BREAKING NEWS

అరసవల్లి సూర్య దేవుని దేవాలయం

అరసవల్లి సూర్య దేవుని దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీకాకుళం జిల్లా లో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, క్రీస్తు శతకం ఏడవ శతాబ్దానికి సంబంధించినది ఈ ఆలయం. అరసవల్లి గ్రామం శ్రీకాకుళం పట్టణానికి ఒక కిలో మీటరు దూరం లో ఉంది. కలింగ రాజ్యానికి చెందిన  దేవేంద్రవర్మ ఈ ఆలయ నిర్మాణం చేశారు అని ఆలయ పురాణం చెబుతోంది. ఇదే  భక్తులు కూడా నమ్ముతారు.
 
కశ్యప మహర్షి  మానవులు సంక్షేమం కోసం అరసవల్లి  గ్రామంలో సూర్యుని విగ్రహం ఏర్పాటు చేశారు అని పద్మ పురాణం చెబుతోంది. ఈ దేవాలయం భారతదేశం లో ఉన్న పురాతనమైన సూర్య దేవాలయాల్లో ఒకటి. ఆలయ అధికారులు భక్తుల ను దృష్టిని ఆకర్షించడానికి ప్రవేశ ద్వారం వద్ద చరిత్రను ప్రముఖంగా ప్రదర్శించారు. 
 
సోమవారం నుండి శనివారం వరకు ఈ ఆలయం ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు తెరిచే ఉంటుంది. ప్రధాన భాగం అంటే లోపల పూజ మహా నివేదన కోసం మధ్యాహ్నం 12:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మూసివేస్తారు. ప్రదక్షిణ మధ్యాహ్నం 2:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు అనుమతించరు మరియు ఈ సమయం లో గర్భ గుడి మూసివేయ బడుతుంది. ఆదివారం మాత్రమే ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది.
 
ఈ శుభ కార్యక్రమాన్ని సందర్శించడానికి రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి 10,000 మంది భక్తులు వరకు భక్తులు తరలి వస్తారని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. ఉదయం 6:00 గంటల నుంచి 6:45 గంటల మధ్య కిరణాలు దేవుని పాదాల పై పడుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన నిర్మాణం ఆలయ ప్రధాన దేవత అయిన సూర్యారాయణ విగ్రహం యొక్క పాదాలపై సూర్య కిరణాలు పడటం మాత్రమే కాదు అక్టోబరు మరియు మార్చి నెల లో మూడు రోజులలో విగ్రహాన్ని నాభి స్థాయికి వెలిగించటానికి నెమ్మదిగా పెరుగుతుంది. ఈ ఆలయం లో  ప్రతి సంవత్సరం మార్చి మరియు అక్టోబర్‌ల లో ప్రధాన దేవుని పాదాలు పై పడే సూర్య రశ్మి ను చూడటానికి ఆలయ నిర్మాణం అనుకూలంగా ఉంటుంది.
 
అరసవల్లి ఆలయానికి ఎలా చేరుకోవాలి...? 
 
ఈ గ్రామానికి సమీపంగా రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఇది ప్రధాన చెన్నై మరియు హౌరా లైన్ లో ఉంది. కాకపోతే సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడ ఆగవు. విశాఖపట్నం శ్రీకాకుళం నుండి దక్షిణం వైపు రెండు గంటలు. అరసవల్లి కు సమీప విమానాశ్రయం విశాఖపట్నం. అలానే బస్సు సదుపాయం కూడా ఉంది.శ్రీకాకుళం వరకు బస్సు లో వెళ్తే అక్కడ నుండి అరసవల్లి కి తరచూ బస్సులు వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఇలా బస్సు లో కూడా అరసవల్లి క్షేత్రాన్ని సులువుగా చేరుకోవచ్చు.
 
అరసవల్లి ఆలయ విషయాలు:
 
ఈ ఆలయం మధ్యలో ఆదిత్యుని విగ్రహం ఉండి మరియు నాలుగు మూలల్లో గణేశుడు, శివ, పార్వతి మరియు విష్ణు విగ్రహాలు ఉంటాయి. ఈ దేవాలయం లో మహాశివరాత్రి మరియు రథ సప్తమి ఎంతో ఘనంగా జరుపుతారు. ముఖ్యంగా రథ సప్తమి రోజు భక్తులు తండోపతండాలుగా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. 
 
ఈ ఆలయం యొక్క గొప్పతనం అంతా ఇంతా కాదు మరియు ఆలయ ప్రాంగణం ఎంతో అందంగా ఉంటుంది. ఇది విశ్వకర్మ బ్రాహ్మణులు నిర్మాణ నైపుణ్యాల నుండి తీసుకోవడం జరిగింది. దేవాలయం యొక్క ఐదు ప్రవేశ ద్వారాలు మూసి వేయబడినప్పటికీ సూర్య రశ్మి కిరణాలు సంవత్సరానికి రెండుసార్లు ఉత్తరాణం - మార్చి 9-11 మరియు దక్షిణాయం - అక్టోబర్ 1-3  దేవుని పాదాలకు పడే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఇలా ఏ దేవాలయం లో ఉండదు మరియు ఈ సమయంలో ఆలయం ఎంతో రద్దీగా ఉంటుంది. ఎంత మంది జనం ఉన్నా సరే ఆలయ ప్రాంగనాన్ని ఆలయ సిబ్బంది వారిచే ఎప్పటికప్పుడు శుభ్రపరచడం  జరుగుతుంది.
 
అరసవల్లి ఆలయ ప్రసాదం:
 
ఇక్కడ విక్రయించే ప్రసాదం పులిహోర మరియు లడ్డూలు . ఈ ప్రసాదాన్ని అందరూ ఇష్టపడతారు. ఆలయ ప్రాంతం మొత్తం పచ్చని చెట్ల తో నిండి ఉంటుంది. నిజానికి ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయం లో చిన్న కోనేరు కూడా ఉంది. ఈ కోనేరు లో పుణ్య స్నానాలు చేసి ఆదిత్య భగవంతుని దర్శణం భక్తులు చేసుకుంటారు.
 
అరసవల్లి ఆలయ కధ: 
 
ఈ ఆలయానికి ఇంకో కథ కూడా ఉంది. ఒకసారి దేవంద్రుడు  ద్వారపాలకుడు నంది మాటలను పట్టించుకోకుండా  శ్రీ రుద్రకోటేశ్వర స్వామి వారిని దర్శించడానికి తన ప్రవేశాన్ని అకాల సమయంలో బలవంతంగా ప్రయత్నించాడు. తన విధులను నిర్వర్తించడంలో ద్వారపాలక నంది అతన్ని అడ్డుకున్నాడు.  దాంతో అతడు గాయపడ్డాడు మరియు తన అపస్మారక స్థితిలో  ఉండగా ఇంద్రుడు ఒక ఆలయాన్ని నిర్మించి అందులో సూర్య భగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే  నంది వల్ల కలిగిన ఛాతీలో గాయాల నుండి ఉపశమనం పొందుతానని కలలు కన్నాడు. స్పృహ తిరిగి వచ్చిన తరువాత, అతను కలలు కన్నాడని గుర్తు చేసుకున్నాడు.
 
ఈ ఘన చరిత్ర, విశిష్టత ఉన్న  ఈ ప్రాచీన ఆలయాన్ని అందరూ వీక్షించండి. ఈ ఆలయం వద్దకి చేరి ఈ కట్టడాల్ని, గొప్ప తనాన్ని స్వయంగా వీక్షించండి.

Photo Gallery