BREAKING NEWS

కరోనా థర్డ్ వేవ్: చిన్నారులపై ఎక్కువ ప్రభావం..!

కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక సమస్యల తో సతమతమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వీలైనంత వరకు కనీస జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉండొచ్చు. ఇప్పటికే కరోనా మొదటి, రెండవ దశలని మనం చూశాం. అయితే రానున్న రోజుల్లో మూడో వేవ్ కూడా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం..!
 
కరోనా మహమ్మారి కారణంగా ఎందరో మంది సతమతమవుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్, మే నెలల లో తీవ్ర స్థాయి లో కరోనా కేసులు రికార్డయ్యాయి.
 
 కానీ జూన్ మొదటి వారం లో లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. దీంతో కాస్త ఊరటనిచ్చింది అనుకుంటే చిన్నారుల పై మూడవ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది మనం విన్నాం.
 
దీని వల్ల చాలా మంది భయ పడిపోతున్నారు. చిన్నారులకు మూడవ దశ లో మాత్రం ఎక్కువగా ముప్పు ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. గత సంవత్సరం అయితే పిల్లల లో యువతు పై కరోనా ఎటువంటి ప్రభావం పెద్దగా చూపలేదు.
 
 కానీ మూడవ వేవ్ లో మాత్రం పిల్లల పై ప్రభావం ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో కూడా 15 శాతం మంది పిల్లలు ఉన్నారు. దీంతో తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది అని చెప్పాలి.
 
 పిల్లల్లో కరోనా వైరస్ ని ఎలా గుర్తించాలి...?, వాళ్లకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం . కరోనా వైరస్ బారిన పడిన పిల్లల్లో స్వల్ప లక్షణాలు ఉంటాయని నిపుణులు చెప్పారు.
 
పిల్లల్లో కరోనా లక్షణాలు:
 
ఆహారం సరిగా తీసుకో లేక పోవడం, ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం వంటి లక్షణాల తో పాటు జ్వరం, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు దిబ్బడ, దగ్గు, గొంతు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, రుచి తెలియ కపోవడం, వాసన తెలియక పోవడం ఇలాంటివి కనపడే అవకాశాలు ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
సాధారణంగా పిల్లలు కోవిడ్ బారిన పడి త్వరగా కోలుకుంటారని. పెద్దలు, యువత కంటే కూడా వీళ్ళు త్వరగా కోలుకుంటారని తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా  ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
 పిల్లల్లో జలుబు జ్వరం ఉంటే కనుక రెండు నుంచి మూడు రోజుల్లో వాళ్ళ కోలుకుంటారని కానీ ఇతర లక్షణాలు ఉంటే తప్పని సరిగా ఆసుపత్రి లో అడ్మిట్ చేయాలని అంటున్నారు వైద్యులు. 
అలానే పెద్దలు టీకా వేసుకుంటే పిల్లలకు వైరస్ సోకే అవకాశం చాలా మటుకు తగ్గుతుందని కూడా తెలుస్తోంది.
 
 అలాగే పిల్లల పై థర్డ్ వేవ్ ప్రభావానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేనందున తల్లిదండ్రుల ఆందోళన పడొద్దని ఇండియన్ పిడియాట్రిక్స్ అసోసియేషన్ చెప్పింది. థర్డ్ లైవ్ లో పిల్లల పై తీవ్ర ప్రభావం చూపుతున్నందున హెచ్చరికల నేపథ్యం లో దేశ వ్యాప్తంగా ఆసుపత్రులు పిల్లల సంరక్షణ కోసం సౌకర్యాలు పెంచడం ప్రారంభించారు. అదే విధంగా ఐదేళ్ల లోపు పిల్లల తల్లులకు సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధం అయినట్టు తెలుస్తోంది.
 
కరోనా థర్డ్ వేవ్ పై  AIIMS డైరెక్టర్ చెప్పిన విషయాలు:
 
AIIMS డైరెక్టర్  కరోనా కి సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. వాటి కోసం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరోనా మూడవ దశ లో ఎక్కువగా పిల్లల పై ప్రభావం పడుతుందని హెచ్చరికలు జారీ చేయడం తో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.
 
ఇప్పటికే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ వల్ల చాలా వరకూ సతమతం అయ్యాం. అయితే ఇప్పుడు మూడవ దశ లో పిల్లల పై ప్రభావం చూపుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ లో కరోనా  వైరస్ బారిన పడిన పిల్లల లో కేవలం స్వల్పంగా మాత్రమే ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. అయితే రాబోయే రోజుల లో కరోనా వలన మరింత ఇబ్బందులు వస్తాయని.. ముఖ్యంగా పిల్లల పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అని  వెల్లడించారు.
 
ఏది ఏమైనా పిల్లలకి వ్యాక్సిన్ వేయడం అలానే ఆసుపత్రి యొక్క సౌకర్యాలు పెంచడం లాంటివి చేస్తూ ఉండాలి. లేదంటే ఎందరో మంది పిల్లలు అయ్యే అవకాశం ఉంది. కనుక  తగినన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి ఆరోగ్యకరమైన అలవాట్లని  అలవాటు చేసుకోవాలి. మంచి జీవన విధానాన్ని పాటించడం వల్ల వైరస్ వలన ఎక్కువ సమస్యలు రాకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. దానితో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఇబ్బందులు రావు.