BREAKING NEWS

రెండేళ్ల దాటిన పిల్లలకి సెప్టెంబర్ నుండి వ్యాక్సిన్: AIIMS

కరోనా మహమ్మారి కారణంగా మనలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అనేక మంది అనారోగ్య సమస్యల తో సతమతమవుతున్నారు. ఈ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండటం అస్సలు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. 
 
కనుక అనవసరంగా బయటికి వెళ్లకుండా ఉండటం.. బయటికి వెళితే మాస్కులు ధరించడం.. శానిటైజర్ ని ఉపయోగించడం.. సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
 
ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మహమ్మారి బారిన పడకుండా ఉండొచ్చు. భారత దేశంలో కరోనా కేసులు మూడు కోట్ల మార్కును దాటాయి. గత సంవత్సరం జనవరి 30 న మన దేశంలో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. అన్ని దేశాలని చుట్టేసి ఎందరో మందిని ఇబ్బంది పెట్టింది.
 
ఇప్పుడు సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతోంది. కానీ నిన్న కేసుల తో పోలిస్తే మరో సరి కరోనా కేసులు పెరిగాయి. ఇక వాటి వివరాలని చూస్తే.. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. తాజాగా 19,01,056 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 50, 848 కొత్త కేసులు నమోదయినట్లు తెలుస్తోంది.
 
అయితే క్రితం రోజు తో పోల్చుకుంటే కరోనా కేసుల లో 19 శాతం పెరుగుదల కనబడిందని చెప్పింది. ఏదేమైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని నిపుణులు చెప్పడం జరిగింది.
 
అమెరికా తర్వాత ఇన్ని ఎక్కువ కేసులు నమోదు అవ్వడం భారతదేశంలోని చోటు చేసుకుంది ఇప్పటికే 2.9 కోట్ల మందికి వైరస్ వచ్చి.. ఆరోగ్యం సర్దుకుని ఇంటికి వెళ్లారు.
 
ఇక మూడవ వేవ్ గురించి చూసుకున్నట్లయితే... మూడవ వేవ్ రానున్నట్టు అది పిల్లల పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎక్కువగా ఉందని ఎప్పటి నుండో నిపుణులు చెప్పడం జరిగింది. రెండేళ్ళకు పైగా పిల్లల్లో సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ వేస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దాని కోసం కూడా మీరు ఒక లుక్ వేసేయండి.
 
ఇప్పటికె 18 ఏళ్లు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. సెప్టెంబర్ నాటికి రెండు ఏళ్ళు పై బడిన పిల్లలకు వ్యాక్సిన్ ని అందిస్తామని ఢిల్లీ AIIMS డైరెక్టర్ డాక్టర్ రణదీప్ అన్నారు. ఫేస్ 2/3 ట్రైల్స్ పూర్తి అయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిం డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని అన్నారు.
 
ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ నెలలోనే టీకాకు ఆమోదం కూడా లభిస్తుందని చెప్పారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ ప్రభుత్వ టాస్క్ఫోర్స్ కీలక సభ్యుడు లో ఒకరు ఈ విషయాలని తెలిపారు. మన భారత దేశం లో ఫైజర్ బయో ఎంటెక్ వాక్సిన్ కి అనుమతి కనుక వస్తే అది పిల్లలకు కూడా వేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఈ ట్రైల్స్ కోసం ఢిల్లీ AIIMS ఇప్పటికే పిల్లల్ని పరీక్షించడం ప్రారంభించిందని కూడా ఆయన చెప్పారు
 
ఇప్పటికె కేవలం పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఎన్నో సమస్యలు పిల్లలకి కూడా వచ్చాయి. కనుక పిల్లలకి కూడా వ్యాక్సిన్ వేయడం చాలా ముఖ్యం ఇది ఇలా ఉంటే ఢిల్లీ AIIMS ఇప్పటికే పిల్లల్ని పరీక్షించడం ప్రారంభించిందని..  జూన్ 7న ఇది ప్రారంభం అయ్యింది అని తెలిపారు.
 
దీనిలో రెండేళ్ల నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు పిల్లలే ఉన్నారు. మే 12న 22 ఏళ్ల వయసు లోపు పిల్లల పై ఫేస్ టు, ఫేస్ త్రీ పరీక్షలు నిర్వహించడానికి భారత్ బయోటెక్ అనుమతి ఇచ్చింది అన్నారు.
 
ఇన్స్టిట్యూట్లు సూపర్ స్పైడర్ గా మారకుండా నిరోధించే విధంగా ఇప్పుడు పాఠశాలలు తెరిచే దిశగా యోచన చేయాలని అన్నారు. అయితే సర్వేల ప్రకారం పిల్లలు యాంటీ బాడీలు ఉత్పత్తుల కోసం సర్వేలు సూచించారని డాక్టర్ చెప్పారు.
 
ఎక్కువ మంది పిల్లలు కూడా కరోనా మహమ్మారి కి గురవుతున్నారని అందుకే పిల్లల్లో ట్రయల్స్  నిర్వహిస్తే వారి లోను యాంటీ బాడీస్  ఉత్పత్తి అవుతాయని అన్నారు.
 
వాళ్లకి కనక టీకాలు వేయక పోయినా న్యాచురల్ ఇమ్మ్యూనిటి పొందే అవకాశం ఉందని తెలియజేశారు. ఇదిలా ఉంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన అధ్యయనం ప్రకారం పిల్లల్లో కరోనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఒకవేళ కనుక ఈ మూడవ వేవ్ వస్తే.. ఇతరుల కంటే కూడా పిల్లల పై ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
 
ఏది ఏమైనా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే గుర్తించి వైద్యుల్ని సంప్రదించాలి. మీ పిల్లలకి ఏదైనా అనారోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని మీరు అయితే తప్పకుండా మంచి వైద్యుడి సలహా తీసుకోండి.
 
ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారి నుండి కోలుకోవడానికి వీలవుతుంది. పిల్లలకి కూడా మాస్కు వేయడం, బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచడం, మంచి పోషకాహారం ఇవ్వడం, యోగా వ్యాయామం వంటివి చేయించడం వంటి మంచి వాటిని అనుసరించాలి.