BREAKING NEWS

హెరిటేజ్... నో ఎంకరేజ్....

హెరిటేజ్... గత తరాల నుంచి మనకు వారసత్వంగా సంతరించే వారినే హెరిటేజ్ అంటారు. అలాంటి వాటిలో హెరిటేజ్ సైట్స్ ముఖ్యమైనవి. మన స్మార్ట్ సిటీ విశాఖలోనే ఎన్నో హెరిటేజ్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణా విషయంలోనే అశ్రద్ధ కనిపిస్తోంది.

ఫలితంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న విషయాలు కూడా ఎవ్వరికీ తెలియకుండా ఉంటున్నాయి. విశాఖ సిటీ పరిధిలోనే పదుల సంఖ్యలో హెరిటేజ్ భవనాలు దర్శనం ఇస్తాయి.. కానీ అవి ఆనాటి కాలం నాటివి అని చాలా మందికి తెలియదు. ఆ దిశగా ప్రచారం చేయడంలో కూడా విఫలం అవుతున్నారు. 

                    హెరిటేజ్ సైట్స్ లో ప్రధానంగా చెప్పుకోవలసింది విశాఖలోనే ఉన్న బౌద్ధారామాలు గురించి. భీమిలి బీచ్ రోడ్ లు ఉన్న బావి కొండ, తొట్లకొంద, అనకాపల్లిలో దారిలో బొజ్జన్న కొండ ప్రధానమైనవి. సుమారు క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 వరకు బౌద్ధులు ఈ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్నారు అని చరిత్ర చెబుతోంది . దానికి తగ్గ ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఆనాడు వాళ్ళు ఉపయోగించిన గదులు, నీటి తొట్టెలు లాంటివన్నీ కనిపించాయి. వారి జీవన విధానం కూడా స్పష్టంగా తెలుస్తోంది.
 
మూడు కొండల మీద దాదాపుగా అన్నీ 9కే రకమైన నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి మాత్రమే కాదు. నగరంలోని వన్ టౌన్ లో కూడా ఎన్నో పురాతన ఆనవాళ్లు ఉన్న భవనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సెయింట్ ఆలోసిస్ స్కూల్. సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ పాఠశాల ఇప్పటికీ సెక్కు చెదరలేదు. 17 వ శతాబ్దంలోని డచ్ సమాధులు ఒక్కసారైనా చూడాల్సిందే. జిల్లా కలెక్టరేట్, టౌన్ హాల్, కురుపాం ఆర్చ్... ఇలా ఎన్నో ఎన్నెన్నో విశాఖతో పెనవేసుకుని ఉండిపోయాయి.

                     అయితే ఇక్కడే అసలు సమస్య మొదలౌతుంది. ఇంతటి చరిత్ర కలిగిన హెరిటేజ్ భవనాలను అసలు పట్టించుకోవడం లేదు. విశాఖను పర్యాటకంగా ఎంతో అభివృద్ది చేస్తాం.. టూరిస్ట్ హబ్ గా మారుస్తాం అంటూ చెప్తున్నారు. ఎక్కడెక్కడో ఉండే కార్యక్రమాలు తీసుకొచ్చి విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా కోట్లు ఖర్చు పెట్టి. నిజానికి పర్యాటకంగా డెవలప్ చేయాలి అంటే జిల్లాల్లోనే ఉన్న ఈ హెరిటేజ్ హిస్టరీని అందరికీ తెలిసేలా చేస్తే చాలు... కోట్లు ఖర్చు పెట్టే చేసే కార్యక్రమాలకు ప్రచార ఆర్భాటాలు భారీ ఎత్తున చేస్తారు. కానీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే హెరిటేజ్ సంపదను మాత్రం చూడడం లేదు.

విశాఖలోని పురాతన భవనాలు అన్ని సందర్శనకు ఒకసారి, కేవలం బౌద్ధారామాలు సందర్శన కోసం ఒకటి రెండు ట్రిప్ లు ఏర్పాటు చేయాలి. అప్పుడెప్పుడో బుద్ధిష్ట్ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటనలు చేశారు. కానీ అవి కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణకు నోచుకోలేదు. 

                  క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత అనకాపల్లి దగ్గర 'శంకరం' అనే ఊరిలో 900 నంవత్సరాల పాటు బౌద్ధం విలసి ల్లింది. 1980 ప్రాంతంలో నేవీ వారు తొట్ల కొండ, బావికొండ, పావురాల కొండలను  గుర్తించారు. పంచదార్ల పక్కన కొత్తూరు, 'మాధవధార కూడా అప్పట్లో బౌద్ధారా మాలే. విశాఖలో దాదాపుగా మొత్తం 20 బౌద్ధారామాలు గుర్తించారు. ఇంకా గుర్తిస్తూనే ఉన్నారు.

క్రీస్తుపూర్వం 800 నంవత్సరాల నుంచి ఇవి ఉన్నాయి. నగరంలో నాటి బౌద్ధారామాలకు సంబంధించిన ఆనవాళ్లు, వాటి పరిరక్షణ గురించి ఏళ్ల క్రితమే కృష్ణశాస్త్రీ అనే పరిశోధకుడు వెలుగులోకి తీనుకొచ్చారు. అయితే ఎవరూ పెద్దగా దానిపై దృష్టి సారించలేదు. ఇప్పటికైనా అధికారులు ఆ దిశగా దృష్టి సారించి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వండి..

Photo Gallery