BREAKING NEWS

సూపర్ రైడర్స్ ...

     లగ్జరీ కారుల్లో తిరిగినా రాని ఆనందం... ఫ్లైట్స్ లో జర్నీ చేసినా అనుభూతి చెందలేని ఫీలింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఒక్క వాహనంలో తప్ప వేరే ఎలాంటి వాహనంలో ట్రావెల్ చేసినా అలాంటి థ్రిల్లింగ్ అనుభూతి దక్కదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఆ వెహికల్ లవర్స్ చెప్తున్న మాట... యస్... మీరనుకున్నదే... దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే బైక్ గురించే నేను చెప్తున్నది. ఒకరా ఇద్దరా... దాదాపుగా యూత్ అందరిదీ ఒకటే జపం... లాంగ్ రైడ్... ఇక విశాఖ లాంటి స్మార్ట్ సిటీలో బైక్ రైడర్స్ కి కొదవేముంది.. గ్రూపులు కట్టి మరీ ఛలో లాంగ్ రైడ్ అంటున్నారు.

                     "హే. చక్కని బైకుండి"... అల్లు అర్జున్ సినిమాలోని ఈ పాట చాలా ఫేమస్ కదా. ఆ తర్వాత లైన్ లో ఉండే పిల్ల మీ పక్కన ఉన్నా లేకపోయినా ఇబ్బందేమీ లేదు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఫ్రెండ్స్ తో హ్యాపీగా రైడ్ కి వెళ్లిపోవచ్చు. ఈ రైడర్స్ లో కూడా చాలా రకాలు ఉంటారు. సరదాగా లోకేషన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ రైడ్ కి వెళ్ళేవాళ్ళు కొంత మంది అయితే..

రికార్డ్స్ సృష్టించడం కోసం రైడ్స్ కి వెళ్ళేవాళ్ళు మరికొంత మంది. మరి కొంత మంది ఉద్యోగమే బైక్ రైడింగ్. ఇలా ఒక్కో విధంగా ఒక్కక్కరు ఈ లాంగ్ రైడింగ్ అనుభూతిని పొందుతూ లైఫ్ లో మరచిపోలేని జ్ఞాపకాలను వెనుకేసుకుంటున్నారు.  విశాఖ లాంటి సిటీస్ లో ఇలాంటి ఆసక్తి ఉన్న యూత్ కి ధోకా లేదు. జస్ట్ అలా ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చాలు. నిమిషాల్లో మీ రైడింగ్ గ్యాంగ్ రెడీ. లొకేషన్ ప్లాన్ చేయడం ఆలస్యం. మేమున్నాం అంటూ సిద్ధం అయిపోతారు. 

                   చాలా మంది ఔత్సాహిక రైడర్స్ లే లఢక్ ని తమ టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంటారు. ఎప్పటికైనా ఒక్కసారైనా అక్కడి వరకు రైడ్ కి వెళ్ళాలని... అయితే అంత దూరం లాంగ్ రైడ్ కి వెళ్ళాలి అంటే చాలా ప్రాక్టీస్ కావాలి. బైక్ రైడింగ్ అంటే అనుకున్నంత తేలికైన విషయం కాదు. చాలా కష్ట సాధ్యమైంది.. ముందుగా మీరు వెళ్ళాలి అనుకునే డెస్టినేషన్ మీకు ఎంత దూరంలో ఉంది. దారి మధ్యలో ఎక్కడెక్కడ  ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి.

లాంటి వన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రి సమయాల్లో తెలియని ప్రాంతంలో బైక్ రైడింగ్ మంచి నిర్ణయం కాదు. వెళ్ళేటప్పుడు మెడికల్ ఎమర్జన్సీ కిట్, అవసరం అయ్యే అన్ని రకాల సరంజామా సిద్ధం చేసుకోవాలి. రూట్ మ్యాప్ రెడీ గా ఉండాలి. బైక్ పూర్తి కండిషన్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలాంటి లాంగ్ రైడ్ లకి టైమ్ చాలా ముఖ్యం. అందుకే ఎక్కువ సమయం వృధా చేయకూడదు....

                     రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లకి సంబంధించి కొన్ని క్లబ్స్ విశాఖలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు లాంగ్ రైడ్ లను ఈ క్లబ్స్ నిర్వహిస్తూ ఉంటాయి. ప్రతీ రైడ్ లోనూ ఏదో ఒక సామాజిక బాధ్యత ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ క్లబ్ మెంబెర్స్. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎజ్డి, రాజ్ దూత్ లాంటి వింటేజ్ బుల్లెట్ లకి కూడా క్లబ్ లు రన్ చేస్తున్నారు. ఏంటి మీకు కూడా అర్జెంట్ గా ఈ క్లబ్స్ లో జాయిన్ అయిపోయి లాంగ్ రైడ్ లకి వెళ్ళాలని ఉందా... అయితే ఇంకెందుకు ఆలస్యం. బెస్ట్ క్లబ్ కోసం గూగుల్ లో సెర్చ్ చేసేయండి...
 
 

Photo Gallery