BREAKING NEWS

ద్వారపూడి ఆలయ ప్రత్యేకత...

 సహజంగా తూర్పు గోదావరి జిల్లా అంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. శోభాయమానంగా ఒక పక్క ప్రకృతి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనితో పాటు పవిత్ర దేవాలయాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. మన తూర్పు గోదావరి జిల్లా లో అనేక ఆలయాలు ఉన్నాయి. నిజంగా వాటిని దర్శించుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పైగా  పూర్వ కాలం లో కట్టిన ఆలయాలు ప్రాచీన కాలం నుండి కూడా బాగా ప్రసిద్ధి చెందాయి, అక్కడ దేవాలయం మహత్యం ఆ కట్టడం చూడడానికి అద్భుతంగా ఉంటుంది.

 పచ్చని కొబ్బరి చెట్లు వరి పొలాలు ఎంతో రమణీయంగా ఉంటుంది. చెప్పాలంటే ఆ ప్రకృతిని వర్ణించడానికి సాధ్యం కాని పని. అటువంటి ప్రకృతి లో ప్రయాణం చేయాలంటే ఎవరికి ఆసక్తి ఉండదు. ప్రతి ఒక్కరికి చూడాలనే ఉంటుంది...... ఆ అందాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు.  ఏది ఏమైనా ఈ అద్భుత ప్రదేశాలని తప్పక చూడాల్సిందే...... వాటిలో ఈ ద్వారపూడి ఒకటి.

 ద్వారపూడి మండపేట మండలానికి చెందిన ఒక చిన్న గ్రామం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ద్వారపూడి ఆలయం అంటే అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఇక్కడ ఉంది దీనితో పాటుగా ఇక్కడ పెద్ద ఆలయాల ద్వారా బహుళ ప్రఖ్యాత గాంచింది. చెప్పాలంటే ఈ ఆలయం చాలా బాగుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. పూసపాటి కృష్ణంరాజు ఈ ప్రాంతానికి చెందినవారే. ఈ ఊరు వరి పొలాలతో పారిశ్రామిక ఉత్పత్తుల తో నీటిపారుదల సౌకర్యాలతో చక్కటి ఆరోగ్య పోషణ వినోద సౌకర్యాలతో నిండి ఉంది. ఈ ఊరి సౌకర్యాలు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి.

ఇక్కడ ప్రధానంగా చూడవలసిందే ఈ ఆలయం. అయ్యప్ప దేవాలయం  చూడడానికి ఎంతో మంది భక్తులు వస్తారు. ఇది పెద్ద పుణ్యక్షేత్రం. ఇది గొప్ప పుణ్య క్షేత్రంగా పేరు గాంచింది. అయ్యప్ప స్వామి దీక్ష సమయం లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయ్యప్పస్వామి మాలలు వేసి  దీక్షలు చేసి సంక్రాంతి సమయం లో కేరళలోని మకరజ్యోతి దర్శనం తో దీక్ష విరమిస్తుంటారు. అయితే కేరళ రాష్ట్రం వరకు వెళ్ళలేని వారు ఇక్కడే సమర్పిస్తారు. 

 అలాగే మన రాష్ట్రంలో చాలా మంది  దీక్ష పూర్తి చెయ్యడానికి ఇక్కడికి వస్తారు. అయితే ఇక్కడ స్వామిలు వచ్చి వాళ్ళ దీక్ష ఇక్కడ పూర్తి చేసుకుంటారు. ఇది రాజమండ్రి నగరానికి 18.6 కిలో మీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి ద్వారపూడి కి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. ద్వారపూడి గ్రామంలో ఫేమస్ ఏంటి అంటే అయ్యప్ప స్వామి ఆలయం అని చెప్పొచ్చు.

 ద్వారపూడి లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళలో ఉన్న శబరిమలై ఆలయంలా  కట్టారు. పచ్చని పొలాలతో తోటలతో కనువిందు చేస్తుంది ఈ ప్రాంతం. ఆలయం బయట గుడి కి సంబంధించిన పూజ సామాగ్రి దేవుళ్ళు ఫోటోలు పిల్లలు ఆడుకునే బొమ్మలు వంటి  దుకాణాలు ఇక్కడ ఉంటాయి. అలానే చుట్టు పక్కల కొన్ని హోటళ్లు కూడా ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే ఆలయ ముఖ ద్వారం చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి ముఖద్వారం కు చేరుకోగానే ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తయిన హరి హరి విగ్రహం కనబడుతుంది. విగ్రహం పాదపీఠం సమీపం లో వినాయక మూర్తికి చిన్న ఆలయం కూడా ఉంది. అలానే గుడి లోపలికి వచ్చే భక్తులు మొదట గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకుని లోపలికి వస్తారు. ఆ తర్వాత హర హరి విగ్రహాన్ని దర్శించుకుంటారు.

 ఈ విగ్రహాల వెనుక అయ్యప్ప స్వామి గుడి ఉంది. అయ్యప్ప స్వామి గుడి రెండు అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో అయ్యప్ప స్వామి మందిరం ఉంది. అలానే కింద అంతస్తులో ఉన్న మందిరం లోకి ప్రవేశ మార్గం తెరచుకున్న సింహం ముఖం  రూపం లో నిర్మించారు ఇది కూడా అక్కడికి వచ్చి భక్తులను ఆకట్టుకుంటుంది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సింహం ముఖం.

అలానే ప్రధాన ఆలయం చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మాలధారణ చేసిన భక్తులు వెళ్లడానికి 18 మెట్లు  అలానే మరో మార్గం వైపు మామూలు భక్తులు వెళ్ళవచ్చు. అయ్యప్ప విగ్రహం ఉన్న దారి నుండి మందిరం  నుండి గర్భగుడి పైభాగంలో గోపురం ఉంది. పై అంతస్తులో మందిరం గోడల పై అయ్యప్ప స్వామి జీవితం లోని ముఖ్య ఘట్టాలను బొమ్మల చిత్రాల తో నిర్మించబడింది. నిజంగా ఆ చిత్రాలు ఆకట్టుకుంటాయి. అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది.

ఇకపోతే అయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. స్వాములు ఇరుముడులు కూడా ఈ ఆలయం లో సమర్పిస్తారు. అంతే కాకుండా ఈ ఆలయం లో నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడే పక్కన సాయిబాబా ఆలయం తో పాటుగా  శివాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉన్నాయి

చెప్పుకుపోతే  ఈ ద్వారపూడి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయాన్ని సరదాగా దర్శించుకోడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఆ పులి ముఖం గుండా వెళ్లడానికి ఆనందపడతారు. అలానే బయట ఉన్న సామగ్రిని కూడా కొనుగోలు చేసుకోవచ్చు సరదాగా దగ్గరగా ఉంది కాబట్టి కుటుంబ సమేతంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు. పుణ్యానికి పుణ్యం ఆనందానికి ఆనందం కలుగుతుంది. సరదాగా సమయం దొరికినప్పుడు లేదా సెలవులు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆంధ్రప్రదేశ్ లో చూడ దగ్గ ఆలయాల్లో ఈ ద్వారపూడి ఒకటి.

Photo Gallery