BREAKING NEWS

ఔరా అనిపించే ఏటికొప్పాక బొమ్మలు

చిన్న చెవి దిద్దుల నుండి పెద్ద బొమ్మల దాకా, గోడ గడియారాల నుండి చేప తిమింగలాల  దాకా వాహ్ అనిపించే కళకి భళా...! చెక్క తో చెక్కి సహజ రంగుల తో తయారు చేసే ఈ బొమ్మలు అద్భుతం. ఈ బొమ్మలు నిజంగా రెండు కళ్ళ చూపుని ఆకట్టుకుంటాయి. ఎందటి వారైనా ఈ బొమ్మలకి ముగ్ధులు అవ్వక తప్పదు అనే చెప్పాలి. ఈ బొమ్మల గురించి ఈ ఊరి గురించి తెలుసుకుని ఆ ప్రదేశానికి వెళ్లడం మరచి పోకండి. మరి ఆలస్యం ఎందుకు దీనిని పూర్తిగా చదివేయండి.
 
ఏటికొప్పాక ఊరు:
 
ఏటికొప్పాక ఊరు లక్క బొమ్మలకి ప్రసిద్ధి. ఈ ఊరు విశాఖ జిల్లా యలమంచిలి మండలానికి చెందినది. ఈ గ్రామం వరహ నది ఒడ్డున ఉండుటచే ఏటికొప్పాక అనే పేరు వచ్చింది. ఇక్కడ తయారు చేసే లక్క బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ  తయారు చేసిన బొమ్మలని అనేక ప్రాంతాల లో కూడా అమ్ముతారు. నిజంగా ఎంతో సుందరంగా ఇట్టే ఆకట్టుకునేలా ఉంటాయి ఆ బొమ్మలు. 
 
ఏటికొప్పాక ఎలా వెళ్ళాలి?
 
ఏటికొప్పాక ఊరు విశాఖ జిల్లా యలమంచిలి మండలానికి చెందినది. ఇది యలమంచిలి ఇరవై నాలుగు నిముషాలు దూరం. అలానే అనకాపల్లికి ఇరవై మూడు కిలో మీటర్ల దూరం లో ఉంది ఏటికొప్పాక.  విశాఖపట్నం నుండి ఏటికొప్పాక వెళ్ళడానికి 1 గంట, 20 నిమిషాలు పడుతుంది. విశాఖపట్నం మరియు ఏటికొప్పాక  మధ్య సుమారు డ్రైవింగ్ దూరం 67 కిలో మీటర్లు లేదా 41.6 మైళ్ళు లేదా 36.2 నాటికల్ మైళ్ళు. ప్రయాణ సమయం అంటే కారు వేగం బట్టి 1 గంట, 20 నిమిషాలు కి అటు ఇటుగా ఉంటుంది.
 
ఏటికొప్పాక బొమ్మలు: 
 
ఇక్కడ తయారు చేసే బొమ్మలని ఏటికొప్పాక బొమ్మలు అని అంటారు. ఇది లక్క బొమ్మల తయారుకు ప్రసిద్ధి గాంచినది. నిజంగా ఘన చరిత్ర ఉంది ఈ బొమ్మలకి. ఇక్కడ ప్రజలు బొమ్మలు తయారు చేసి అమ్ముతూ జీవనాన్ని సాగిస్తారు. ఈ బొమ్మల తోనే వాళ్ళ ఉపాధి అనే చెప్పాలి. 
 
ఇక్కడ బొమ్మలకి సహజ రంగులని మాత్రమే ఉపయోగిస్తారు. చెట్ల ఆకులు, పువ్వులు, బెరడులు వంటి వాటి తోనే వాటికి రంగులు వెయ్యడం జరుగుతుంది. ఇది కూడా చెప్పుకో దగ్గ మరో విశేషం. ఈ బొమ్మలు నిజంగా తిరుగు లేని బ్రాండ్. అంత బాగా ప్రసిద్ధి చెందాయి ఈ బొమ్మలు.
 
నిజంగా దీని లో ఏదో మాయ దాగి ఉంది. ఎందుకంటే చేతి తో చేసిన ఆ బొమ్మల రూపు మనసుకి ఎంతో దగ్గరగా ఉంటాయి ఇందులో సందేహం లేదు కానీ ఎదో మాయ ఉంది చెక్క తో చెక్కి చేసిన ఆ కళాకారుల లో .... ఏటికొప్పాక కళాకారుల సృజనాత్మక శక్తికి తిరుగు లేదు. ఇది అంతా ఒక ఎత్తు అయితే. ఆ రంగుల రహస్యం మరో ఎత్తు అనే మనం చెప్పాలి.
 
సహజమైన రంగులు:
 
ఈ బొమ్మలకు సహజమైన రంగులు మాత్రమే వేస్తారు. ఆ రంగులు కూడా మెరుస్తూ ఆకట్టుకుంటాయి. కుత్రిమ రంగుల లోనే అంత ఉండదేమో...! ఈ సహజ రంగులు వల్ల ఆ బొమ్మ అందం మరెంత రెట్టింపు అవుతుంది అనే అనిపించేలా ఉంటుంది. ఈ రంగులు పూలు, చెట్ల బెరడులు నుండి తయారు చేస్తారు. ఇందులో కూడా ఏ సందేహం లేదు. ఏటికొప్పాక బొమ్మ చేయటమంటే ఓ జీవికి ప్రాణం పోసినంత పని, ఎందుకంటే ప్రతి బొమ్మనీ విడిగా తయారు చేయవలసిందే.  అన్ని కలిసి ఒకే సారి చేయటానికి వీలు లేదు. చుట్టు పక్కల ఉండే అడవుల లో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండ బెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. ఇలా చెయ్యడం నిజంగా కష్టమైనా పనే కదా...!
 
కానీ మన ఆంధ్ర లో ఇలా చేస్తూ ప్రసిద్ధి చెందడం, ఒక ఊరు జీవించడం నిజంగా ఆ ఘనత ఇంతా అంతా కాదనే చెప్పాలి. 
 
ఏటికొప్పాక బొమ్మల్లో రకాలు: 
 
కేవలం ఒకటో రెండో బొమ్మలు మాత్రమే కాదు. వివిధ రకాల బొమ్మల్ని ఇక్కడ తయారు చేస్తారు. పిల్లలు ఆడుకునే లక్క పిడతల నుండి చెస్ బోర్డు వరకు, మగువలు పెట్టుకునే చెవి దిద్దుల నుండి తగిలించే కీ చైన్స్ వరకు... పూజ చేసుకునే దేవుడి బొమ్మల నుండి షో కేసు లో పెట్టుకునే షో పీస్ వరకు అమ్మో చెప్పుకుపోతే ఎన్నో ఉన్నాయి. వర్ణించడానికి వీలు లేదు చెప్పుకు పోతే విరామమూ లేదు మన ఏటికొప్పాక బొమ్మలకి.
 
ఏటికొప్పాక చిత్రకారుల కీర్తి:
 
ఈ ఏటికొప్పాక గ్రామం లో  ఇద్దరు వ్యక్తులకు బొమ్మల తయారీ లో రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది. నిజంగా ఎంత  గొప్పో మీరే చూడండి.... సీ.వీ రాజుకు సహజ రంగులు తయారు చేసినందుకు, శ్రీశైలపు చిన్నయాచారికి లక్క బొమ్మల తయారుకు రాష్ట్రపతి అవార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్ద్స్ 2010 సంవత్సరం లో లభించింది. వాహ్ కళాకారుడా భళా...!

Photo Gallery