BREAKING NEWS

పెట్ లవర్స్ - బీ కేర్

           కుక్కలు కావచ్చు. పిల్లులు కావచ్చు. ఈ రోజుల్లో చాలా మంది జంతువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా ఉక్కిరిబిక్కిరి జీవితాలు గడుపుతున్నారు ఈ రోజుల్లో కాసింత ఉల్లాసం కోసం ఒక్కొక్కరూ ఒక్కో దారి వెతుక్కుంటున్నారు. నగర జీవితంలో న్యూక్లియర్‌ కుటుంబాల కారణంగా అనుబంధాలు పలచబడుతున్న కాలంలో ప్రేమను రకరకాలుగా షేర్‌ చేసుకోవడానికి ప్రయిత్నిస్తున్నారు.

మనుషుల తర్వాత మన భావాలు అర్థం చేసుకునేవి మన పెంపుడు జంతువులే. అందుకే చాలా మంది ఇప్పుడు వీటిపై దృష్టి సారిస్తున్నారు.  పెంపుడు జంతువులు అంటే ప్రాణం పెడుతున్నారు. రోజులో ఎంత బిజీ గా ఉన్నా సరే కాస్త సమయం మాత్రం పెంపుడు జంతువులతో స్పెండ్ చేస్తున్నారు. ప్రేమ తప్ప మరేం ఎరగని పెట్స్‌ ముద్దు మురిపాలను చూసి పరశిస్తున్నారు. వాటిని జంతువులుగా కాకుండా తమ కుటుంబ సభ్యులుగానే ట్రీట్ చేస్తున్నారు.

ఇలా పెట్స్ అంటే అభిమానం ఉన్న పెట్ క్లబ్స్ నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. విశాఖ లాంటి నగరాల్లో ఈ కల్చర్ ఈ మధ్యే పెరుగుతోంది. 
               సిటీలో డాగ్‌/పెట్ లవర్స్‌ చాలా మందే ఉన్నారు. అయితే అందరికీ వాటి సంరక్షణ కోసం ఏం చేయాలో తెలియదు. జంతువుల సంరక్షణ చాలా కష్టం. మనకు , వాటికి చాలా తేడా ఉంటుంది. అప్పుడే పుట్టిన పసిపిల్లలను ఎలా చూసుకుంటామో ఈ పెట్స్‌ ను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. నోరు తెరిచి ఏమీ అడగలేదు. ప్రతీ క్షణం వాటి బాగోగులు అన్నీ చూసుకోవాలి.

అందుకే ఇలాంటి పెట్ లవర్స్ అందరి కోసం, పెట్స్ కు  అవసరమైన జాగ్రత్తల ఎలా తీసుకోవాలో చెప్పడం కోసమే ఇలాంటి పెట్ క్లబ్స్ ను  ప్రారంభిస్తున్నారు. సిటీలో పెట్ హాస్పిటల్స్‌ ఉన్నా, ఎక్స్‌రే, స్కానింగ్‌ వంటి సౌకర్యాలున్నా సరే డయాగ్నస్టిక్ సెంటర్లు లేవు. కొన్ని సందర్భాల్లో 
పెట్స్ కు ప్రమాదాలు జరిగినా సరైన వైద్యం లభించే అవకాశం లేదు. దాంతో ఏ సమయంలో  పెట్స్ కు ప్రమాదాలు జరిగినా సరైన వైద్యం లభించేందుకు ఈ క్లబ్స్ హెల్ప్ చేస్తాయి. 

       ఉదాహరణకు మన సిటీలో చాలా మంది డాగ్స్‌ పెంచుకుంటున్నారు. కానీ వారికి డాగ్స్ కు సంబంధించి చాలా విషయాల గురించి అవగాహన ఉండడం లేదు. ముఖ్యంగా ఏ బ్రీడ్ ఎంపిక చేసుకోవాలో అర్థం కావడం లేదు. చాలా మంది సోషల్‌ స్టేటస్‌ కోసం కొన్ని రకాల జాతుల శునకాలను  చుకుంటున్నారు. అలాటి వారికి ఏ జాతి ఎలా ఎంపిక చేసుకోవాలి ఏయే జాగ్రత్రలు తీసుకోవాలి... ఎలా పెంచాలి... వంటి విషయాల గురించి సలహాలు కూడా ఇస్తుంటాయి క్లబ్ లు. ఇక సమ్మర్, వింటర్ ఇలా కాలాలు బట్టి ఒక్కో రకం బ్రీడ్ డాగ్ కి ఒక్కో రకమైన జాగ్రత్తలు అవసరం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ జాతులకు మన వాతావరణం పడదు... అలాంటి వాటిని ప్రత్యేక పద్ధతుల్లో పెంచాల్సి  టుంది. అలా ఏ బ్రీడ్ ను ఎలా పెంచాలి, సంరక్షణ గురించి  సలహాలిస్తుంటారు.

              ఇలాంటి పెట్ క్లబ్ కు ప్రారంభించడానికి ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది. అదే వాటి ప్రొటెక్షన్‌ ఉదాహరణకు చాలా మంది పెట్ లవర్స్ వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు శునకాల విషయంలో నిర్థయగా ప్రవర్తిస్తారు. డాబర్‌మాన్‌ను పెంచుకునే కొందరు అందంగా అది కనిపించడం కోసం దాని తోక కత్తిరించేస్తారు. అలా చేయడం నిషిద్ధం. అలాగే చెవులు పొడుగ్గా కనిపించడానికి రకరకాలుగా వాటిని ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి తెలిసీ తెలియక చేసే తప్పులు మళ్లీ చేయకుండా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మీరు కూడా పెట్ లవర్స్ అహ్?? అయితే మీకు దగ్గర్లోని బెస్ట్ పెట్ క్లబ్ ని సెలెక్ట్ చేసుకుని మెంబర్ అయిపొండి మరి.. 
 

Photo Gallery