BREAKING NEWS

పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయుష్ మినిస్ట్రీ జారీ చేసిన కొత్త గైడ్లైన్స్...!

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్  చాలా మందిని తీవ్రంగా ఇబ్బందులు లోకి నెట్టేసింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.
 
24 గంటల్లో కొత్తగా 70,421 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 24 గంటల్లో 3,921 మంది కరోనా తో మృతి చెందారు. ఏది ఏమైనా ఇంకా జాగ్రత్త పడాలి. మాస్కులు ధరించడం, హైజీన్ పద్ధతులని  పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి.
 
అయితే మొదటి మరియు రెండవ వేవ్స్ మాట పక్కన పెడితే.. మూడవ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్నో రకాల పరిశోధనలు శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ పరిశోధన లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శాస్త్రవేత్తల టీం కోవిడ్ సెన్సార్ ని అభివృద్ధి చేసింది.
 
ఇది ఒక గది లో ఎవరైనా 15 నిమిషాల వ్యవధి లో కరోనా వైరస్ బారిన పడ్డార లేదా అనే విషయాన్ని గుర్తిస్తుంది. నిజంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. పబ్లిక్ ప్లేసులు, స్కూల్స్ మొదలైన చోట్ల ఇది బాగా ఉపయోగ పడుతుంది. అయితే మొదట ఈ పరికరాన్ని లండన్ లోని ఒక యూనివర్సిటీ లో ఉంచి పరిశీలించారు.
 
కరోనా సోకిన వ్యక్తులు వద్ద ఉండే వాటిని ఈ పరికరంతో పరీక్షించారు. 98 శాతం నుండి వంద శాతం వైరస్ ని ఇది గుర్తించి గలుగుతోంది. పరిశోధకులు ఇప్పటికే 54 మందిపై దీనిని పరీక్షించగా అందులో 24 మందికి కోవిడ్ సోకినట్లు తేల్చింది.
 
అయితే ఇవన్నీ ఇలా ఉంటే తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల పట్ల జాగ్రత్త పడాలి లేదు అంటే పిల్లలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. మూడవ వేవ్ కారణంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం పడుతుందని మనకి తెలుసు. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయుష్ మినిస్టరీ కొన్ని గైడ్లైన్స్ ని జారీచేసింది. మరి వాటి కోసం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
 
కరోనా  పిల్లల్లో ఎక్కువ ప్రభావం వచ్చే అవకాశం ఉంది. అందుకని తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని అజాగ్రత్తగా ఉండడం అస్సలు మంచిది కాదు. పిల్లలకి మాస్క్ వేయటం, పదే పదే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, హైజీన్ పద్ధతుల్ని పాటించడం, మంచి జీవన విధానాన్ని అనుసరించడం, డైట్ సరిగ్గా తీసుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించే మార్గాలు పాటించడం లాంటివి చేయాలి అని చెప్పింది.
 
అయితే పెద్దల తో పోల్చుకుంటే పిల్లల్లో వైరస్ తక్కువగా ఉంటుందని దీని యొక్క ప్రభావం పెద్దల కంటే కాస్త తక్కువే అని అంది ఆయుష్ మినిస్టరీ. ఈ మహమ్మారి నుండి పిల్లలు సురక్షితంగా ఉండడానికి 58 పేజీల డాక్యుమెంట్ ని కూడా మినిస్టరీ విడుదల చేయడం జరిగింది.
 
మరి వాటి కోసం కూడా ఇప్పుడు మనం చూద్దాం.. ఆయుర్వేద ఔషధాలతో కరోనా రిస్కు తగ్గుతోందని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆయుర్వేద ఔషధాలు బాగా ఉపయోగ పడతాయి అని చెప్పింది. పిల్లల్లో కనుక ఒబిసిటీ, టైప్ 1 డయాబెటిస్, క్రానిక్ డిసీజ్ వంటి సమస్యలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పింది.
 
ఒకవేళ కనుక పిల్లలుకి ఎక్కువగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మంచి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. మూడు లేయర్లు ఉండే కాటన్ మాస్క్ ని ప్రిఫర్ చేయడం మంచిది అదే విధంగా పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉంచడం మంచిది.
 
పిల్లలకి కనుక ఐదు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉన్నా, ఎక్కువగా నీరసంగా ఉన్నా, ఆకలి లేక పోయినా, తినకుండా ఉంటున్నా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా, రెస్పిరేటరీ రేటు పెరిగినా తప్పని సరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయమని సూచించింది.
 
మంచి ఆరోగ్యకరమైన పద్ధతుల్ని వాళ్లలో అలవాటు చేయడం మంచిదని.. రోజు గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోమని, హైజిన్ గా ఉండమని సూచించింది. అదే విధంగా ప్రతి రోజూ ఉదయం రాత్రి కూడా దంతాలను తోముకోవడం, ఆయిల్ పుల్లింగ్ లేదా గార్గిలింగ్ వంటి పద్ధతులు పాటించడం మంచిది అని చెప్పింది.
 
బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని కూడా ఫాలో అవడం మంచిది. ప్రాణాయామ, మెడిటేషన్ లాంటి ఆరోగ్యకరమైన సూత్రాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా పిల్లలు ఉండొచ్చు అని చెప్పింది.
 
ఇంటి చిట్కాల తో సులువుగా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని అని అంది. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం లాంటివి చేయాలి. 
 
ఇలా ఈ మహమ్మారి సమయం లో పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే సురక్షితంగా ఉంటారని ఆరోగ్యకరంగా ఉంటారు అని ఆయుష్ మినిస్టరీ చెప్పింది.