేసరికి వేడివేడిగా అల్పాహారం అందించేవారు. తిన్నాక
ప్రయాణ బడలిక తీర్చుకొనేందుకు, గాలి వెలుతురు బాగా వచ్చే ప్రచ్చేకమైన చోట పక్క ఏర్పాటు చేసి , కాలక్షేపంకోసం వారితో మాట్లాడుతూనే వారికి ఇష్టమైన వంటకాలు తయారుచేసి , భోజనానికి కాళ్ళు కడుక్కోమని చెప్పి , వారు వచ్చేలోగా ప్రశస్తమైన అరిటాకులో రుచికరమైన వంటకాలు వడ్డించి , కొసరి కొసరి తినిపించేవారు.
ఇలా... వారు ఉన్నన్నిరోజులు ఎంతో అభిమానంగా వారిని చూసుకుంటూ ,, వెళ్తామని చెప్పగానే మరికొన్నాళ్లు ఉండమని బ్రతిమాలి , ఉంటే సంతోషించి , ఉండలేకపోతే కాస్తంత బాధ పడుతూనే బస్టాండ్ వరకూ వెళ్లి మరీ వీడ్కోలు చెప్పేవారు.
దీనికంతటికీ ముఖ్యకారణం ...
ఆ పరిస్థితులు అలా అనుకూలించేవి. దేనికీ లోటు ఉండేదికాదు. ఇల్లు విశాలంగా ఉండేది. నీళ్లు పుష్కలంగా లభించేవి. ఆహార ధాన్యాలు , పప్పుదినుసులు , పెరట్లో పండించే కాయకూరలు , పాడితో బాటు మనుషుల్లో అభిమానాలు , ఆప్యాయతలు కూడా మెండుగా ఉండేవి.
రాను రాను కరువు కాటకాలు పెచ్చురిల్లుపోయాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
భూమి ధరలు అమాంతం పెరిగిపోవడం మూలంగా ఇల్లు కుదించుకుపోయాయి. ప్రతిదీ ఆచి తూచి చెయ్యాల్సిన కాలం వచ్చింది. ఎవరింట్లో వారే గడపడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరింటికి మరొకరు రావడమే అరుదైపోయింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులులో వచ్చినా ,,, వారు ఉండడానికీ మొగ్గు చూపడం లేదు , వీళ్లు ఉండమనడానికీ మొగ్గు చూపడం లేదు. ఏదో ముళ్ళమీద ఉన్నట్లుగా కాసేపు కూర్చుని వెళ్లిపోవడమే ...
కనీసం మంచినీళ్లు కూడా వారు ఆడిగితేనే గానీ ఇవ్వరు. వాటిని కూడా బోల్డంత డబ్బు పోసి కొంటున్నారు మరి...
మంచినీళ్లకే తావు లేనప్పుడు ఇక ఆ తరువాతవాటికి ఆస్కారం ఎక్కడిది ??
టీలు - టిఫిన్లు మాట దేవుడెరుగు ...
TV సీరియల్స్ టైమ్ లో కనుక మనం ఎవరింటికైనా
వెళ్ళామో అంతేసంగతులు ... కనీసం మనం వచ్చిన విషయం కూడా గమనించరు. కొంతసేపు అలా తచ్చాడగా తచ్చాడగా ..
బ్రేక్ లో కాస్త ఖాళీ దొరుకుతుంది కాబట్టి తలతిప్పి చూస్తే , మనం కనబడితే ఓ నవ్వు నవ్వి , ముక్తిసరిగా మాట్లాడి మళ్ళీ సీరియల్ మొదలవగానే ఇక మీరు వెళ్ళచ్చు అన్నట్లుగా ఓ చూపు పడేసి ,,, సీరియల్ చూడ్డంలో నిమగ్నమైపోతారు..
ఆ సన్నివేశం ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించేవారికే తప్ప అన్యులకు అర్థంకాదు.
కాలానుగుణంగా వచ్చే మార్పుల్లో భాగంగా ,,TV సీరియల్స్ కి కాలం చెల్లిపోయింది ..
అప్పటికన్నా ఇప్పటి బాధ మరీ వర్ణనాతీతం ...
