మంచి తెలుగమ్మాయిని చూడగానే పదహారణాల తెలుగు అమ్మాయిలా ఉందంటారు... ఇంతకీ ఈ అణా ఎక్కడ నుంచి వచ్చిందంటారా? బహుశా ఆ తరం వాళ్ళు అయితే తెలిసే అవకాశం ఉంటుంది గానీ ఈ తరం వారికి అస్సలు తెలిసే ఛాన్సే లేదు. ఇక మ్యాటర్ లోకి వస్తే అణా అంటే రూపాయిలో పదహారో వంతు. అంటే పదహారు అణాలు కలిపితే ఒక్క రూపాయి అన్నమాట. నిండుగా ఉన్నావు అని చెప్పేందుకు ఇలాంటి జాతీయాలు వాడుతారు. ఇంతకీ ఇప్పుడీ అణాలు గురించి ఎందుకు అనేగా మీ డౌట్.. అయితే ఈ ఫుల్ స్టోరీ చదివేయండి...
ఇప్పడంటే మనకు పావలా... సారీ...సారీ అర్ధరూపాయి ఎలా ఉంటుందో కూడా యూత్ కి తెలియదు. కానీ మనల్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలించే రోజుల్లో ఉండే కరెన్సీ ఎలా ఉండేదో ఇంకేం తెలుస్తుంది.. మనలో చాలా మందికి కొత్త విషయాలు... మనకు తెలియనివి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఆ బ్రిటిష్ కాలంలో కాయిన్స్ ఎలా ఉండేవి? అంతకు ముందు కూడా కరెన్సీ వాడేవారా? లాంటి ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు విశాఖ పట్నం లాంటి సిటీస్ లో చాలా మందే ఉన్నారు. దేశంలో ఉండే అన్ని రకాల కాయిన్స్‌ను కలెక్ట్ చేస్తుంటారు ఈ ఆసక్తి ఉన్నవాళ్లు..
అలాగే కొన్ని రకాల విదేశీ కాయిన్స్ కు కూడా వీరి కలెక్షన్లో ప్లేస్ ఉంటుంది.. ఈ కాయిన్ కలెక్ట్ చేయడానికి వెనుక ఒక్కొక్కరిది ఒక్కో కారణం. ఒక్కో ఆసక్తి ఉంటుంది. కానీ ఫైనల్ గా మాత్రం వారి లక్ష్యం ఒక్కటే "ప్రపంచంలో భిన్నంగా ఉండే ఏ కాయిన్ అయినా తమ దగ్గర ఉండాలి"... ప్రతి ఒక్కరూ ఇదే లక్ష్యంగా కృషి చేస్తారు. కొన్ని సార్లు ఒక్క కాయిన్ కోసం లక్షలు కూడా ఖర్చు పెడతారు. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. ఎంత కష్టపడినా అనుకున్న కాయిన్ సాధించామని తృప్తి వారికి చాలు.. ఆ కష్టాలన్నీ మరచిపోవడానికి..
అయితే అలాంటి రేర్ కాయిన్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారు అనే డౌట్ ఉంటుంది చాలా మందికి. మనకి మన గతం ఎలా ఉంటుందో తెలియదు. గతంలో ప్రజలు జీవన విధానం ఎలా ఉండేదో తెలియదు. అంటే కేవలం పుస్తకాల్లో చదువుకోవడం తప్ప పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ ఇలాంటి రేర్ కాయిన్ కలెక్షన్ వలన ఆనాడు డబ్బులు ఎలా వాడేవారు... ప్రస్తుతానికి , ఎప్పటికీ ఎంత వ్యత్యాసం ఉంది లాంటి విషయాలు ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం వెండిని డబ్బులతో కొంటున్నాం. కానీ అప్పట్లో వెండితోనే డబ్బులు కాయిన్స్‌ను తయారు చేసేవారంటే నమ్ముతారా... కానీ ఇది నిజం. ఇలాంటి విషయాలన్నీ ఇప్పటి యూత్‌కు తెలియాలి. చరిత్ర తెలుసుకోవడం వల్ల ఏమిటీ ఉపయోగం అంటారు ఇప్పటి కుర్రాళ్లు. కానీ వాటి చరిత్ర తెలుసుకోవడం వల్ల ఆనాటి లైఫ్‌స్టైల్ తెలుస్తుంది. అలాగే అప్పటికి,ఇప్పటికి ఎంత ఆభివృద్ధి జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. రష్యా దేశం రిలీజ్ చేసిన కొన్ని ప్లాస్టిక్ కాయిన్స్‌ను కూడా ఔత్సాహికులు తమ కలెక్షన్స్ లో భద్రంగా దాచుకుంటున్నారు. దేశాలు వెళ్లినప్పుడు అక్కడ దొరికే స్పెషల్ కరెన్సీ తీసుకొచ్చే అలవాటు ఉంటుంది చాలా మందికి..
విదేశీ కాయిన్స్/కరెన్సీను చాలా మంది కలెక్ట్ చేస్తుంటారు. కానీ మన దేశ చరిత్ర,అప్పటి కరెన్సీ ఎలా ఉండేది? ఆ కాలం నాటీ వాటికి ఈ కాలం వాటికి తేడా ఏంటీ అనే విషయాలు ఈ తరం వాళ్లు తెలుసుకోవాలి. ఇప్పుడంటే కాయిన్స్‌ను మెషీన్ ద్వారా తయారుచేస్తున్నారు. కానీ అప్పట్లో చేత్తోనే కాయిన్స్‌ను తయారు చేసేవారని ఎంత మందికి తెలుసు.
ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కేవలం కాయిన్స్ మాత్రమే కాదు. వింతగా ఉండే ఎలాంటి వస్తువు అయినా కలెక్ట్ చేసే అభిరుచి ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. పూర్వం ఉపయోగించిన స్టాంప్స్, పుస్తకాలు, అప్పటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఒక్కటేమిటి మన చరిత్ర తెలియజేసే ఏ వస్తువైనా సరే తమ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది.. ఈ తరం కుర్రాళ్లకు ఇలాంటి చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది...