BREAKING NEWS

బీట్రూట్ లో పౌష్టికాహారం

బీట్ రూట్ ని తినడానికి చాలా మంది ఇష్ట పడరు. కానీ బీట్రూట్ నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్ రూట్ ఎర్రగా గుడ్రంగా నోరూరిస్తూ ఉన్న ఎంతో మంది దీన్ని తినరు. కానీ దీని రంగు రుచి చాలా బాగుంటుంది. అంతే కాకుండా బీట్రూట్ మన శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. బలాన్ని ఇచ్చే ఆహారం లో బీట్రూట్ ఒకటి. బీట్రూట్ తో కేవలం కూర, వేపుడు మాత్రమే కాకుండా బీట్రూట్ తో సలాడ్లు పచ్చడ్లు ఆకు కూరల తో కూడా దీనిని తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల దీని రుచి మరింత పెరుగుతుంది.

అయితే బీట్ రూట్ వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి అని కుంటున్నారా...?  మరి ఆలస్యం చేయకండి దీనిని పూర్తిగా చదవండి. బీట్ రూట్ ని ఆపిల్ తో కలిపి జ్యూస్ చేసుకుని తాగితే ఒంటికి చాలా మంచిది. అలానే రక్త హీనత, జీర్ణ కోశ వ్యాధులు, మల బద్ధకం తగ్గి ఆరోగ్య వంతంగా ఉండే అవకాశం కూడా ఉంది. అలానే  రక్త ప్రసారానికి సంబంధించిన వ్యాధులు బిపి మూత్ర పిండాల వ్యాధులు చర్మ వ్యాధులు తగ్గు ముఖం పట్టడానికి బీట్రూట్ మేలు చేస్తుంది. బీట్ రూట్ లో క్యాల్షియం ఫాస్పరస్ ఇనుము విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అందు మూలం గానే శరీరం లో ఉద్భవించే విష దోషాలను పోగొట్టి గొప్ప ఔషధంగా పని చేస్తుంది.

బీట్ రూట్ లో ఆరోగ్యం :
సహజంగా లభించే పండ్లు కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బీట్రూట్ కూడా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. దీని వల్ల ఒకటా రెండా అనేక ఆహార ఆరోగ్య ఉపయోగాలు బీట్రూట్ లో ఉన్నాయి. క్రీడా కారులు బీట్రూట్ జ్యూస్ తాగి పరుగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. దీని వల్ల వాళ్ళు త్వరగా అలసిపోరు. తాజా పరిశోధన లో తేలింది ఏమిటంటే 400 మిల్లీ లీటర్లు రెండు రోజులకు ఒక సారి బీట్ రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగం లో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం వచ్చిందట. కాబట్టి బీట్ రూట్ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు.

బీట్ రూట్ లో జీరో  శాతం కొవ్వు :
ఇది మరొక ఆరోగ్యకరమైన ప్రయోజనం ఇందు లో అసలు ఫ్యాట్ అనేది ఉండదు. బీట్రూట్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్స్ ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా దీనిని తీసుకుంటే స్వీట్స్ తినాలని ఆలోచన కూడా రాదు. కాబట్టి బీట్ రూట్ తీసుకోవడం ఒక విధంగా మంచిదే 

న్యూట్రియన్స్:
చాలా మంది న్యూట్రిషన్ ఫుడ్ ని తీసుకోవాలనుకుంటారు. అయితే ఎక్కువ న్యూట్రీషియన్స్ బీట్రూట్ లో  కలిగి ఉన్నాయి. విటమిన్ ఏ , విటమిన్ సి, క్యాల్షియం మినిరల్స్ మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఇందులో బాగా పుష్కలంగా ఉన్నాయి. 

ఎనర్జీ బూస్ట్ చేయడానికి బీట్రూట్ :
బీట్ రూట్ ని తరచుగా తీసుకుంటే శక్తి చాలా వస్తుంది. అయితే బీట్ రూట్ వల్ల శక్తి బాగా వస్తుంది. బద్దకంగా ఉన్నప్పుడు బీట్రూట్ తో  ఏమైనా రెసిపీ ట్రై చేస్తే కచ్చితంగా మీ బద్ధకం తొలగి పోతుంది. మీకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది కూడా.

రక్త పోటుకు చెక్ పెడుతుంది బీట్రూట్ :
అధిక రక్త పోటు అనేది ఒక దీర్ఘకాలికమైన సమస్య అయితే ఈ సమస్యలు పరిష్కరించు కోవడానికి బీట్రూట్ గొప్ప ఆయుధం. గుండె వ్యాధులు మూత్ర పిండ వైఫల్యం మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది రక్తపోటు. అయితే వీటి పరిష్కారం బీట్రూట్ తో సాధ్యం అనే చెప్పాలి. బీట్రూట్ దుంప సోడియంను తక్కువగా కలిగి , పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి సోడియం పొటాషియం రక్తపోటును నియంత్రణ లో భారీ పాత్ర పోషిస్తుంది.

మధుమేహానికి బీట్రూట్ :
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి బీట్రూట్ బాగా ఉపయోగ పడుతుంది దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బాగా సహాయం చేస్తుంది. అలానే మధుమేహాన్ని అదుపు లో ఉంచుతుంది.

క్యాన్సర్ నివారణకు బీట్రూట్:
క్యాన్సర్ రాకుండా ఉండటానికి బీట్రూట్ బాగా ఉపయోగ పడుతుంది. బీట్రూట్ సారం యొక్క   ప్రభావాలను ఒక పూర్వ వైద్య సంబంధ ప్రదర్శించింది. ఈ అధ్యయనం ప్రకారం బీట్రూట్ నొప్పిని తగ్గించడానికి మరియు కణాల సంహారమునకు సహాయ పడుతుందని సూచించింది. అయితే బీట్ రూట్ నుండి పొందిన బిటాని అనే ఒక ఆహారపు రంగు రొమ్ము క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పని చేసే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధనలు లో తేలింది.

చూసారు కదా... !  బీట్రూట్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మరి మీ ఆరోగ్యం ని మీరు పెంపొందించుకుని అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే తరచుగా బీట్ రూట్ ని మీ డైట్ లో చేర్చుకుని అనారోగ్య సమస్యల నుండి బయట పడండి.

Photo Gallery