BREAKING NEWS

అందమైన కురులు మీ సొంతం చేసుకోవాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి...!

ఈ విధంగా మీరు చేస్తే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మామూలుగా మనకు మార్కెట్లో దొరికే కెమికల్స్ కంటే కూడా ఈ నూనెలు బాగా పని చేస్తాయి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ సమ్మర్ లో చాలా మంచివి. అలానే బాదం ఆయిల్, ఆవాల నూనె వంటివి వింటర్ లో బాగుంటాయి. నువ్వుల నూనె అయితే అన్నిసీజన్స్ లో కూడా బాగుంటుంది.
 
అయితే ఈజీగా ఇంట్లో వీటిని తయారు చేసుకుని మీరు మీ జుట్టుకు పట్టించడం వల్ల మీ జుట్టు సాఫ్ట్ గా షైనీ గా కూడా ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి.  
 
కరివేపాకు మరియు కొబ్బరి నూనె:
 
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా కొబ్బరి నూనె కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ జుట్టును బలంగా ఉంచుతుంది. విటమిన్ బి కూడా ఇందులో ఉంటుంది మంచి సువాసన తో కూడా ఈ నూనె ఉంటుంది. దీని కోసం మీరు ఏం చేయాలంటే..? ముందుగా మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు తీసుకుని ఒక పాన్ లో మరిగించండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చి ఒక సీసాలో వేయండి. మీరు ఎప్పుడైతే హెయిర్ కి అప్లై చేసుకుంటారో అప్పుడు మరి కొంచెం వేడి చేసుకుని రాసుకోండి.  ఇలా వాడడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 
ఉసిరి నూనె:
 
 దీనిని మహిళలు పురుషులు కూడా ఉపయోగించ వచ్చు. ఇది జుట్టు ని ఒత్తుగా పెంచుతుంది మరియు జుట్టు తెల్లబడకుండా ఉంచుతుంది. దీని కోసం మీరు ఉసిరి కాయల్ని ముక్కల కింద చేసి ఎండలో ఎండ పెట్టాలి. ఆ తర్వాత దానిలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె వేసి ఎండ బెట్టిన ఉసిరిని కూడా వేసేయాలి. దీనిని బాగా ఇది మరిగించిన తర్వాత దీనిని కూడా ఒక బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. దీని వల్ల కూడా మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఇలా ఈజీగా అందమైన కురులు మీ సొంతం చేసుకోవచ్చు. 
 
మందార నూనె:
 
 మందారం లో విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇది హెయిర్ వాల్యూంని పెంచుతుంది మరియు హెయిర్ సిల్కీగా షైనింగ్ గా ఉండేటట్టు కూడా చూస్తుంది. దీని కోసం మీరు కొద్దిగా మందార ఆకుల్ని కొద్దిగా మందార పువ్వులు తీసుకుని వాటిని కడిగేసి ఎండబెట్టాలి. ఒక పాన్లో కొబ్బరి నూనె, కొద్దిగా బాదం నూనె వేసి దానిలో మందార ఆకులు పువ్వులు వేసి మరిగించాలి. బాగా మరిగిన తరువాత దీనిని చల్లార్చి ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇది కూడా మీకు చక్కని ఫలితాలను ఇస్తుంది.
 
 అలోవెరా నూనె:
 
అలోవెరా వల్ల మనం ఎన్నో రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. అలాగే ఎంతో మేలు చేస్తుంది. జుట్టుకి కూడా అలోవెరా మంచిది. దీని కోసం మీరు అలోవెరాని తీసుకుని కట్ చేసి దానిలో ఉన్న జెల్ ని బయటికి తీసేయాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసి మరిగించి దాంట్లో ఈ అలోవెరా జెల్ ని కూడా వేసి బాగా మరిగించాలి. మంచి సువాసన కోసం కొద్దిగా రోజ్మేరీ కూడా వేసుకో వచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసా లో వేసుకుని స్టోర్ చేసుకుని మీకు అవసరం అయినప్పుడు రాసుకో వచ్చు. 
 
అలోవెరా లో మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు ఊడిపోవడానికి తగ్గిస్తుంది. అదే విధంగా చుండ్రు తగ్గి పోతుంది మరియు తలా పొడిబారి పోకుండా అలోవెరా కంట్రోల్లో ఉంచుతుంది ఇలా ఈ విధంగా మీరు అలోవేరా తో ఈజీగా ఆయిల్ ని కూడా చేసి స్టోర్ చేసుకో వచ్చు. దీని వలన కూడా మీరు చాల లాభాల్ని పొందవచ్చు.
 
ఉల్లిపాయ నూనె:

 
ఉల్లి వల్ల కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఉల్లి లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అదే విధంగా ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా మీకు ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి.
 
దీని కోసం ఒక ఉల్లిపాయని కట్ చేసి కొబ్బరి నూనె లో వేసి అందులో రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మరిగించాలి. బాగా వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్టోర్స్ చేసుకోడానికి ఒక గాజు సీసా లో తీసుకోవాలి అంతే ఇలా ఈ విధంగా మీరు ఆయిల్ ని తయారు చేసుకుని ఇంట్లోనే జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు తద్వారా మీకు అనేక బెనిఫిట్స్ కలుగుతాయి. మీ జుట్టు కూడా ఎంతో ఆరోగ్యంగా అందంగా ఉంటుంది.