BREAKING NEWS

రుచిగా రకరకాల దోసలని ఇలా చేసేయచ్చు

దక్షిణ భారతదేశం లో ఎంతో ప్రసిద్ధి చెందిన అల్పాహారాలు లో దోస ఒకటి.  దీన్ని ఒక్కొ ప్రాంతాం లో ఒక్కో విధంగా తయారు చేస్తారు. ఈ అల్పాహారాన్ని బియ్యం మరియు మినప్పప్పు తో తయారు చేస్తారు.  నిజానికి ప్రస్తుతం దోశలు స్ట్రీట్ ఫుడ్ గా కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
సహజంగా దోసెల్లోకి చట్నీ, ఇడ్లీ పొడి మరియు సాంబార్ తో తింటారు.  ప్రస్తుతం వివిధ రకాలుగా అభిరుచికి తగినట్టుగా వాటిని తయారు చేస్తున్నారు. ఉదాహరణకి మసాలా దోస, పన్నీర్ దోస, చీజ్ దోస. రెస్టారెంట్లలో దోసలు చాలా క్రిస్పీ గా వస్తాయి. అదే విధంగా ఇంట్లో చేసుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు దానితో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. 
 
ఏ దోస తయారు చేసుకోవాలన్న దోశ పిండి తయారు చేసుకుంటున్నప్పుడు కొద్దిగా నాన బెట్టిన మెంతులు, అటుకులు వేస్తే దోశ పిండి మృదువుగా వస్తుంది. కనుక దోసెలు కూడా రుచికరంగా ఉంటాయి.
 
మసాలా దోస:
 
మసాలా దోస కి కావలసిన పథార్థాలు:
 
బియ్యం ,మినప్పప్పు, మెంతులు , అటుకులు , బంగాళ దుంపలు , 
ఉల్లిపాయలు పచ్చి మిర్చి ,జీల కర్ర,ఆవాలు, మినప పప్పు ,శనగ పప్పు, అల్లం ,
పచ్చిమిర్చి ఇంగువ , పసుపు , ఉప్పు , నూనె ,కరివేపాకు.
 
తయారు చేసుకునే విధానం
 
ముందుగా నానబెట్టిన బియ్యం, మినప్పప్పు, మెంతులు ,అటుకుల ను మెత్తగా రుబ్బు కోవాలి. ఈ మిశ్రమం లో తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా కూర తయారు చేసుకునేందుకు ముందుగా బంగాళ దుంపలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
 
ఇప్పుడు ఒక పాన్ లో నూనె తీసుకోవాలి . నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శెనగపప్పు మినప్పప్పు వేసుకుని వేగనివ్వాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసుకుని  వేగిన తరువాత కొద్దిగా అల్లం మరియు బంగాళ దుంపల మిశ్రమం వేసుకోవాలి. చివరగా ఇంగువ ఉప్పు పసుపు వేసుకొని సారీ కలిపితే మసాలా కూర తయారు అయిపోయినట్టే.
 
ఇప్పుడు ఒక దోస పెనం తీసుకొని వేడి అయిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా బటర్ వేసుకుని దోశ లా పిండి వేసు కోవాలి. తర్వాత మసాలా కూర దోశ పైన పెట్టుకోవాలి. బాగా కాలిన తర్వాత స్టవ్ ఆపితే మసాలా దోశ రెడీ.
ఈ మసాలా దోశ ను సాంబార్ తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
 
 పన్నీర్ దోస :
 
పన్నీర్ ను ఇష్టపడే వాళ్ళకి ఈ దోస బాగా నచ్చుతుంది. చాలా మంది ఈ దోస ను బయట మాత్రమే తింటూ ఉంటారు కాక పోతే ఇది ఇంట్లో చేసుకోవడం చాలా సులువు.
 
కావలసిన పదార్థాలు

 బియ్యం ,మినప్పప్పు ,మెంతులు ,అటుకులు ,పన్నీర్ ,ఉల్లిపాయలు, టమాటాలు ,పచ్చిమిర్చి,వెల్లుల్లి ,ఉప్పు,కారం,గరం మసాలా,జీలకర్ర ,కొత్తిమీర
నూనె

 తయారు చేసుకునే విధానం

 ముందుగా నానబెట్టిన బియ్యం, మినప్పప్పు, మెంతులు ,అటుకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం లో తగినంత ఉప్పు వేసి ఒక సారి బాగా కలుపుకోవాలి. ముందుగా ఒక పాన్ లో నూనె తీసుకుని వేడిగా అయ్యాక జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనివ్వాలి తర్వాత ఉల్లి పాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు పసుపు కారం మరియు గరం మసాలా వేసి ఇంకోసారి కలపాలి చివరగా పన్నీర్ ముక్కలు మరియు కొత్తిమీర వేసుకుని కలిపి కొంచెం సేపు తర్వాత స్టవ్ ఆపితే పన్నీర్ మసాలా సిద్దం అయిపోయినట్టే.
 
 
ఇప్పుడు ఒక దోస పెనం తీసుకొని వేడి అయిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా బటర్ వేసుకుని దోసల పిండి వేసుకోవాలి. తర్వాత పన్నీర్ మసాలా కూర దోశ పైన పెట్టుకోవాలి బాగా కాలిన తర్వాత స్టవ్ ఆపితే మసాలా దోశ రెడీ. ఈ మసాలా దోశ ను రెడ్ చట్నీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
 
రవ్వ దోస:
 
అల్పాహారం చేసుకోవడానికి కొంచెం సమయమే ఉన్నప్పుడు రవ్వ దోసను సులువుగా తయారు చేసుకోవచ్చు. బియ్యం మినప్పప్పు నానబెట్టడం అవసరం లేదు. అప్పటికప్పుడు ఎంతో తాజాగా పిండిని కలుపుకొని రుచికరమైన దోసలను తినవచ్చు.
 
 కావలసిన పదార్ధాలు:
 
రవ్వ ,బియ్యం పిండి,మైదా,పెరుగు,నూనె,నీళ్లు,ఉప్పు ,అల్లం,పచ్చిమిర్చి జీల కర్ర,కొత్తిమీర
 
తయారు చేసుకునే విధానం:
 
ముందుగా  ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో రవ్వ మైదా బియ్యం పిండి పెరుగు ఉప్పు వేసుకొని బాగా కలపాలి నీళ్లు అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకుని దోస పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం లో తగినంత ఉప్పు అల్లం పచ్చి మిర్చి కొత్తిమీర జీలకర్ర వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. 
 
చివరగా దోస పెనం పై నూనె లేదా బట్టర్ వేసుకుని ఆ మిశ్రమాన్ని  దోసలా వేసుకుని రెండు వైపులా కాల్చు కోవాలి. రవ్వ దోస ఎంతో రుచికరంగా మరియు క్రిస్పీగా వస్తుంది. దోసలు చట్నీ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ దోస క్రిస్పీ గా ఉండటం తో పిల్లలకు ఎంతో నచ్చుతుంది.

Photo Gallery