ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. బీహార్, హర్యానాలో నిరసనలు మరీ హింసాత్మకంగా మారాయి. రైలు, రోడ్డు మార్గాలను ఆందోళనకారులు ఎక్కడికక్కడ బ్లాక్ చేశాయి. బస్సు అద్దాలను సైతం ధ్వంసం చేశాయి. రైల్వే ట్రాక్‌లపై పడుకుని నిరసనలు తెలపడం…
కొన్ని చోట్ల రైల్వే స్టేషన్లలో సామగ్రికు నిప్పు పెట్టడం.. పోలీసులపై రాళ్లు రువ్వడం.. పలు ఘటనలు చోటు చేసుకున్నాయి.
హర్యానాలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బుధవారం బీహార్‌లో మొదలైన ఈ నిరసన సెగ మెల్లగా దేశమంతటా వ్యాపించింది.
దీనికి దారి తీసిన కారణాలేంటో చూద్దాం:
అగ్నిపథ్ చిచ్చు రాజేసుకుందిలా…
సైన్యంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకేళ్ళు నిరీక్షిస్తుంటారు. ఉద్యోగం లభిస్తే చాలు.. 15-20 ఏళ్ల పాటు దేశ రక్షణ విధుల్లో భాగస్వామి కావాలనుకుంటారు. జీతం కూడా బాగానే ఉంటుంది. రిటైరయ్యాక పింఛన్‌తోపాటు గ్రాట్యుటీ కూడా లభిస్తుంది. అయితే, రక్షణ బడ్జెట్లో సైన్యం జీతాలు, పింఛన్లకే ఎక్కువగా కేటాయించాల్సి వస్తోందనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకం కింద ఏటా 45 వేలమంది సైనికులను విడిగా నియమించుకుంటారు. నాలుగేళ్ల తర్వాత వారిలో మూడొంతుల మందిని ఇంటికి పంపించేస్తారు. వీరికి పింఛన్, గ్రాట్యుటీని చెల్లించరు. ఇదికాక అగ్నివీరులకు మాత్రమే పర్మినెంట్ కమిషన్ ద్వారా మరో పదిహేనేళ్లు నాన్- ఆఫీసర్ హోదాలో సైన్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. నెలకు రూ. 30 వేల జీతంతో మొదలై, నాలుగో ఏడాదికల్లా రూ. 40 వేలు అవుతుంది.
ఈ జీతంలోనూ మూడోవంతు కార్పస్ ఫండ్ కింద జమచేస్తారు. నాలుగేళ్లకు ఆ కార్పస్ ఫండ్ రూ. 5 లక్షలు అవుతుంది. ప్రభుత్వమూ దీనికి సమాన మొత్తాన్ని కలిపి వడ్డీతో సహా రూ. 11- 12 లక్షలు రిటైర్మెంట్ సమయంలో ఇస్తుంది.
ఈ మాత్రం దానికేనా తాము ఏళ్ల తరబడి సన్నద్ధమవుతోదని నిరుద్యోగుల్లో ఆందోళన పెరిగింది. నాలుగేళ్ల తర్వాత తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు వాపోతున్నారు.
బీహార్ లో…
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో వరుసగా రెండో రోజూ ఆందోళనలు జరిగాయి. పలు రైల్వే స్టేషన్లలో ఆందోళనలు, తర్వాత విధ్వంసం చోటు చేసుకుంది. 34 ట్రైన్లను పూర్తిగా, 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసి, 72 రైళ్లను ఆలస్యంగా నడిపించారు. ఐదు రైళ్లను మధ్యలోనే స్టేషన్లలో ఆపేశారు. ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ అని రాసి ఉన్న బ్యానర్ పట్టుకున్న యువకులు.. కొత్త రిక్రూట్మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవాడాలో బీజేపీ ఎమ్మెల్యే అరుణా దేవి.. కోర్టుకు వెళ్తుండగా నిరసనకారులు అడ్డుకున్నారు. ఆమె వెళ్తున్న కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. నవాడాలోని బీజేపీ ఆఫీసు ధ్వంసమైంది. నవాడాలో కొందరు యువకులు రోడ్లపై టైర్లు అంటించారు. స్థానిక రైల్వే స్టేషన్‌ను బ్లాక్ చేశారు.
రైల్వే ప్రాపర్టీని ధ్వంసం చేయడం వీడియోల్లో రికార్డు అయ్యింది. కొందరు ట్రాక్‌లపై పుషప్స్ తీస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అర్రా రైల్వే స్టేషన్లో రాళ్లు రువ్విన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
జెహనాబాద్‌లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన స్టూడెంట్లను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. స్టూడెంట్లు, పోలీసులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకుంటున్న వీడియోలు వైరల్ అయ్యాయి. సహర్సాలోనూ పోలీసులపై స్టూడెంట్లు రాళ్లు రువ్వారు. చప్రాలో పెద్దపెద్ద కర్రలను చేతబట్టుకుని ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. బుధవారం ముజఫర్‌పూర్, బక్సర్ జిల్లాల్లోనూ నిరసనలు వెలువెత్తాయి.
