BREAKING NEWS

మిస్-సి సమస్యతో చిన్నారులు.. విశాఖపట్నంలో పదిమందిని గుర్తించిన వైద్యులు..!

 కరోనా మహమ్మారి కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిజంగా ఈ మహమ్మారి ఎప్పుడు మన నుండి తొలగి పోతుంది అని అందరు ఎదురు చూస్తున్నారు. కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు కులుకున్నారని రిలీఫ్ గా వుంటుంటే.. తిరిగి ఏదో ఒక సమస్య వేధిస్తోందని.. వాటి వలన కూడా సఫర్ అవ్వాల్సి వస్తోందని మనకి తెలిసిందే.
 
కరోనా నుంచి కోలుకున్న పెద్దలకి బ్లాక్ ఫంగస్ వస్తూ ఉంటే... పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ సమస్య వస్తోంది. మరి దీని కోసం ఇప్పుడు అనేక విషయాలు చూసేద్దాం.. ఆలస్యమెందుకు పూర్తిగా చూసేయండి.
 
అయితే ఈ వ్యాధి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. దీని గురించి తెలిస్తే మీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ తీసుకుంటూ ఉండొచ్చు. అలానే ఈ లక్షణాలు గుర్తించి మీరు వైద్యుడిని సంప్రదించండి.
 
మరి ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు మొదలైన అనేక విషయాలు వైద్యులు చెప్పారు వాటి కోసం ఒక లుక్ వేసేయండి. విశాఖపట్నం లో కేజీహెచ్ హాస్పిటల్ లో ఇప్పటికే గత రెండు నెలల నుంచి పది మంది చిన్నారులు ఆస్పత్రి లో అడ్మిట్ అయ్యారు.
 
 ఈ 10 మంది చిన్నారుల లో ఏడుగురు తిరిగి కోలుకుని ఇంటికి వెళ్ళి పోయారు కానీ మరో ముగ్గురు ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా తగ్గి పోయిన తర్వాత పిల్లల్లో ఈ వ్యాధి ఉందని దీని కారణంగా వాళ్ళు సతమతమవుతున్నారు అని వైద్యులు గుర్తించారు. అయితే గతం లో చూసుకున్నట్టయితే ఈ సమస్య ఎప్పుడూ ఎవరికీ రాలేదని.. ముఖ్యంగా చిన్నారులు లో ఇలాంటి సమస్యలు చూడలేదని వైద్యులు అంటున్నారు.
 
ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో ఎక్కువగా జ్వరం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ వ్యాధి లక్షణాలు కనుక సరిగ్గా సమయానికి గుర్తించక పోతే వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వున్న ఈ ముఖ్యమైన విషయాలని తల్లిదండ్రులు గుర్తిస్తే మంచిది. దానితో వాళ్ళల్లో ఏ సమస్య కూడా ఉండదు. ఇక అసలు విషయం లోకి వెళ్ళిపోతే..
 
మిస్ సి సమస్య తో ఆసుపత్రి లో చేరిన పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కూడా కోవిడ్ సోకిన అంశాలు కనబడడం లేదు కానీ వారికి పరీక్షలు నిర్వహించగా శరీరం లో యాంటీబాడీస్ తో పాటు ఇతర వ్యక్తులు లో కనిపించే లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. కరోనా సోకినప్పటికి ఎటువంటి లక్షణాలు కనబడకుండా కరోనా తగ్గిపోయిందని గుర్తించారు.
 
 అటువంటి వారిలో కొందరికి ఇప్పుడు ఈ సమస్య వేధిస్తోంది. ఇంట్లో పెద్దలు ఎవరైనా కరోనా వైరస్ బారిన పడి ఉంటే.. అప్పుడు పిల్లల్ని కూడా ఒక సారి పరీక్షించడం ముఖ్యం. పిల్లలకి మూడు రోజులకు మించి జ్వరం ఉంటే తప్పని సరిగా డాక్టర్ ని కన్సల్ట్ చేయమని డాక్టర్లు అంటున్నారు.
 
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న పెద్ద వాళ్లలో అవయవాలు దెబ్బతింటున్నాయి కానీ చిన్నారుల్లో కాస్త విరుద్ధంగా ఉంటున్నాయి. లక్షణాలు చిన్నారుల్లో ఎవరైతే కరోనా బారిన పడతారో వాళ్ళలో యాంటీ బాడీస్ అభివృద్ధి చెంది శరీరం పైనే దాడి చేస్తూ ఉన్నాయి.
 
అయితే ఎక్కువగా ఇది 18 ఏళ్ల లోపు ఉండే చిన్నారుల లో కనబడుతుందని వైద్యులు చెబుతున్నారు. మామూలుగా పెద్దలతో పోల్చుకుని చూస్తే... పిల్లల్లో అభివృద్ధి చెందుతున్న యాంటీ బాడీస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయని దాని వల్లే ఈ సమస్య వస్తుందని అంటున్నారు.
 
 ఏది ఏమైనా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. పెద్దలు బయటికి వెళ్లి వచ్చిన తర్వాత పిల్లల్ని తాకవద్దు. అదే విధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం పిల్లలకు కూడా మాస్క్ వేయడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుతోంది ఇటువంటి సమయం లో తేలికగా తీసుకుని బయటకి వెళ్లి పోవడం లాంటివి చేయొద్దు. కరోనా వైరస్ ఉంటే ఎలా ఉంటారో అదే విధంగా ఇంకా కొనసాగించడం మంచిది. 
 
మల్టీ సిస్టం ఇంఫలమేటరీ సిండ్రోమ్ బారినపడ్డ చిన్నారుల్లో కనిపించే లక్షణాలు:
 
అయితే ఎటువంటి లక్షణాలు కనబడుతున్నాయి అనేది చూస్తే.. ఐదేళ్ళ లోపు చిన్నారులు కవేశా కి  సిండ్రోమ్ లక్షణాలు కనబడుతున్నాయి. అంటే మూడు రోజులు మించి జ్వరం ఉండడం, పెదాలు చిట్లి పోయినట్టు ఉండడం, కళ్ళు ఎర్రబడడం, నాలుక ఎర్రగా మారి పోవడం, మెడ కింద గ్రంధులు పెరగడం వంటి లక్షణాలు ఉంటాయి.
 
 ఇక అయిదేళ్లు దాటిన చిన్నారుల లో ఎలాంటి లక్షణాలు కనబడుతున్నాయి అంటే.. ఐదేళ్లు దాటిన చిన్నారుల్లో మూడు రోజుల నుంచి జ్వరం ఉంటుంది. అదే విధంగా ఒళ్లంతా దద్దుర్లు, కళ్ళు ఎర్రగా అయిపోవడం, తల నొప్పి కలగడం, కడుపు నొప్పి, వాంతులు, బీపీ డౌన్ అయిపోవడం, విరోచనలు వంటి లక్షణాలు కనబడుతున్నాయి.
 
ఒక వేళ కనుక మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనపడితే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి ఇటువంటి లక్షణాలు కనుక పిల్లల్లో కనబడితే అప్రమత్తం కావాలని డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు. 
 
రక్తం సరఫరా చేసే  కరోనరీ ఆర్టరీ బుడగ మాదిరిగా ఉబ్బిపోతుందని కూడా అంటున్నారు. ఇలా కనుక జరిగితే పిల్లలు మృతి చెందే అవకాశం కూడా ఉందని అంటున్నారు.