BREAKING NEWS

రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆయుర్వేద మూలికలు..!

ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నా ఈ ఆయుర్వేద మూలికలు బాగా ఉపయోగ పడతాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి అన్నింటి కంటే ముఖ్యమైనది ఆరోగ్యం. మనం ఆరోగ్యం తో  ఉంటేనే ఏదైనా చేయడానికి వీలవుతుంది.
 
మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ ఆయుర్వేద మూలికలు ఎంతో బాగా సహాయం చేస్తాయి. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యల తో బాధ పడ్డారు. ఇప్పుడిప్పుడే కరోనా నుండి బయట పడుతున్నాము.
 
ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేని జీవన విధానాన్ని కొనసాగించడం లాంటివి చేస్తూ ముందుకు వెళ్లాలి. అయితే ఆయుర్వేద మూలికలు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. 
 
కనుక వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ ఆయుర్వేద మూలికల గురించి చూసేయండి.
 
 ఉసిరి:
 
ఉసిరి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరిలో మంచి పోషక పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్ సి, అమైనో ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటి మైక్రోబియల్ గుణాలు కూడా ఉసిరి లో ఉంటాయి. యాంటీ డయాబెటిక్ గుణాలు గ్యాస్ట్రో ప్రొటెక్ట్ గుణాలు ఉసిరిలో మనకు దొరుకుతాయి.
 
రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉసిరి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. పచ్చి ఉసిరికాయలు తినొచ్చు లేదా పచ్చడి తినొచ్చు. అలానే ఆయుర్వేద షాపుల్లో అయితే ఉసిరి పొడి దొరుకుతుంది. ఉసిరి జ్యూస్ కూడా దొరుకుతుంది. ఇలా ఏ రూపంలో తీసుకున్నా చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. సమస్యల నుండి దూరంగా ఉండచ్చు.
 
తులసి:
 
మనం తులసి మొక్కని కొలుస్తాం. ఇది కేవలం పూజకి మాత్రమే పనికొస్తుంది అనుకుంటే పొరపాటు. దీని వలన ఎన్నో లభ్లు మనం పొందొచ్చు. తులసి లో మంచి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా రకాల ఆయుర్వేద మందుల్లో తులసిని బాగా ఉపయోగిస్తారు. 
 
ఏంగ్జైటీ, ఒత్తిడి, నీరసం వంటి సమస్యలని తొలగించడానికి తులసి బాగా ఉపయోగ పడుతుంది. అదే విధంగా  ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు, ఫ్లూ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. కొద్దిగా తులసి ఆకులు తీసుకుని నీళ్లలో మరిగించి ఆ జ్యూస్ ని రెగ్యులర్ గా తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది ఇంత మంచి గుణాలు ఉన్న తులసిని రెగ్యులర్ గా తీసుకొని ఈ సమస్యల నుంచి దూరంగా ఉండండి.
 
అశ్వగంధ:
 
అశ్వగంధ నొప్పి, ఇన్ఫ్లమేషన్ ని తొలగించడానికి బాగా ఉపయోగ పడుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా అశ్వగంధ ఎంతో మేలు చేస్తోంది. నిద్రలేమి సమస్యకు అశ్వగంధ తో పరిష్కారం చూపించు కోవచ్చు. అశ్వగంధ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అశ్వగంధ పొడి, టాబ్లెట్స్ మనకి దొరుకుతాయి. అశ్వగంధని ఉపయోగించి కూడా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం పొందొచ్చు. దీనితో ఆరోగ్యంగా ఉండచ్చు. సమస్యలు కూడా మాయం అయి పోతాయి.
 
గుడూచి:

 
గుడూచి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి బాగా ఉపయోగ పడుతుంది. అదే విధంగా అనారోగ్య సమస్యలు తరిమికొట్టి, రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది. ఒంట్లో తెల్ల రక్త కణాలుని కూడా ఇది ఆక్టివేట్ చేస్తుంది. బ్రాంకైటిస్, దగ్గు వంటి సమస్యలు కూడా ఇది దూరం చేస్తుంది. 
 
ఇలా గుడూచి తో కూడా ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించుకో వచ్చు. ఆస్తమా బారిన పడకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. అంతే కాదండి అజీర్తి సమస్యలని కూడా గుడూచి పోగొడుతుంది. గుడూచి పొడి లేదా టాబ్లెట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు ఉండకుండా జాగ్రత్త పడొచ్చు.
 
చూసారా ఆయుర్వేద మూలికలు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఎన్నో రకాల సమస్యలను చిటికె లో దూరం చేసుకోవడానికి ఇవి ఎంతో బాగా సహాయ పడతాయి. పైగా ఇవి మనకి ఎక్కువగా అందుబాటులోనే ఉంటాయి. కొన్ని అయితే మన ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుని మీకు ఉండే సమస్యలని సులువుగా దూరం చేసుకోండి.
 
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ని అనుసరించటం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్నది అయి పోతుంది. అలానే మీరు ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. అదే విధంగా అనారోగ్య సమస్యలకు కూడా ఈ మూలికల తో చెక్ పెట్టొచ్చు. మరి ఈ ఆయుర్వేద మూలికలుని రెగ్యులర్ గా తీసుకుని మీ సమస్యలకు చెక్ పెట్టేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.