రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించడం అనేది అసామాన్యమైన విషయం. అలాంటిది మొదటిసారి ఓ గిరిజన మహిళ అధిరోహించడం ఖాయమనే మాట గట్టిగానే వినిపిస్తుంది. తాజాగా జరిగిన భేటీలో.. కేంద్రంలో ఉన్న పాలక ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది ముర్ము(64) ఎంపికైనట్లు స్పష్టమైంది. ఈ సందర్భంగా ఆమె జీవిత, రాజకీయ విశేషాల గురుంచి ఈరోజు తెలుసుకుందాం:
నిన్న అనగా (మంగళవారం) జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో భాగంగా… దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన భేటీలో, 20 మంది పేర్లపై విస్తృత చర్చ జరిగింది. ఆఖరికి ఆదివాసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ నడ్డా విలేకరులకు ఈ సందర్భంగా వెల్లడించారు. వెస్ట్ ఇండియా నుంచి ఇప్పటివరకూ ఏ ఒక్కరూ రాష్ట్రపతి కాలేదు. అది కూడా ఆదివాసీకి అవకాశం లభించడం, అందులోనూ మహిళకు అవకాశమివ్వాలని బోర్డు సభ్యులు సూచించడం విశేషం!
ఎట్టకేలకు జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్(2015- 2021)గా, ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి(2000- 04)గా పనిచేసిన ఈమె(ద్రౌపది ముర్ము)ను నిలబెట్టాల్సిందిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై 18న జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆమె ఒడిశా నుంచి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి కూడా ఈమె అవుతారు. అలాగే స్వాతంత్ర్యానంతరం జన్మించిన వ్యక్తి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ఇదే తొలిసారి అవుతుంది.
ద్రౌపది ముర్ము. అత్యంత సౌమ్యురాలు. మృదుభాషి అయిన ఆదివాసీ బిడ్డ. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థి దాకా ఆమె ప్రస్థానం సాగిన తీరు ఎంతో ఆసక్తికరం. ఆమె అరంగేట్రం ఎందరికో ఆదర్శనీయం!
జననం- చదువు…
దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మారుమూల గ్రామమైన బైడపోసిలో గిరిజన సంతాల్ తెగలో 1958 జూన్ 20వ తేదీన ద్రౌపది ముర్ము జన్మించింది. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు, నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అనేక ఇబ్బందులకు ఓర్చి ముర్ము భువనేశ్వర్‌లోని రమాదేవి వుమెన్స్ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసింది.
విద్య అనంతరం రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసింది. ముర్ము రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా కొంతకాలం పనిచేసింది.
రాజకీయ ప్రస్థానం…
1997లో రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవ్వడంతో ముర్ము రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి ఆమె 2000లో ఒడిశాలోని బీజేడి– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండగానే మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్య్స, పశుసంవర్థక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
◆ అంతకుముందు ఒడిశా బీజేపి గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, ఆపై అధ్యక్షురాలిగానూ పని చేశారు.
◆ 2010, 2013ల్లో మయూర్భంజ్(పశ్చిమ) జిల్లా బీజేపీ విభాగం నుంచి ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగానూ చేశారు.
◆ 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన రాష్ట్రానికే తొలి మహిళా గవర్నర్ ఈమె.
◆ ద్రౌపది, శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులిద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో శూన్యం చేరుకుంది. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేయాలని సంకల్పించింది.
◆ అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న రెండో మహిళ ద్రౌపది ముర్ము. ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగా కూడా రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి, అంటే స్వాంతంత్య్రం రాకముందు పుట్టినవారే ఉన్నారు.
◆ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం, విపక్షాలు కూడా మంగళవారమే తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హాను ప్రకటించింది.
ద్రౌపది అభ్యర్థిత్వం వెనుక…
ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆ పార్టీకి జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు లభించే అవకాశం ఉంది. వివాద రహితురాలిగా, సమాజ సేవకురాలిగా పేరున్న ద్రౌపదికి.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు దక్కాయి.
ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీకి ఆదివాసీల ఓట్ల వాటా పెరగడమే కాకుండా.. ఒడిశాలో పార్టీకి మద్దతు పెరుగుతుందని ఆ పార్టీ సీనియర్ల అభిప్రాయం.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా ద్రౌపది ముర్ముకు స్నేహపూర్వక అనుబంధం ఉంది. కావున ఆమెకే ఒడిశా సీఎం మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఆమె మాటల్లో…
తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలియగానే, చాలా సంతోషించినట్లు తెలిపారు ద్రౌపది. ఈ సందర్భంగా 'సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్' నినాదంతో ముందుకెళ్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పార్టీల నేతలను కలసి మద్దతు కోరతానని అన్నారు. గవర్నర్ గా విధులు నిర్వహించిన తనకు రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిని నిర్వహించడం ఇబ్బంది కాదని తెలిపింది.
నేడు తన స్వస్థలం ఒడిశాలోని రాయ్ రంగాపూర్ శివాలయాన్ని సందర్శించిన ఆమె.. దర్శనానికి ముందు చీపురుతో ఆలయాన్నంతా శుభ్రపరిచింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, స్వామి ఆశీస్సులు తీసుకుంది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జడ్ ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
ప్రముఖుల అభిప్రాయాలు…
గొప్ప రాష్ట్రపతి అవుతారు: మోదీ
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందిస్తూ… దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరంగా అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంద’ని ప్రధాని ట్విట్టర్లో వెల్లడించారు.
20 పేర్లు పరిశీలించాం: నడ్డా
రాష్ట్రపతి అభ్యర్థిగా పార్లమెంటరీ బోర్డు భేటీలో దాదాపు 20 పేర్ల దాకా చర్చకు వచ్చినట్టు నడ్డా తెలిపారు. ‘‘అయితే ఈసారి తూర్పు భారత్ నుంచి గిరిజన నేతను, అది కూడా మహిళను అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.
వెంకయ్య అసంతృప్తి!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరును ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తుందని చాలామంది ఊహించారు. కానీ మంగళవారం కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలు వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి కలిశారు. ఐదేండ్లుగా ఉపరాష్ట్రపతిగా సేవలందించినందుకుగానూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అయితే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదని మాత్రం వెంకయ్య అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
◆ ముర్ము త్వరలోనే నామినేషన్ వేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల(జూన్) 29 కాగా, 2017లో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసిన బీజేపీ, తాజాగా ఓ ఎస్టీని, అందులోనూ మహిళను ఆ పదవికి పోటీదారుగా ఎంపిక చేయడం విశేషం! ఇప్పుడు అందరి దృష్టి జూలై 18న జరగబోయే ఎన్నికపైనే ఉంది.