BREAKING NEWS

పొల్యూషన్ .... పొల్యూషన్ ...

ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట . చిన్న చిన్న పల్లెల్లో మొదలుకొని ప్రపంచదేశాల వరకు ప్రతి చోట , ప్రతి సందర్భంలోనూ ఇదే చర్చ ...
అందరూ సమస్యను గురించి చెప్పేవారే తప్ప ,, ఆ సమస్య పరిష్కారానికి తాము ఏం చేస్తున్నారో చెప్పరు .. ఒక్కోసారి చెప్పినా ,,, ఆ మాటలు కేవలం ఆ వేదికపై తమ గొప్ప చెప్పుకోవడానికి తప్ప ,, తాము నిజంగా ఆచరణలో పెట్టేవారు మాత్రం దాదాపుగా లేరనే చెప్పుకోవాలి.

గత రోజుల్లో అయితే ,,,   మార్కెట్ నుండి ఏ వస్తువులు తెచ్చుకోవాలన్నా అందుకు తగిన ఏర్పాటులతో వెళ్లేవారు.. ఉదాహరణకు .... నూనె కోసం అయితే ,,,  ఒక గాజు సీసా గానీ , సిల్వర్ లేదా స్టీల్ పాత్ర గానీ తీసుకెళ్లేవారు. కూరలు తేవాలంటే ,,, కాటన్ సంచులు తీసుకెళ్లేవారు. హోటల్ నుండి భోజనం తేవాలంటే ,,,, క్యారేజ్ పట్టుకెళ్లేవారు . టిఫిన్ కావాలంటే ,,, చెట్నీకి , ఇడ్లీకి , సాంబారుకు వేరు వేరు గా పాత్రలు పట్టుకెళ్లేవారు.  ఇలా ఆ రోజుల్లో ప్లాస్టిక్ వాడకం పెద్దగా ఉండేది కాదు.

ఏవో  ఆట వస్తువులుకు  ప్లాస్టిక్ వాడేవారు తప్ప , సాధారణంగా మట్టి , రాగి , కంచు , ఇత్తడి ,  సిల్వర్ , స్టీల్ , పింగాణీ , గాజు , ఆకులు  మొదలైనవి అన్నింటా ఉపయోగించేవారు. అసలు ,,,  ఆ మాట కొస్తే    ప్లాసిక్ వాడకం భవిష్యత్ లో సర్వాంతర్యామి అవుతుందని కానీ , అది భూమిలో కలవదని కానీ , దానివలన ఇంత కాలుష్యం ఏర్పడుతుందని కానీ ,,,  చివరికి ఆ మహమ్మారి   భూమిమీద నివశిస్తున్న సమస్త జీవరాశి మనుగడకు  ఒక  సవాలు విసురుతుందని కానీ ,, 

ఈ ప్లాస్టిక్ పదార్ధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు కావచ్చు , వాటిని తయారు చేస్తున్న వ్యాపారులు కావచ్చు , అందుకు అనుమతులిచ్చిన అధికారులు కావచ్చు , ప్రోత్సహించిన ప్రభత్వం కావచ్చు , దానిని వ్యతిరేఖించని  ప్రతిపక్షాలు కావచ్చు  అసలు ఊహించి ఉండరు. ఆ రోజు కనీసం ఏ దశలోనైనా , ఏ ఒక్కరైనా ఊహించి ఉండి ఉంటే ,,,,  మన సుఖం కోసం మనకు మనంగా సృష్టించుకున్న ఈ మహమ్మారి కోరలకు ఈ రోజు బలయ్యేవారిమి కాదు ...
సరే ,,,, జరిగిందేదో జరిగింది ....

ఇప్పటికైనా దీనికి పరిష్కారం ఆలోచనలో  కాదు ,  ఆచరణలో పెట్టాలి. ప్రతి ఒక్కరూ తమకు తాముగా త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకోవాలి ,, ఆచరించాలి.
" ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించండి "  ఈ డిమాండ్ తో చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ... అందరూ కాదు కానీ కొంతమంది మిత్రులు వారికి తెలియకుండానే  ఈ డిమాండ్స్ , స్లోగన్స్ తయారీకి  కూడా క్లాత్ బ్యానర్లను  వాడకుండా ప్లాస్టిక్ బ్యానర్లు వాడడం ....

మొదటిగా మనం చేయాల్సింది .. ఇంటి నుండి వెళ్ళేటప్పుడే మన అవసరానికి అనుగుణంగా తగిన సరంజామా అంటే ,,, కూరలు , కిరాణా సరుకులకు 
గుడ్డ సంచులు , అలాగే టిఫిన్స్ కు తగిన డిష్ లు , ద్రవ పదార్ధాలకు మూత ఉన్న పాత్రలు ఇలా మనతో  కూడా పట్టుకెళ్లి , ప్లాస్టిక్ కవర్లమీద ఆధారపడకుండా ఉండాలి.ఫలితంగా కొనేవాళ్ళు లేక తయారీ ఆగిపోతుంది.. అదేసమయంలో  ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని కాకుండా తయారీని  ప్రభుత్వం నిషేధించాలి. అప్పుడు జీవరాసులు స్వచ్ఛమైన ఊపిరి పీల్చుకుంటాయి ...

Photo Gallery