ఎందుకంటే ... ఓ రెండు గంటలు ఎలాగోలా ఓర్చుకుని ఏదో ఓ మూల కూర్చుంటే ,,, సీరియల్స్ ఆ రోజుకి అయిపోతాయి కాబట్టి కనీసం అప్పుడైనా మనపై వారి దృష్టి పడుతుందన్న ఆశ ఉండేది.
ఈనాటి రోజుల్లో అంతకు మించిన ప్రమాదకరమైన పరిస్థితి లు వచ్చాయి.
సాధారణంగా ఇంట్లో ఒకటే TV ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో వ్యక్తుల్లో ఒకరు కాకపోతే ఒకరైనా చుట్టుపక్కల చూసేవారు.
కానీ ఇప్పుడు ప్రపంచాన్ని అరచేతిలో చూపించే స్మార్ట్ ఫోన్లు అందరి చేతుల్లో హస్తభూషణంగా ఉన్నాయి. వాటిల్లో ఒకసారి తల దూర్చారో ఇక అంతే ... పరిసరాలలో ఏం జరుగుతోందో కూడా తెలియనంతగా మైమరచిపోతారు.
టిక్ టాక్ లు , డబ్ మాష్ లు , ఫేస్ బుక్ లు , వాట్సాప్ లు , గూగుల్ లు , యూట్యూబ్ లు , ఇనష్టాగ్రామ్ లు , టెలిగ్రామ్ లు , గేమ్స్ , పబ్ జీలు , సినిమాలు ఇలా ఒకదాని తరువాత మరోటి చూస్తూ తిండి , నిద్రా మానేసి మరీ ఎన్ని యుగాలైనా గడిపేయగలరు. ఛార్జింగ్ అయిపోతుందని భయం లేదు. ఎందుకంటే ..
ఎల్లప్పుడూ ఛార్జింగ్ లోనే ఉంటుంది. పవర్ పోతే ,,, పవర్ బ్యాంక్ ద్వారా ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది..
ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ అవుతుందా అంటే అదీలేదు .. హై స్పీడ్ ఇంటర్ నెట్ వైఫై ... అనివార్య కారణాలతో అది కట్ అయితే రెండు సిమ్ లలో అన్ లిమిటెడ్ మొబైల్ డేటా ఉండనే ఉంటుంది ...
ఇంకా దేనికి కొదవ ???
ఇంటికొచ్చినవారితో కాదు కదా నిత్యం ఓకే ఇంట్లో ఉంటున్న దంపతులమధ్య , పిల్లలమధ్య , అన్నదమ్ములు - అక్కచెల్లెళ్ల మధ్య కూడా మాటా మంతి లేవు. ఇంట్లో వాళ్ళతోనే సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నప్పుడు ఇరుగెవరో ?? పోరుగెవరో ??? తెలిసే ఛాన్స్ లేదు.
ఈ తంతుపై ఇప్పటికే అనేక కార్టూన్స్ రూపంలో హెచ్చరికలు వస్తున్నాయి. అయినా సరే ,,,, పిల్లా పెద్దా తేడా లేకుండా ఈ మహమ్మారికి లొంగిపోయారు.
ఒకసారి అడిక్ట్ అయ్యాక వెంటనే మానేయలేరు గానీ , క్రమేణా ఎవరికి వారే ఆలోచించుకుని ఈ భయంకరమైన అలవాటునుండి బయటపడడానికి ప్రయత్నించాలి.. ఆత్మీయులతో ఆనందంగా గడపాలి. జీవితంలో విలువైన అనుబంధాలను కోల్పోకూడదు.
స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో అందరికీ అత్యవసరమే ..అందులో ఏ మాత్రమూ సంశయం లేదు.. ఫోన్ చేతిలో ఉంటే ఇల్లు కదలెక్కర్లేకుండా చిటికెలో మనకు కావలసిన సమస్త పనులను చేసుకోవచ్చు. ఇది నిజంగా మనకు శాస్త్రవేత్తలు అందించిన గొప్పవరం...
కానీ ... ఏదీ మోతాదు మించకూడదు ...
" అడుగులో ఉండమంటే - సగంలో ఉండు అన్నది ఆర్యోక్తి .. "
అతి సర్వత్రా వ్యర్జితే .....