BREAKING NEWS

శానిటైజర్ వలన చేతులు పొడిగా అయ్యిపోయాయా.

కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఏదేమైనా ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిది. కరోనా కేసులు తగ్గి పోతున్నాయి అని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం మంచిది కాదు. వీలైనన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కు ధరించాలి. అవసరం అనుకుంటే రెండు మార్కులు కూడా ధరించడం మంచిది.
 
అలానే బయట నుండి రాగానే శానిటైజర్ తో హాండ్స్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటి తో పాటుగా మంచి ఆహారం తీసుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంచుకునే పద్ధతులని పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
 
ఇప్పుడిప్పుడే కరోనా కేసులు దిగి వస్తున్నాయి. కనుక  అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నిజంగా ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశం లో ఒక్కొక్క విధంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కనుక జాగ్రత్తగా ఉండడం చాల అవసరం.
 
ఈ కరోనా వేళల్లో ఎక్కువగా శానిటైజర్ ని ఉపయోగించడం వలన ఎన్నో స్కిన్ సమస్యలు వస్తున్నాయి. వాటి నుండి బయట పడడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని విషయాలని మన తో పంచుకున్నారు. మరి వాటి కోసం కూడా చూద్దాం.
 
అయితే ఈ మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకున్న ఒకే ఒక్క చిట్కా శానిటైజర్ వాడడం. అయితే దీనిని ఉపయోగించడం వల్ల చేతులు పొడిబారిపోతాయి. దీని నుండి మీరు బయట పడాలంటే ఈ చిట్కాలను పాటించాలి అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి.
 
ఎక్కువ శానిటైజర్ ని ఈ వైరస్ వలన మనం ఉపయోగిస్తుండడం వలన సమస్యలు వస్తున్నాయి. కనుక వీటి నుండి బయట పడాలంటే ఈ చిట్కాలు బాగా పని చేస్తాయి. పదే పదే శానిటైజర్ ని చేతి పైన వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల చేతులు పొడిబారిపోతూ ఉంటాయి. అదే విధంగా వివిధ రకాల హ్యాండ్ వాష్ల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
 
పొడిబారి పోవడమే కాక కొంత మందికి అయితే తీవ్రమైన ఎలర్జీ సమస్యలు ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. మరి వాటి నుండి ఎలా బయట పడాలి అని ఆలోచిస్తున్నారా ఎటువంటి చింత లేకుండా ఈ సులువైన చిట్కాలు పాటిస్తే ఈజీ దీని నుండి  బయట పడొచ్చు. మరి వాటి కోసం ఒక లుక్ వేయండి.
 
ఆయుర్వేద ఎక్స్పర్ట్స్ కొన్ని ముఖమైన టిప్స్ ని మనతో పంచుకున్నారు నిజంగా వాటిని పాటిస్తే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శానిటైజర్స్ వంటివి చేతి మీద వేసుకుని వాడడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. చేతి మీద ఈ సమస్యలు ఉన్నప్పుడు ఈ చిట్కాలు పాటించండి.
 
చేతులు పొడిబారి పోయిన లేదా ఏమైనా ఎలర్జీ వంటివి వచ్చినా చేతి మీద కాస్త కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్ వేయండి. ఇలా చేయడం వల్ల చేతులు పొడిబారకుండా ఉంటాయి. ఇంట్లో సమన్లు తోమినప్పుడు లేదా బట్టలు ఉతికిన తర్వాత కాస్త కొబ్బరి నూనె లేదా అలోవెరా జెల్ ని  మీరు  అప్లై చేసుకో వచ్చు. వీటి వల్ల చేతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఆయుర్వేద పద్ధతుల్ని ప్రయత్నం చేసి చూడండి.
 
ఇంట్లో సామాన్లని  కడిగేటప్పుడు కొబ్బరి పీచు లేదా బొగ్గుని ఉపయోగించ వచ్చు లేదంటే మంచి నాణ్యమైన డిష్ వాష్ ని మీరు ఉపయోగించుకో వచ్చు. రబ్బర్ గ్లోవ్జులు వంటివి కూడా మీరు సామాన్లు తోమేటప్పుడు వాడ వచ్చు. దీని వల్ల కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉండవు అదే విధంగా మీరు స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా ఇంట్లో తయారు చేసిన బాడీ స్క్రబ్ ను ఉపయోగించ వచ్చు. స్నానం చేయడానికి బాడీ స్క్రబ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం
 
బాడీ స్క్రబ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
 
 100 గ్రాములు బియ్యం
 100 గ్రాములు పచ్చని పెసలు
 పది గ్రాములు దాల్చిన చెక్క
 పది గ్రాములు పసుపు 
 
బాడీ స్క్రబ్ తయారు చేసుకోవడానికి సులువైన పద్ధతి:
 
దీని కోసం మీరు  100 గ్రాములు బియ్యం, 100 గ్రాములు పచ్చని పెసలు, పది గ్రాములు దాల్చిన చెక్క, పది గ్రాములు పసుపు తీసుకోవాలి. ఆ తరువాత వీటిని అన్నింటినీ విడివిడిగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక జార్లో వెయ్యండి అంతే. ఇలా ఈజీగా ఈ పొడిని మనం ఇంట్లోనే తయారు చేసుకో వచ్చు. పైగా పెద్దగా శ్రమించక్కర్లేదు కూడా.
 
దీన్ని ఎలా ఉపయోగించాలి:
 
ఇక దీనిని ఎలా వాడాలి అనేది చూస్తే.. ప్రతీ రోజు  స్నానం చేసేటప్పుడు ఈ పొడిని వాడచ్చు. స్నానం చేసే సమయం లో  దీనిలో కొద్దిగా నీళ్ళు లేదా పాలు కలుపుకుని సబ్బుకు బదులుగా ఉపయోగించండి. దీంతో మీకు సమస్యలు రావు.