పిన్నలనుండి పెద్దలవరకు , ఆకాలం నుండి ఈకాలం వరకు , ధనిక - పేద తారతమ్యాలు లేకుండా , స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరినీ అలరించే ఏకైక వినోదం సినిమా.
మూకీల నుండి , మాటల సినిమాలగాను , నలుపు - తెలుపు సినిమాలనుండి రంగుల సినిమాగాను , రంగుల సినిమా నుండి మల్టీ రంగుల సినిమా గాను , 35 MM సినిమా నుండి 70 MM సినిమా గాను , సాధారణ సౌండ్ సిస్టం నుండి 6 ట్రాక్ సౌండ్ సిస్టమ్ గాను , 2 D నుండి 3 D , 5 D ల గాను అనేక విధాలుగా చిత్రపరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది.
అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇప్పటి సినిమా ఈ తరంవారిని ఎంతగా అలరిస్తోందో మూకీ సినిమా కూడా ఆ తరంవారిని అంతగానే అలరించింది.
అంతా కల్పితం అని తెలిసినా , నిజ జీవితంలో సాధ్యం కాదని తెలిసినా సరే ఎంతటి వారినైనా ఆకర్షించే ప్రభావం ఈ సినిమా మీడియాకు ఉన్న గొప్ప లక్షణం. సినిమాను సినిమా గానే చూడాలి అని కొన్ని సందర్భాలలో కొంతమంది అంటుంటారు. కానీ ,, అప్పుడు కావచ్చు , ఇప్పుడు కావచ్చు , రేపు కావచ్చు సినిమాల ప్రభావం తప్పకుండా ప్రజల మీద ఉండి తీరుతుంది. సినిమానుండి గానీ సినిమా నటులనుండి గానీ మంచి గానీ చెడు గానీ ఎంతో కొంత ప్రజలు అనుకరిస్తారు.
ఇలాంటి సినిమాలనే ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టే మేము ఇలాంటి సినిమాలు తీస్తున్నాం అని చిత్రపరిశ్రమ వర్గాలు .... అలాంటి సినిమాలే తీస్తున్నారు కాబట్టే అవే చూస్తున్నాం అని ప్రేక్షక దేవుళ్ళు వివిధ మీడియా ఛానెల్స్ లో వాదించుకుంటారే తప్ప , ఏకాభిప్రాయంకి రారు. ఈలోగా మరికొంతమంది మహిళామణులు ఎంటరై స్త్రీని అసభ్యంగా చూపిస్తున్నారు అని గొడవ పెడతారు. మరి స్త్రీలు అలా అసభ్యంగా నటించడానికి ఎందుకు ఒప్పుకుంటారో అర్ధం కాదు. మాటలు , పాటలు , దృశ్యాలు ఒకటేమిటి అన్నింటా అభ్యంతరాలు లెవనెత్తుతూ ఉంటారు ఇంకొంతమంది.
ఆ రోజుల్లో అయితేనా ... ఇలాంటివి మాకు తెలియదు సుమా ,,, అంటూ మొదలు పెడతారు పాతతరం వారు. అసలు పాత , కొత్త ఏమిటి ??
ప్రతి పాత తరం ఒకప్పటి కొత్త తరమే .. ప్రతీ కొత్త తరం తరవాతకి పాతతరమే కదా .. ఏ తరం ముచ్చట్లు ఆ తరానివే ... సుమారు 40 సంవత్సరాల పూర్వమే ధ్వందార్ధ పాటలు , మాటలు సినిమాలలో ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన " యమగోల " సినిమాలో పాటలు , మాటలు , డ్యాన్స్ లు చూసి , అప్పటి పాతతరం వారు వాటిని బూతు అన్నారు. అవే బూతు అయితే ,,, మరి ఇప్పటి సినిమాలను ఏమనాలి ??? అప్పుడూ సెన్సార్ ఉంది . ఇప్పుడూ సెన్సార్ ఉంది.
అయినా ఒక సినిమాలో ఒక సీన్ కు కట్ చెప్పిన సెన్సార్ వారు మరో సినిమాలో అదే రకం సీన్ కు ఓకే చెబుతున్నారు. అంటే ... ఆ సీన్ ప్రజంటేషన్ ని బట్టి సెన్సార్ నిర్ణయం ఉంటుందేమో .... మళ్ళీ ఈ సినిమాలలో రకరకాలు ఉంటాయి. సందేశాత్మక , వినోదాత్మక , భయంకర , అతీత శక్తుల , దుష్ట శక్తుల , జానపద , పౌరాణిక , చరిత్రాత్మక , ఫాంటసీ , యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్నాయి. ఇందులో కొన్ని చిత్రాలకు అవార్డులు కూడా ఉంటాయి. ఈ అవార్డుల విషయంలో కూడా పెద్ద దుమారమే ... ఏ సినిమాకు ఏ అవార్డు ఎందుకు వస్తుందో ఎవరికీ అర్ధం కాదు.
ఇక , సినిమా నటుల విషయానికి వస్తే ,,, ప్రతీవారు సెలబ్రిటీ తమకు తాముగా హోదా చూపించేయడమే .. అసలు కేవలం నిఘంటువులకు మాత్రమే పరిమితమైన " లెజెండ్ , సెలబ్రిటీ " పదాలు సినిమా వాళ్ళ పుణ్యమా అని అందరి నోళ్ళల్లో నాని నాని అతి సాధారణ పదం అయిపోయింది.
ఈ సెలెబ్రెటీలలో మళ్ళీ రకాలు .. స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లు కొందరు , అగ్ర నటులు కొందరు , మోస్ట్ వాంటెడ్ నటులు కొందరు , సీనియర్ మోస్ట్ జూనియర్ నటులు కొందరు , గౌరవ అతిధి నటులు కొందరు ఇలా తెరమీద కనబడే వారు కొందరయితే ,, నిర్మాత , దర్శకులు , కేమెరా , మ్యూజిక్ ఇలా అనేక రంగాలలో తెరవెనుక పనిచేసేవారు కొందరు.
తెరమీద కనిపించినా , తెర వెనుక పని చేసినా టాలెంట్ ఉన్నవారికి ఇప్పుడు అత్యంత ప్రజాదరణ దక్కుతోంది. ఇలా ఎంతోమంది ఎన్నోరోజులు సమిష్టిగా కష్టపడి ఓ సినిమా నిర్మిస్తే , క్రిటిక్స్ పేరుతో రకరకాల స్వార్ధాలతో సునాయాసంగా ఆ సినిమా గురించి చెడు రివ్యూలు వ్రాస్తున్నారు.
కళాకారులకు కూడా వారి ప్రతిభను గాక ఇంకేదో చూసి కొన్ని అవార్డులు ప్రకటిస్తున్నట్లుగా సాధారణ ప్రజల బలమైన నమ్మకం. సరే .. ఏ సంస్థలో అయినా లోపాలు ఉంటాయి. ఈ లోపాల గురించి మనకెందుకులే అనుకుని మనకు చూడాలనిపించిన సినిమాను సరదాగా చూసేసి ఇంటికి వచ్చేయడమే.
నచ్చితే చూడమని నలుగురికి చెప్పాలి. నచ్చకపోతే ఎవరికీ ఏమీ చెప్పొద్దు.
ఏది ఏమైనా సినిమా అన్నది ప్రధానంగా వినోదం కోసమే కనుక ఓ మూడు గంటల బాటు హాయిగా చూసేసి , అక్కడితో మరచిపోవాలి... అంతేగా ..అంతేగా ...