BREAKING NEWS

'కృష్ణ బిలం'.. దేన్నైనా లాగేసుకోగలదట..!

ఈ విశ్వంలో ఎలాంటి వస్తువునైనా, అది ఎంత భారీదైనా, ఎంత శక్తివంతమైనదైనా తనలోకి లాక్కునేంత శక్తి ఒక్క బ్లాక్‌హోల్‌(కృష్ణ బిలం)కే ఉంది. 

స్పేస్‌టైమ్ ప్రాంతంగా పిలువబడే బ్లాక్‌ హోల్‌ నుంచి.. ఏ కణమూ, నక్షత్రం, చివరికి అత్యంత వేగవంతమైన కాంతి సైతం తప్పించుకోలేవు. అలాంటిది భూమిలాంటి పరిమాణంలో ఉన్నవాటిని.. ఒక సెకనులో మింగేసేంత శక్తి బ్లాక్ హోల్ కి ఉందంటే నమ్మగలరా? అయితే బ్లాక్ హోల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూసేద్దాం:
 
కృష్ణ బిలం… ఈ విశ్వంలో ఏ స్థానంలో అయితే గురుత్వాకర్షణ శక్తి(గ్రావిటీ) స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందో.. అది కూడా ఆ శక్తి నుంచి బయటకి తప్పించుకోలేదో.. ఆఖరికి వెలుగు కూడా తప్పించుకోలేని స్థానాన్ని 'కృష్ణ బిలం' అంటారు.

కృష్ణ బిలం అని పేరు ఎందుకు వచ్చిందంటే… 'కృష్ణ' అంటే 'నలుపు'.. ఎందుకంటే బిలం ఏర్పడిన ప్రాంతమంతా కూడా నల్లగా ఉంటుంది కాబట్టి ఈ కారణంగా 'కృష్ణ బిలం' అనే పేరు వచ్చింది.
 
ఇవి ఎలా తయారవుతాయంటే

ఈ విశ్వంలో దేనికైనా ఒక వయస్సు ఉంటుంది.. అలా నక్షత్రాలకి కూడా ఒక వయస్సు ఉంది. అలా ఆ నక్షత్రాల లైఫ్ టైం అయిపోయాక అవి అంతరించిపోతాయి. అలా చనిపోయిన నక్షత్రాలు… పరిమాణంలో(అంటే వాటి పరిమాణంతో పోల్చి చూస్తే) చాలా చిన్నగా, కుచించుకుపోయి ఉంటాయన్నమాట. అప్పుడు దానిలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి రెట్టింపు అవుతుంది. ఆ గురుత్వాకర్షణ శక్తి వల్లే ఈ కృష్ణ బిలాలు అనేవి ఏర్పడతాయి.
 
ఉదాహరణకు.. మన విశ్వంలోని ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనం ఉన్న భూమినే తీసుకుందాం. భూమి మీద ఉన్నంతసేపు బానే ఉంటాం. కానీ అదే ఒక రాకెట్ భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లాలంటే మాత్రం చాలా ఫ్యూయల్, ఫోర్స్ కావాలి. భూమికి అంతటి శక్తి ఉంటే మరీ భూమిని తన చుట్టూ తిప్పుకునే సూర్యునికి ఇంకెంత శక్తి ఉండాలంటారు.  

సూర్యుడు ఒక నక్షత్రం! కాబట్టి ఆ సూర్యుని చుట్టూ ఎన్నో గ్రహశకలాలు, చిన్న గ్రహాలు, కొన్ని పెద్ద గ్రహాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ కలసి ఏర్పడినదే సౌర కుటుంబం. దీనిబట్టి మనకు తెలిసినంతవరకు సూర్యుడు మహాశక్తివంతుడు. సూర్యశక్తిని తలదన్నే మరికొన్ని నక్షత్రాలు విశ్వంలో దాగి ఉన్నాయి. అవే బ్లాక్ హోల్స్.

సూర్యుడు ఎంతసేపూ తన చుట్టూ ఉన్న సౌర కుటుంబంలోని వాటిని మాత్రమే ఆకర్షించగలడు. ఆ పరిధి దాటి వేటిని ఆకర్షించలేడు. వాటిపై తన ప్రభావాన్ని చూపించలేడు. సౌర మండలంలోకి కొన్ని గ్రహా శకలాలు, తోక చుక్కలు అయితే వస్తూపోతుంటాయి. వాటి దిశను అయితే సూర్యుడు మార్చగలుగుతాడేమో గానీ, తనలోకి లాక్కోలేడు.

బ్లాక్ హోల్స్ ఎంత శక్తివంతమైనవి అంటే కాంతి కూడా దీని చెర నుంచి తప్పించుకోలేదు. కాంతి గురుంచి చెప్పాల్సి వస్తే, ఎన్నో మిలియన్ రెట్ల వేగంతో కాంతి అనేది ప్రసరిస్తుంది. అటువంటి కాంతిని సైతం తనలోకి లాక్కోగలదు అంటే, బ్లాక్ హోల్ పరిధిని ఊహించడం అసాధ్యమనే చెప్పాలి.  దాని చెంతకు వచ్చిన ఎలాంటి నక్షత్రమైన సరే అందులోకి పడిపోవాల్సిందే…
◆ సూర్యుడికి బ్లాక్ హోల్ గా మారిపోయే అవకాశమే లేదు. ప్రతి బ్లాక్ హోల్ కి ఒక పరిధి ఉంటుంది. అది తన పరిధిలోకి వచ్చేలోపే తనలోకి లాగేసుకుంటుంది.
 
