BREAKING NEWS

వీసా"లు - జాగ్రత్తలు

 విదేశాలు... ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి. చదువు కోసమో... చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం కోసమో... లేదా సరదాగా తిరగడం కోసమో ఇలా రకరకాల కారణాలతో ఫారిన్ ట్రిప్స్ వేస్తుంటారు చాలా మంది. అయితే మన అనుమతి లేనిదే మనింటికి ఎవర్నీ రానివ్వం కదా.. విదేశాలకు వెళ్ళాలి అన్నా అదే పద్ధతి. దానికి పేరే "వీసా"... అయితే ఈ విసా విషయంలోనే చాలా మందికి అపోహలు ఉంటాయి. చాలా మంది సరిగ్గా ఈ విషయంలోనే మోసపోతున్నారు కూడా.. ఇంతకీ ఈ విసా లు ఎన్ని రకాలు... ఉపయోగాలు ఏమిటి???  ఒక సారి తెలుసుకుందాం...

       సాధారణంగా మనం ఎక్కువగా ఉపయోగించే వీసాల్లో 4 రకాలు ఉంటాయి. స్టూడెంట్‌ వీసా, వర్క్‌ వీసా, విజిటింగ్‌ వీసా, పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసా. చదువుకోవడానికి , ఉద్యోగం చేయడానికి వెళ్లాలి అనుకునేవారు  పర్మినెంట్‌ వీసా మీద మాత్రమే వెళ్లడం మంచిది. ఒకవేళ స్టూడెంట్‌ వీసా మీద వెళ్ళినా ఒక్క కెనడాలో మాత్రమే దానిని పర్మినెంట్‌ వీసాగా మార్చే అవకాశం ఉంది.

మిగతా ఏ దేశాలలో కూడా ఆ అవకాశం లేదు. ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు వీసా లలో కూడా పర్మినెంట్‌ రెసిడెన్స్‌ వీసా మాత్రమే చాలా వరకు మనకు ఉపయోగరకంగా ఉంటుంది. మిగిలినవన్నీ కేవలం టెంపరరీ వీసాలు మాత్రమే.. అంటే ఎప్పుడైనా దేశం వదిలి తిరిగి వచ్చేయాల్సిందేనన్నమాట. ఇలాంటి వీసా ల వలన విదేశీ అనుభవం వస్తుంది తప్ప మనం అనుకున్నది సాధించడం సాధించలేం.

అమెరికాలో ఇచ్చే హెచ్‌1బి1 వీసా కూడా టెంపరరీయే, వీసా పూర్తయిన 20 రోజుల్లో ఇండియా పంపించేస్తారు... వీసా కోసం జరిగే ఎగ్జామ్ లో వచ్చిన పాయింట్స్‌ బట్టి మన ఉద్యోగానికి, చదువుకు విలువ కట్టి వీసా పొందడానికి అర్హులమో కాదో నిర్ణయిస్తారు. దీన్ని బట్టి ఒక వీసా ప్రాసెస్‌ మంచిదని చెప్పలేం. ఒకవేళ మన అవసరం ఆ దేశం వారికి తప్పకుండా ఉంటుంది అనుకుంటే వీసా త్వరగా దొరుకుతుంది. ఒక్కొక్క దేశంలో చట్టం ఒక్కో రకంగా ఉంటుంది.

  ఒక్కో దేశానికి ఒక్కో ఇమ్మిగ్రేషన్ ఉంటుంది... కాబట్టి ఏ దేశం వీసా కోసం అప్లై చేయాలని అనుకుంటారో ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ గైడ్‌లైన్స్‌ అన్నీ క్షుణ్ణంగా చదివి వీసాకు అప్లై చేయడం మంచిది. ఎందుకంటే ఒక్కో దేశం పద్ధతి ఒక్కోలా ఉంటుంది. అవేమీ తెలియకుండా వీసా అప్లై చేస్తే సమయం, డబ్బు వృథా అవ్వడమే తప్ప ఉపయోగం ఉండదు. అసలు మనం ఏ దేశం వెళ్ళాలి అనుకుంటున్నాం. ఎందుకు?? వెళ్ళాక అక్కడ మనుగడ ఎలా? వాతావరణం మనకు సెట్ అవుతుందా లేదా?? ఉద్యోగం అయితే మనం అనుకున్న కంపెనీలో వేకెన్సి ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకుని వీసా ప్రొసెస్ మొదలుపెట్టాలి...

ఇక టెక్నికల్‌ స్కిల్స్‌పై వెళ్లాలనుకునేవారు వారికున్న అనుభవాన్ని బట్టి వీసా పొందడం చాలా సులువు. అఫీషియల్‌ కోటాలో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి మాత్రం అన్ని దేశాల నుంచి పోటీ ఉంటుంది కనుక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. 
  ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏ వీసా అప్లై చేయాలి తెలుసుకున్నారు. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్లు
ఎక్కడైనా ఉంటారు. అందులోనూ ఇలాంటి విదేశీ వ్యవహారాల్లో మరీ ఎక్కువగా ఉంటారు. దుబాయ్ లో ఫలానా ఉద్యోగం ఉంది. మీరే కరెక్ట్ పర్సన్ అంటూ నిరుద్యోగులను టార్గెట్ చేస్తారు. అసలే ఉద్యోగం అవసరం. అలాంటి సమయంలో విదేశంలో ఉద్యోగం అనగానే మరేమీ ఆలోచించరు.

మోసగాళ్ళు చెప్పింది చేస్తారు. ఫేక్ వీసా లతో గానీ లేదా ఒక ఉద్యోగం చెప్పి మరో ఉద్యోగంలో కానీ జాయిన్ చేసే విధంగా చేస్తారు వాళ్ళు. కట్ చేస్తే... దేశం కాని దేశంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ అక్కడే ఉండిపోతారు చాలా మంది. ఇదే కథాంశంగా చాలా సినిమాలు కూడా వచ్చాయి. చాలా సినిమాల్లో వీటి ప్రస్తావన కూడా ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్ళే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండండి... 

 స్టూడెంట్‌ వీసాపై వెళ్లి పరిమితిని మించి వర్క్‌ చేయడం విదేశీ చట్టాల ప్రకారం నేరం. అలాగే వర్క్‌ వీసా మీద వెళ్లి చదువుకోవాలి అనుకునేవారు వాళ్ళు పనిచేసే కంపెనీ పర్మిషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. తప్పనిసరిగా  గుర్తుంచుకోవలసింది ఒక్కటే... విదేశాలు వెళ్ళండి..చదువుకోండి... ఉద్యోగాలు చేసుకోండి.  కానీ అక్కడికి వెళ్లడానికి సరైన మార్గాన్ని, అది చూపించే కన్సెల్టెన్సీని పరిశీలించి అడుగు ముందుకు వేయండి.. .
 

Photo Gallery