BREAKING NEWS

సోషల్ మీడియా - పదునైన ఆయుధం

                   సోషల్ మీడియా... ప్రస్తుతం యువత చేతిలో ఉన్న పవర్ ఫుల్ ఆయుధం. రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే ఈ సోషల్ మీడియా. కొన్నాళ్ళ క్రితం వరకు కేవలం వాట్సప్, ఫేస్బుక్ మాత్రమే సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యాయి. కానీ ప్రస్తుతం టిక్ టాక్ లాంటి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులో ఉన్నారు. ఆయుధాన్ని ఎలా అయినా వాడచ్చు. అది మంచి అవ్వచ్చు.. చెడు అవ్వచ్చు... అయితే ఈ సోషల్ మీడియా అనే ఆయుధాన్ని ఎలా వాడుతున్నాం మనం...

                      ఈ రోజుల్లో యువత ఎవ్వరూ ఖాళీగా ఉండడం లేదు. ఒక పక్క వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూనే వ్యాపారాలు కూడా మొదలుపెడుతున్నారు. అలాంటి వారికి ఈ సోషల్ మీడియా ఎంత గానో ఉపయోగపడుతోంది. వ్యాపారానికి సంబంధించిన ప్రచారం అంతా ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఖర్చు కూడా ఏమీ ఉండదు. కస్టమర్స్ మాత్రం పెరుగుతారు. దీంతో చాలా మంది యువత సోషల్ మీడియా వేదికగా తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. దాదాపుగా ప్రతీ ఒక్కరూ తమ వ్యాపారానికి సమందించిన ఓ అఫిషియల్ పేజ్ క్రియేట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు సైతం సోషల్ మీడియా వేదికగా సేవలు అందిస్తున్నాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి విషయం రీచ్ అయ్యే అవకాశం ఒక్క సోషల్ మీడియాకే ఉంది.  కానీ ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే మంచికి కన్నా చెడుకే సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది..

                     ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టా గ్రామ్. కొత్తగా ఈ మధ్యే విస్తరిస్తున్న డేటింగ్ సైట్స్. ఇలా సోషల్ మీడియా ఏదైనా కానివ్వండి. మోసం చేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. "మీకు దుబాయ్ నుంచి మీ ఫ్రెండ్స్/ బంధువులు గిఫ్ట్స్ పంపించారు. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం 50 వేలు పంపాలి" ఇలా ఫేస్బుక్ మెసేజ్ / ఫోన్ రావడమే ఆలస్యం మరేమీ ఆలోచించకుండా అడిగినంత ఇచ్చేయడమే.

కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించడం ఉండదు. ఒకవేళ అదే నిజం అయితే కస్టమ్స్ నుంచి గానీ, లేదా వాళ్ళ బంధువులు గానీ ఫోన్ చేసి చెప్తారు. అంతే గానీ ఎవ్వరో కూడా తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో ఏదో చెప్తే నమ్మేసి సొమ్ములు అప్పజెప్పెస్తే ఏమనుకోవాలి... కొన్నాళ్ళ క్రితం వాట్సప్, ఫేస్బుక్ లలో ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయ్యింది. "పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ మీ చుట్టుపక్కల తిరుగుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే జాగ్రత్త". ఇదీ ఆ మెసేజ్ సారాంశం.  ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవం. కానీ ఇదే నిజం అని నమ్మిన ప్రజల వలన ఎంతో మంది అమాయకులు మరణించారు. స్మార్ట్ సిటీగా పిలుచుకునే విశాఖపట్నం సైబర్ క్రైమ్ నేరాల్లో టాప్ లో ఉందంటే నమ్మగలమా.. కానీ ఇది నిజం. కొంత మంది బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే చాలా మంది బయటకి రావడానికి ఇష్ట పడడం లేదు. 

                     చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు వెళ్తారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అలాంటి టాలెంట్ ఉన్న వారు ఉన్నారు. కానీ నెగిటివ్ మీద చూపిస్తున్న శ్రద్ధ పాజిటివ్, టాలెంటెడ్ కంటెంట్ మీద ఎవ్వరూ చూపించడం లేదు. ఉదాహరణకి ఏదో ఒక యూ ట్యూబ్ వీడియో చూడండి. థంబ్ నైల్ లో ఒకటి ఉంటుంది.

లోపల వీడియోలో మరోటి ఉంటుంది. అసలు రెండిటికీ సంబంధం ఉండదు. కానీ అలాంటి వీడియోలే ట్రెండింగ్ లో రన్ అవుతూ ఉంటాయి. అయితే తనను తాము సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే ముందు గా ఇలాంటి ఫేక్ / నెగిటివ్ పోస్ట్ లను గుర్తించి అరికట్టాలి. అందరూ చదువుకున్నాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం...

నమ్మాలో వద్దో మీకే తెలిసిపోతుంది. ఇలా చేయగలిస్తే చాలు. ఎంతో మందికి ప్లస్ అవుతుంది. నిజంగా కంటెంట్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ నెగిటివ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది.కాబట్టి అది తగ్గిస్తే చాలు. ఆటోమేటిగ్గా మంచి కాన్సెప్ట్ లకు రీచ్ పెరుగుతుంది. ఫైనల్ గా ఇలాంటి సైబర్ క్రైమ్ కేసులలో మోసపోతున్న బాధితులు అందరూ చదువుకున్న వారే కావడం ఆశ్చర్యం...  
 

Photo Gallery