ఇవి అసలు ఇలా ఎంత కాలం ఉంటాయనే సందేహం కూడా వచ్చింది. ఐతే అసలు ఇవి ఇలానే ఉంటాయా..? అని అనుకునేవారున్నారు. ఇందుకు బదులుగా ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన అధ్యయనం ప్రకారం… అవి ఎప్పటికి అలానే బతికి ఉండవు.. ఒక సమయం వచ్చాక అవి కూడా అంతరించిపోతాయని వెల్లడైంది. అది ఎలా అంటే… వాటి ఆకర్షణ శక్తి పని చేస్తున్నంతసేపూ దానిలోని శక్తి మెల్లగా తగ్గిపోతుందంట. అలా మొత్తం తగ్గిపోయాకా.. అవి అనంత విశ్వంలో కలిసిపోతాయి.
 
◆ బ్లాక్ హోల్స్ గురుంచి మొట్టమొదటిసారి 18వ శతాబ్దంలోనే ప్రస్తావన వచ్చింది. కానీ దాని భౌతిక స్వరూపాన్ని నిర్దారించడానికి 200ల సంవత్సరాల సమయం పట్టింది.
 
◆ కాంతి కన్నా వేగంగా మనం ప్రయాణం చేసినప్పుడే బ్లాక్ హోల్ నుంచి బయట పడగలం.
దీనికి మంచి ఉదాహరణ 'ఇంటర్ స్టెల్లార్' అనే మూవీ. మనకు ఒక సమయం నడుస్తుంటే, బ్లాక్ హోల్ గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గర ఇంకో సమయం నడుస్తుంది. దీన్నిబట్టి టైం ట్రావెల్ సాధ్యపడుతుంది. సినిమా విషయానికొస్తే హీరో బ్లాక్ హోల్ లో పడి, టైం ట్రావెల్ చేయడం సాధ్యపడింది. 
 
◆ నిజానికి బ్లాక్ హోల్ లో పడిపోయామనే విషయం తెలిసేలోపే మన ప్రాణాలు పోతాయి.
 
తాజాగా ఖగోళంలో కృష్ణ బిలం గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు… అది భూమిని ఒక్క సెకనులోనే మింగేస్తుందట!
 
◆ ఈ భూమిని సెకనులోనే మింగేసేంత భా...రీ బ్లాక్‌హోల్‌ను గుర్తించారు ఖగోళ శాస్త్రవేత్తలు.  సుమారు 900 కోట్ల సంవత్సరాల వయసున్న బ్లాక్ హోల్ గా భావిస్తున్నారు. దీని సైజు కూడా జెట్‌ స్పీడ్‌తో పెరుగుతోంది. ఎంతలా అంటే, సెకనులో భూమి సైజు పరిమాణాన్ని అమాంతం మిగేసేంతగా.. అలాగని బ్లాక్‌ హోల్స్‌తో ఈ భూమికి, మనకు వచ్చే ప్రమాదం ఏదీ లేదు! 
 
◆ స్కై మ్యాపర్‌ అనే టెలిస్కోప్‌ ద్వారా.. ఒకదాని వెంట మరొకటి జంటగా తిరిగే ‘బైనరీ స్టార్స్‌’ అని పిలువబడే బ్లాక్ హోల్స్ లోని ఒక రకాన్ని గుర్తించే ప్రయత్నంలో.. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ భారీ బ్లాక్‌ హోల్‌ను కనిపెట్టారు. 
 
◆ పాలపుంత(మిల్కి వే) కన్నా.. 500 రెట్లు భారీగా ఉందని చెప్తున్నారు. మొత్తం పాలపుంత నుంచి వెలువడే కాంతి కంటే.. ఏడువేల రెట్ల కాంతివంతంగా ఈ బ్లాక్‌ హోల్‌ ఉందంట. భారీ పరిణామం, ఊహించనిదని వర్ణించారు డాక్టర్‌ క్రిస్టోఫర్‌ ఆన్‌కెన్‌. 
 
◆ శక్తివంతంగా, ప్రకాశవంతంగా కనిపించిన ఈ బ్లాక్‌ హోల్‌ సైజు పెరగడానికి కారణం ఏంటన్న దానిపై నిర్ధారణకు మాత్రం రాలేకపోయారు. కాకపోతే.. రెండు భారీ పాలపుంతలు ఒకదాన్నొక్కటి ఢీకొడితే.. వెలువడ్డ మెటీరియల్‌ ఈ బ్లాక్‌హోల్‌లోకి ప్రవేశించి సైజును అమాంతం పెంచుతూ పోతుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. 
 
◆  మూడు బిలియన్ల సూర్య నక్షత్రాలు కలిస్తే ఎంత పరిమాణం ఉంటుందో ఈ బ్లాక్‌ హోల్‌ సైజు కూడా అంతలా ఉందట! పైగా పోను పోను మరింత భారీ సైజులో పెరుగుతూ పోతుందట. 
 
◆ యాభై ఏళ్లకోసారి ఈ తరహా వింతలు కనిపించినప్పటికీ, ఇన్నేళ్లలో ఇంత ప్రకాశవంతమైన భారీ బ్లాక్‌హోల్‌ను గుర్తించడం ఇదే మొదటిసారి.