BREAKING NEWS

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం తెలంగాణ రాష్ట్రం

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం  తెలంగాణ రాష్ట్రం లో నల్గొండ జిల్లా లో  ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం లో ఉంది.
 
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు లోక కల్యాణార్థం కోసం 11 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలు ప్రారంభించినప్పుడు ఘనంగా వాయిద్యాల తో వేద మంత్రాల తో  ప్రారంభిస్తారు.  బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుద్దీపాల తో ఆలయ ప్రాంగణం మొత్తాన్ని చక్కగా అలంకరిస్తారు. ఈ పదకొండు రోజులు పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. వాహన సేవలు ఊరేగింపులు కల్యాణాలు ఇలాగా అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 
 
ఈ ఉత్సవాలు కారణంగా ఆధ్యాత్మిక శోభ మరింత పెరుగుతుంది. యాదాద్రి ఆలయం భువనగిరి అనే జిల్లాలో ఉంది యాదయ్య మహర్షి పేరు మీద ఏర్పడడం ఏర్పాటు అవ్వడం వల్ల యాదాద్రి పట్టణంగా అయ్యింది
 
ఋష్య శృంగ మహర్షి మరియు శాంతనుల పుత్రుడు ఈ ఆలయ మహర్షి ఆంజనేయ స్వామి సలహా వల్ల హరి భక్తులైన ఈయన ఈ ప్రదేశం లో ఎంతో కాలం  నుండి తపస్సు ఇక్కడే చేసుకునేవారు అని స్థల పురాణం ద్వారా తెలిసింది. ఆ సమయం లో ఇక్కడికి ఒక రాక్షసుడు ఈ రుషిని తినబోయాడు ఇదంతా హరి గమనించడం తో సుదర్శన చక్రం ఉపయోగించి ఆ రాక్షసుని చంపేశాడు అప్పటినుంచి ఆ రుషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలుగా ప్రార్ధించి భక్తులకు అండగా ఉండి తపస్సు చేసుకునేవాడు. సుదర్శనం భక్తులందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చి అంతా అర్థమైపోయింది అంత అర్థం అయింది ఆ సమయంలోనే అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరం  వెలిసింది.
 
 ఇదంతా ఆ ఋషి కోరిక వల్లనే జరిగింది అని అందరూ ఈ కొండను యాదయ్య కొండ అని పిలిచేవారు ఈ కొండ ని ఇప్పుడు యాదగిరి గా యాదగిరిగుట్ట గా ప్రసిద్ధి చెందింది. యాదయ్య మహర్షి కోరడం తో ఆంజనేయ స్వామి యాదగిరి లోనే క్షేత్ర పాలకుడుగా నిలిచాడు. ఇక్కడే ఉన్న విష్ణు పుష్కరిణి ఇంకా విశేషంగా మారింది. ఇదంతా లోక కళ్యాణం కోసం చేసినందు వలన ఈ స్వామి వారి కాళ్లను బ్రహ్మ దేవుడు ఆకాశగంగ తోక అడిగాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఆకాశగంగ లో నుండి పారి విష్ణు పుష్కరిణిలో కి చేరింది అందుకనే ఈ పుష్కరిణికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇందువలన ఇక్కడ స్నానం చేసి స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఏం కోరుకున్న నెరవేరుతుంది అని భక్తులు నమ్ముతారు
 
ఈ పుణ్య క్షేత్రం లో పితృ కార్యాలు వంటివి చేస్తే పితృ దేవతలు కూడా ధరిస్తారు. యాదయ్య మహర్షి తపస్సు వల్ల నర సింహ స్వామి ప్రభవించాడు అని పంచ రూపాయలతో దర్శన మిచ్చాడు మరియు భక్తులందరినీ అనుగ్రహిస్తుంటాడు
 
ఈ కారణంగానే ఇక్కడ ఏకాంత సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా కార్యాలను జరుపుతారు ఇదంతా శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు జరిగే ఉత్సవాలు నుండి బ్రహ్మోత్సవాలు వరకు పాంచరాత్ర శాస్త్రాన్ని నుసరిస్తారు. నరసింహ జయంతి మహోత్సవాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. భక్తులు తండోపతండాలుగా ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తారు. ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం కనుక పరిసర ప్రాంతాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ విదియ రోజు నుండి మొదలు పెట్టి   ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు ప్రతి ఏడాది ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఈ వేడుకల్లో స్వామివారు లక్ష్మీ దేవి సమేతంగా వివిధ వాహనాలపై  దేవాలయ ప్రాంగణాల లో ఊరేగింపు చూడడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల లో ఎదుర్కోళ్ళు కళ్యాణం రథోత్సవం చక్ర తీర్థం ప్రధాన వేడుకలు ఎదుర్కోలు వేడుకల లో నరసింహ స్వామి మరియు లక్ష్మీదేవి దివ్యమైన ఆభరణాలతో కనులకు ఇంపుగా అలంకరిస్తారు. ఆచార్య పురుషులు అమ్మ వారి వైపు మరియు ముక్తులు నిత్య శూరులు స్వామి వారి వైపు ఉంటారు.
 
ఈ క్షేత్రానికి ఈ కథ కాకుండా ఇంకొక కథ కూడా ఉంది. ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి నుండి రక్షించడానికి అహోబిలం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క స్తంభాన్ని చీల్చుకుని వచ్చి ఆ రాక్షసుని సంహరించాడు మరియు ఆ భయంకరమైన రూపాన్ని శాంతి  పరచడానికి  ఎవరి వల్ల కాలేదంట ఆ సమయం లో దేవతలు అందరూ లక్ష్మీ  దేవిని ప్రార్థించడం జరిగింది. దానితో లక్ష్మీ దేవి ప్రత్యక్షమై నరసింహ స్వామిని శాంతింప జేసింది అప్పుడు ప్రహ్లాదుడు. ఆ ప్రదేశం లోనే శాంతరూపం లో కొలువై ఉండు అని కోరాడు దీనితో లక్ష్మీ సమేత నరసింహ స్వామి ఆ కొండపై ఉన్న గుహలో వెలిశారు స్వామి వారి వెంట ప్రహ్లాదుడు మరియు సకల దేవతలు వీరితో పాటు  వెళ్లారు.
 
నరసింహ స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా వెళితే అక్కడ శివాలయం కూడా కనబడుతుంది నరసింహస్వామి కన్నా ముందే శివుడు ఈ ప్రదేశం లో స్వయంభూగా వెలిశాడు అని కూడా క్షేత్ర పురాణాలు చెబుతున్నాయి. భక్తులు ఈ మెట్లు  ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి అని నమ్ముతారు.