BREAKING NEWS

జూన్ నెలలో చూడవలసిన ప్రదేశం - కోనసీమ

మే నెలలో పిల్లలకి వేసవి సెలవులు రావడం వారిని ఎక్కడికైనా తీసుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే కచ్చితంగా మే నెలలో కోనసీమ చూడాల్సిందే.... మే నెల లో కోనసీమను చూడడానికి చక్కటి సమయం. కోనసీమ ని గాడ్స్ ఓన్ క్రియేషన్ అని అంటారు. నిజంగా కోనసీమ లో చిన్న చిన్న పల్లెలు ఎంతో అందంగా ఉంటాయి.
 
పచ్చదనం తో అంతా కూడా నిండి ఉంటుంది. ఎన్నో రకాల ఆలయాలు అక్కడ ప్రాచీన కాలం నుంచి ఉంటూనే ఉన్నాయి. అలానే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి చెట్లు. ఏ దిక్కు వైపు చూసినా కొబ్బరి చెట్లు కనబడుతూనే ఉంటాయి. నిజంగా కొబ్బరి చెట్లు తో ప్రతి పల్లె నిండి ఉంటుంది. అంతే కాకుండా వరి పొలాల తో కోనసీమ చక్కగా ఉంటుంది. 
 
ఎన్ని సార్లు సందర్శించినా  కోనసీమ గురించి మళ్లీ వెళ్లక తప్పదు. ఆ ప్రాంతమంతా కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చాలా మంది టూరిస్టులు కోనసీమ కు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అలానే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  వంటలు. అక్కడ చాలా మంచి ఆహారం దొరుకుతుంది. ఎంతో ఫ్రెష్ సీ ఫుడ్  కూడా అక్కడ దొరుకుతుంది. కోనసీమ గురించి ఎంతో చెప్పాలి...... మరి కోనసీమ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా.....?  మరి ఆలస్యం చేయకండి కోనసీమ గురించి తెలుసుకోండి...
 
 
నిజంగా కోనసీమ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అమ్మ ఒడిలో పడుకున్న అంత హాయిగా ఉంటుంది. చక్కగా అక్కడికి వెళ్లి అన్ని చూస్తూ ఉంటే సమయమే తెలియదు. ఒక మూడు నుంచి ఐదు రోజుల పాటు టూర్ పెట్టుకుంటే అనేక ఆలయాలను కూడా సందర్శించవచ్చు.  అక్కడికి వెళ్లాలంటే దగ్గర ఉండే ఎయిర్ పోర్ట్ అయితే రాజమండ్రి. అలానే రైల్వే స్టేషన్ అయితే రాజమండ్రి మరియు కాకినాడ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ప్రైవేట్ కార్ కానీ టాక్సీ కానీ పట్టుకుని మొత్తం ఊరంతా చూసేయొచ్చు. దీనిని చూడడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఫిషింగ్, క్యాంపింగ్ ఇలాంటివి  కోనసీమ లో చేయవచ్చు.
 
 
కోనసీమ లో ఉండే ఆలయాలు:
 
కోనసీమలో ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి చూడాల్సిన ఆలయాల గురించి ఈ రోజు చూడండి...
 
అంతర్వేది:
 
అంతర్వేది మంచి ఆలయం. ఇది కాకినాడ కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి కి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమలాపురం నుంచి 65 కిలోమీటర్ల మాత్రమే. అంతర్వేది గురించి చెప్పాలంటే అక్కడ సముద్రం. అక్కడ సముద్రం నిజంగా బావుంటుంది. ఆ సముద్ర తీరం దగ్గర కూర్చుని ఆడుకోవడం అంటే ఎంతో మందికి ఇష్టం. అలాగే అక్కడ ఉన్న నరసింహ క్షేత్రాన్ని కూడా చూడడానికి ప్రజలు అనేక ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడ పండగలు కూడా బాగా ఘనంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు కూడా ఇక్కడ జరుపుతారు
 
అయినవిల్లి ఆలయం:
 
ఈ అలయం చాలా బాగుంటుంది. అయినవిల్లి  అమలాపురం నుంచి 14 కిలో మీటర్లు మాత్రమే. అయినవిల్లి లో వినాయకుడు ఆలయం ఉంది. ఇది నిజంగా ఒక ప్రాచీనమైన ఆలయం. ఇక్కడికి కూడా అనేక ఊర్లో నుంచి ప్రజలు వచ్చి దర్శనం చేసుకొంటారు.
 
 అప్పనపిల్లి ఆలయం:
 
అప్పనపిల్లి అమలాపురం నుంచి 13 కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. దీనిని కోనసీమ లో రెండవ తిరుపతి అని భావిస్తారు. ఇక్కడ అనేక పెద్ద పండుగలని జరుపుతారు. మాఘ శుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు కల్యాణ మహోత్సవాన్ని జరుపుతారు.
 
 అలానే మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కల్యాణాన్ని జరుపుతారు. మాఘ శుద్ధ ఏకాదశి నాడు రథయాత్ర జరుపుతారు. జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం చేస్తారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నరసింహ స్వామి వారి జయంతి జరుపుతారు  ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు. పుష్కరాల సమయం లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.
 
 
మందపల్లి :
 
మందపల్లి 30 కిలోమీటర్లు అమలాపురం నుంచి.  దీని చరిత్ర  ఎంతో ఉంది. ఇక్కడ మొత్తం మూడు ఆలయాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఇలా ఈ మూడు ఎంతో ప్రత్యేకమైనవి. 
 
ఇక్కడ ప్రతి సంవత్సరం వివిధ రకాల పండుగలు జరుపుతారు. మాఘ బహుళ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం జరుపుతారు. ఆశ్వీజ మాస  తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు జరుపుతారు. అలానే కార్తీక మాసంలో కూడా వివిధ రకాల పూజల తో ఆలయమంతా కూడా నిండి ఉంటుంది. అలానే కార్తీక మాసంలో లక్షపత్రి పూజ కూడా ఇక్కడ ఘనంగా జరుపుతారు. శని త్రయోదశి నాడు కూడా ఇక్కడ పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది.
 
ఇలా మొత్తం కోనసీమలో అనేక దేవాలయాలు ఉన్నాయి ర్యాలీ, వనపల్లి, అన్నవరం, బిక్కవోలు, భీమవరం, ద్రాక్షారామం, ద్వారకాతిరుమల మామిడాడ, కోటిపల్లి ఇలా వివిధ ఆలయాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
 
కోనసీమలో ప్రత్యేక రుచులు :
 
 కోనసీమ లో పూతరేకులు, పనసకాయ బిర్యానీ, పులస చేప,  పీతల కూర, కొబ్బరి అన్నం, కాజా వంటివి ఎంతో ఫేమస్. ఒకవేళ కనుక అక్కడికి వెళితే తప్పక వీటిని తినాల్సిందే.

Photo Gallery