BREAKING NEWS

ఆనందయ్య తయారు చేసిన కంట్లో మందు ఎలా పని చేస్తుందంటే..?

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటం కష్టమైపోతోంది. అయితే ఇటువంటి కష్ట సమయం లో కాస్త రిలీఫ్ నిచ్చింది కృష్ణపట్నం ఆనందయ్య మందు. ఇది ఎంత ఫేమస్ అయిందో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  రోగుల ప్రాణాలు రక్షిస్తున్న ఆ మందు వెనుక రహస్యం తెలుసుకుని ఆయుష్ విభాగం ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది.
 
ఆనందయ్య ఈ మందుల్లో ఆయుర్వేద మూలికలు ఉపయోగిస్తున్నారు. నిజంగా ఆయుర్వేద మూలికల తో కరోనా కి మందు అందుతోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పదార్థాలలో ఎటువంటి హానికరం కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది.
 
ఆనందయ్య మందు అందరికీ అందుబాటు లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది అయితే అన్ని మందులకి పర్మిషన్ ఇచ్చారు కానీ కంట్లో వేసుకునే మందుకి మాత్రం పర్మిషన్ లభించ లేదు. కంట్లో వేసే ముందు ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. అందుకని మిగతా ఔషధానికి అనుమతి ఇచ్చారు.
 
అసలు ఈ కంట్లో మందు ఎందుకు..?
 
ఆనందయ్య వివిధ రకాల మందులు అందిస్తున్నారు. అయితే ఇందులో కంట్లో వేసుకునే ముందు కూడా ఒకటి ఉంది. అయితే ఈ మందుని అలోపతి నిపుణులు వ్యతిరేకించ వచ్చు కానీ ఈ కంట్లో ఈ డ్రాప్స్ వేస్తే మెదడు లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మనకు ఎన్ని మందులు వచ్చాయి.
 
కానీ పాత కాలం లో మాత్రం అన్ని మందులు రాలేదు. అటువంటి సమయం లో పసర్లు మాత్రమే వాడే వారు పాము కాటు తర్వాత మెదడుకు ఆక్సిజన్ అందక పోతే చనిపోతారు. కాబట్టి చివరి ప్రయత్నంగా పసరు పోసే ప్రాణం నిలబెట్టడానికి ప్రయత్నం చేసేవారు. నిజంగా ఇది కూడా ఒక మంచి ఆలోచన ఆనందయ్యకి వచ్చిందని చెప్పాలి. కాని దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ పద్ధతి మంచిదే. దీనిలో వాడే  ముడిసరుకు కూడా హానికరం కాదు.
 
ఇవి అన్నీ కూడా ఆయుర్వేదమే. దీని వల్ల ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా రావు. అయితే ఆనందయ్య వంశపారపర్యంగా పాము కాటుకి వేసే వైద్యం లో ఆయన కూడా ఒకరు. సాధారణంగా పాము కాటుకి పసరు వైద్యం చేస్తారు. అందుకు కొన్ని ఫార్ములాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఆయన వేసే ముందు ఇప్పటికిప్పుడు తయారు చేసినది కాదు.
 
కరోనా సమయం లో ఆయన దాన్ని ప్రయోగించే ఉండవచ్చు. ఆనందయ్యకి కేవలం పసరు వైద్యం మాత్రమే కాదు సిద్ధ వైద్యం కూడా తెలుసు. ఆనందయ్య పంచమహాభూతాలు బ్యాలెన్స్ చేయడం ద్వారా జీవితాన్ని నిలబెట్టిన ఫార్ములా తో ఈ మూలికలని ఉపయోగించారు. కరోనా  వల్ల ఆక్సిజన్ కోల్పోతున్న వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు ఆయనకు ఈ ఆలోచన వచ్చింది నిజంగా ఇది మంచి ఐడియా అని చెప్పాలి.
 
అయితే ఆనందయ్య మందు మంచిదేనా అనే విషయానికి వస్తే... ఇప్పటికే దీనికి అనుమతి వచ్చిందని తెలిసింది. అయితే ఆనందయ్య మందులు పరిశీలించేందుకు వెళ్ళిన వాళ్ళు ఆయుర్వేద పుస్తకాల లో ఫార్ములా కోసం చూశారు. ఆయన ఏ కాంబినేషన్ మందులు వాడుతున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసారు. అయితే అయిన వాడేవి అన్ని కూడా శరీరానికి పనికొచ్చేవే దీంతో ఆయన మందు కి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది.
 
ఆయన ముందుకి కథలు లేని వాళ్ళకి కూడా ఎంతో బాగా పని చేస్తోందని తెలిసింది. మరి ఇంత బాగా పనిచేసే మందు ఉపయోగిస్తే కోటయ్య ఎందుకు మరణించాడు అనే ప్రశ్న చాల మందిలో వుంది.. అయితే దీని కోసం కూడా ఇప్పుడు చూసేయండి...
 
కోటయ్య అనే వ్యక్తి కరోనా తో బాధ పడుతూ ఆక్సిజన్ స్థాయి బాగా పడి పోయిన సందర్భంలో ఆనందయ్య వద్దకు వెళ్ళాడు. అయితే ఆనందయ్య మందు వేయగానే కోటయ్య లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయి, ఆ తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అక్కడ నుంచి అలోపతి వైద్యం తీసుకుంటే బతికేవాడేమో అని అందరూ అంటున్నారు.
 
ఈ మందు బ్రెయిన్ కి ఆక్సిజన్ ని ఇస్తుంది కానీ ఊపిరితిత్తులకి కాదు. కరోనా ప్రభావం చాలా తక్కువ సాధారణంగా ఉండే వ్యక్తులకు ఇది బాగా పనిచేస్తుంది. అయితే తీవ్రంగా ఉండే వాళ్ళకి మాత్రం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. అయితే ఆనందయ్య మందు వేసుకోగానే కోటయ్య కి కరోనా తగ్గిపోయింది ఏమో అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మందు  ఆక్సిజన్ పెంచేందుకు మాత్రమే సహాయపడుతుంది అయితే ఈ మందు ఏకంగా డీ2  తరహాలోనే పనిచేస్తుంది.
 
అయితే దీని కోసం కూడా  క్లినికల్ ట్రైల్స్ లాంటివి వేసినట్టు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక రోగి పై ప్రయోగం చేస్తే ఆమె ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి. తరువాత ఆమె లేచి కూర్చున్నారు నిజంగా ఆయుర్వేదంలో కూడా ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని అందరు ఆశ్చర్య పోతున్నారు.