హర్యానాలో…
హర్యానాలోని పల్వాల్ జిల్లాలో ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. పోలీసులపై కొందరు దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో మూకను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులను 24 గంటలపాటు నిలిపేశారు. గురుగ్రామ్, రేవారి జిల్లాల్లోనూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. గురుగ్రామ్‌లోని బిలాస్పూర్, సిధ్రావలీలో బస్స్టాండ్లు, రోడ్లను బ్లాక్ చేశారు. దీంతో గురుగ్రామ్– జైపూర్ హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యమిస్తాం: బీజేపీ సీఎంలు!
అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్లు అగ్నివీర్లుగా పనిచేసి రిటైర్ అయిన వారికి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామని పలు బీజేపీ రాష్ట్రాల సీఎంలు తెలిపారు. అగ్నిపథ్ స్కీమ్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం అనధికారికంగా ఓ క్లారిటీ ఇచ్చింది. ‘అపోహలు – నిజాలు’ పేరుతో ఒక డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది.
సందేహం- స్పష్టత…
■ నాలుగేండ్లు మాత్రమే జాబ్ ఉంటుందంటున్నారు. ఇది చాలా తక్కువ. భవిష్యత్తుకు భరోసా ఉండదు..?
నాలుగేండ్ల తర్వాత పారిశ్రామికవేత్తలు కావాలనుకునేవారికి ఆర్థిక ప్యాకేజీ అందిస్తాం. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది. పై చదువులకు వెళ్లాలనుకునేవారికి 12వ తరగతికి సమానమైన సర్టిఫికెట్‌ను అందజేస్తారు. తదుపరి చదువుల కోసం బ్రిడ్జి కోర్సు కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేయాలనుకునే వారికి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), రాష్ట్ర పోలీసు విభాగాల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఇతర రంగాల్లోనూ వీరికి అవకాశాలు ఉంటాయి.
■ సాయుధ దళాల్లో పని చేయాలనుకునేవారికి అవకాశాలు తగ్గుతాయి..?
అలా అని ఏం కాదు. ఇంకా పెరుగుతాయి. ఇప్పటితో పోలిస్తే రాబోయే ఏళ్లలో అగ్నివీర్ల రిక్రూట్మెంట్ 3 రెట్లు పెరుగుతుంది.
■ రెజిమెంటల్ బాండింగ్‌పై ప్రభావం పడుతుంది..?
రెజిమెంటల్ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు జరగబోవు. అగ్నివీర్లో ఉత్తమమైన వారిని ఎంపిక చేయడం వల్ల ఇది మరింత బలోపేతం అవుతుంది. యూనిట్ మరింత క్వాలిటీగా ఉంటుంది.
■ సాయుధ దళాల సమర్థత దెబ్బతింటుంది..?
ఇదొక అపోహ మాత్రమే. తొలి ఏడాది రిక్రూట్ చేసే అగ్నివీర్ల సంఖ్య.. సాయుధ దళాల్లోని మొత్తం ఫోర్స్‌తో పోలిస్తే 3 శాతమే. అగ్నివీర్లను ఆర్మీలోకి చేర్చుకోవడానికి ముందు.. వారి పనితీరును పరీక్షిస్తారు. దీంతో అప్పటికే పరీక్షించిన లేదా పని చేసిన సిబ్బంది ఆర్మీకి దొరుకుతారు. ఇలాంటి షార్ట్‌టర్మ్ సిస్టమ్ చాలా దేశాల్లో ఇప్పటికే కొనసాగుతుంది.
■ ఉద్యోగంలో భాగంగా ఆయుధ శిక్షణ పొందిన 21 ఏళ్ల యువకులకు తర్వాత ఉద్యోగం లేకపోతే తీవ్రవాద బృందాలు లేదా దేశ వ్యతిరేక శక్తులతో కలిసే ప్రమాదం ఉంది..?
ఇది భారత సాయుధ దళాల నైతికత, విలువలను అవమానించడమే. సైన్యం యూనిఫామ్ వేసుకున్న సైనికులు.. తమ జీవితం మొత్తం దేశం కోసం నిబద్ధతతో పాటుపడతారు. ఇప్పటిదాకా వేల మంది రిటైర్ అయ్యారు. కానీ దేశ వ్యతిరేక శక్తులతో కలిసిన ఒక్క ఘటన కూడా ఇప్పటివరకు జరగలేదు.
తెలంగాణలో…
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సిల్ ఇతర సామాన్లు వేసి నిరసన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
స్టేషన్లో ఆగిఉన్న రైళ్ల అద్దాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లదాడి చేశారు.
పార్సిల్ సామానుకు, హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే రైలుకు, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైల్వే స్టేషన్లో నార్త్, ఈస్ట్, వెస్ట్ జోన్ పోలీసులు భారీగా మోహరించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రకటన చేయాలన్నదే వారి ఏకైక డిమాండ్ గా తెలుస్తుంది.