BREAKING NEWS

అంతర్జాతీయ యోగ దినోత్సవం: ఈ ఆసనాలతో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి..!

యోగ ఆరోగ్యానికి చాలా మంచిది.  నిజంగా ఇది దివ్య ఔషధం అనే చెప్పాలి. యోగాతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శారీరకంగా, మానసికంగా కూడా చాలా ప్రయోజనాల యోగ ద్వారా మనకి లభిస్తాయి. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురించి, యోగాసనాలు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
 
యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. ప్రతి రోజు యోగా చేయడం వల్ల సామర్థ్యం, దైర్యం పెరుగుతాయి. అదే విధంగా అనవసరమైన ఆలోచనలని మన నుండి దూరం చేస్తుంది. ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఆత్మ విశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవాటైపోయి ఏకాగ్రత పెరుగుతుంది.
 
జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి కూడా పెరుగుతుంది. అలానే యవ్వనంగా కనిపిస్తారు. అంతే కాదండీ యోగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎసిడిటీ సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయి.
 
 తల నొప్పి మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు రెగ్యులర్ గా యోగా చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు కూడా మీ దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా ఎక్కువ సేపు కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి మెడ నొప్పి, వెన్ను నొప్పి, తల నొప్పి వంటివి వస్తుంటాయి.
 
అలాంటి వాళ్లు ప్రతి రోజు యోగాసనాలు వేయడం వల్ల క్రమంగా నొప్పులు తగ్గిపోతాయి. శరీరం ఎంతో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. యోగా చేయడం వల్ల కొన్ని రకాల హార్మోన్లు విడుదలవుతాయి. వీటి వల్ల శరీరం చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఆక్సిజన్ తో కూడిన రక్తం శరీరం అంతా బాగా సర్క్యులేషన్ అవుతుంది. చూశారా యోగ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో ప్రయోజనాలు మీరు యోగ ద్వారా పొందొచ్చు.
 
యోగా చేసేటప్పుడు తప్పకుండా వీటిని పాటించడం మంచిది:
 

తిన్న వెంటనే యోగ చేయకుండా కనీసం అరగంట నుంచి గంటసేపు అయిన గ్యాప్ ఇవ్వండి.
భోజనం చేసిన వెంటనే యోగా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. 
అలానే యోగాన్ని మొదలు పెట్టేటప్పుడు ప్రాణాయామం చేయడం మంచిది. ప్రాణాయామం చేయడం వల్ల మీరు యోగ పై ఆసక్తి పెరుగుతుంది. అదే విధంగా ఇది వార్మప్ లాగ పనిచేస్తుంది.
ఎవరూ లేని ప్రదేశంలో రిలాక్స్ గా కూర్చుని తొందర పడకుండా యోగా చేయడం మంచిది.
 
ఒక రోజు రెండు రోజులు యోగ కాస్త కష్టంగా ఉంటుంది. కానీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఎంతో సులువుగా అయిపోతుంది. కాబట్టి మీ సమయంలో కాస్త సమయాన్ని యోగా కోసం వెచ్చించి అలవాటు చేసుకోవడం మంచిది.
 
ముఖ్యమైన కొన్ని యోగాసనాలు మరియు వాటి ప్రయోజనాలు:
 
నిజంగా కొన్ని భంగిమలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా సమస్యలకు చెక్ పెట్టడానికి యోగ బాగా పనిచేస్తుంది అయితే కొన్ని ముఖ్యమైన యోగాసనాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఇక్కడ ఉన్నాయి. మరి వాటి కోసం కూడా చూసేయండి.
 
 కపాలభాతి:
 
ప్రతి రోజు కపాలభాతి చేయడం వల్ల జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలు తగ్గిపోతాయి. కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా చెడు పదార్థాలను తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచి దృఢంగా మారుస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కూడా ఇది చూసుకుంటుంది.
 
పవనముక్తాసనం:

 
పవనముక్తాసనం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.  గ్యాస్ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచి ఔషధం అని చెప్పవచ్చు. ప్రతి రోజు ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడిని కూడా మీరు తగ్గించుకోవచ్చు. పవనముక్తాసనం చేస్తే ఎసిడిటీ సమస్య సులువుగా మాయమైపోతుంది. కాబట్టి రెగ్యులర్ గా దీన్ని కూడా వేయండి.
 
 హలాసనం:
 
హల అంటే నాగలి అని అర్థం. ఈ ఆసనం వేయడం వల్ల ఎంతో ఫ్లెక్సిబుల్ గా మీరు ఉండొచ్చు అదే విధంగా మిమ్మల్ని చాలా దృఢంగా మారుస్తుంది. భుజాలు మరియు వెనుక ఉండే మజిల్స్ ఎంత ఫ్రీగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇలా ఈ ఆసనం వల్ల కూడా మీరు ఈ ప్రయోజనాలను ఈజీగా పొందొచ్చు.
 
 విపరీత కరణి:
 
ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. జలుబు, ఫ్లూ సమస్యల్ని దూరం చేస్తుంది. దానితో పాటుగా శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను కూడా ఇది పెంచుతుంది. ఈ ఆసనంలో శరీరం రివర్స్ చేస్తాము కనుక అనారోగ్యం కారణంగా వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనంతో ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు.
 
 చూశారు కదా యోగ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో.. రెగ్యులర్ కనుక మీరు వీటిని చేస్తే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అదే విధంగా మీరు వీటితో పాటు మంచి ఆరోగ్యకరమైన డైట్ ని తీసుకుంటూ ఉండండి. వ్యాయామం, మంచి పౌష్టికాహారం, మంచి నీళ్లు, సరైన నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఇంకేం కావాలి.