ఒకప్పుడు చలువ కళ్లద్దాలు... అదేనండి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే పెద్ద గొప్ప విషయమే... అప్పట్లో డాక్టర్ రాసే కళ్ల జోళ్లు తప్ప కూలింగ్ గ్లాసెస్ అంతగా ప్రాచుర్యంలో ఉండేవి కావు. ఎవరో ధనవంతులు మాత్రమే గాగుల్స్ వాడేవారు. అలాంటి వారు కనిపిస్తే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూసేవారు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. కూలింగ్ గ్లాసెస్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కూలింగ్ గ్లాసెస్ వాడితే విచిత్రంగా చూసేవారు. మరి ఇప్పుడో వాడకపోతే చూస్తున్నారు. అయితే ఈ చలువ కళ్లద్దాలు లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.
కాలం ఏదైనా కాళ్లకు జోడు ఎంత అవసరమో... వేసవి కాలంలో కళ్లకు జోడు కూడా అంత అవసరం. ప్రస్తుతం విశాఖపట్నం లాంటి నగరాలలో ఎక్కడ చూసినా కుర్రకారు గాగుల్స్ మంత్రమే జపిస్తున్నారు. ఉదయం లేచి బైక్
తీసిన దగ్గర నుంచి మళ్లీ ఇంటికి చేరే వరకు కళ్లకు జోళ్లు అతుక్కుపోయి ఉండాల్సిందే. పొరపాటున కూడా కళ్ల నుంచి విడిపోయే ప్రసక్తే లేదు. కుర్రకారు స్పీడ్ కు తగినట్లుగానే మార్కెట్లో కూడా కొత్త కొత్త రకాల మోడల్స్‌లో తక్కువ ధరకు సన్ గ్లాసెస్ అందుబాటులో ఉంటున్నాయి.
కానీ బ్రాండెడ్ గాగుల్స్ కు, ఇమిటేషన్ గాగుల్స్‌కు లుక్‌లోనూ,సేఫ్టీలో కూడా చాలా తేడాలుంటాయి. ఇంతకీ అసలు మన నగరాలలో ఎన్ని రకాల బ్రాండ్స్ సన్ గాగుల్స్ అందుబాటులో ఉన్నాయి? వాటి ప్రత్యేకత ఏమిటి? కాస్ట్ రేంజ్ ఎంతలో ఉంది?
సన్‌గ్లాసెస్... బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎండ తగలకుండా ఇవి పెట్టుకుంటే సేఫ్టీగానూ ఉంటాయి. అల్ట్రా స్టైలిష్‌గా కూడా ఉంటాయి. రేబాన్,ఫాస్ట్రాక్,ఫాసిల్ బ్రాండ్స్‌తో పాటు దాదాపు 20కు పైగా కూలింగ్ గ్లాసెస్ బ్రాండ్స్ సిటీస్ లో అందుబాటులో ఉంటాయి. ఇంకా హైదరాబాద్, ముంబై లాంటి మెట్రో సిటీస్ లో అయితే ఫారిన్ బ్రాండ్స్ కూడా అందుబాటులో ఉంటాయి అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఓక్లే,వోగ్,అర్మానీ,పూమా,డీ అండ్ జీ,బాస్...
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా , రెండా ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీ కళ్లను అందంగా అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనకు దొరికే ట్రెండ్స్ ను ప్రాన్స్,జపాన్, ఇటలీ, జర్మనీ,ఆస్ట్రియా, కొరియా,అమెరికా లాంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. యూత్ ఇవే కొంటున్నారు.. అన్నీ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కదా? ధర ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారా? రూ.8 వేల నుంచి ప్రారంభం అయ్యే వీటి ధర రూ.35 వేల వరకు ఉంటుంది, కాబట్టి స్టైలిష్ లుక్ కోసం కాస్త ఖర్చు పెట్టాలి అనుకునే వారికి కూడా గాగుల్స్ అందుబాటులోనే ఉన్నాయి. వీటికి కుర్రకారు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు పెడుతున్నారు.
అన్నివేల రూపాయలు ఖర్చు పెట్టి బ్రాండెడ్ తీసుకుంటే ఎక్కువ కాలం అవే వాడాలి. మోడల్ మార్చడం కూడా కుదరదు. కాబట్టి ఇమిటేషన్ బ్రాండ్స్ తీసుకుందాం అనుకుంటున్నారు చాలా మంది. ఇది కూడా నిజమే. ఎందుకంటే అందరూ అన్ని వేల రూపాయలు ఒక్క గ్లాసెస్ కు మాత్రమే ఖర్చు చేయాలి అంటే సాధ్యం అయ్యే విషయం కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇమిటేషన్ మోడల్ తక్కువ ధరలో తీసుకోవచ్చు. అయితే ఈ కళ్లద్దాలు వాడడం వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
కొంతమందికి ఈ ఇమిటేషన్ బ్రాండ్స్ సరిగ్గా సెట్ అవ్వవు. అలాంటి వారికి ఈ కళ్ళజోడు పెట్టుకున్నంత సేపు కళ్ళు మంట వచ్చే అవకాశం ఉంది అయితే అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఒక్కసారి కళ్ళజోడు తీసేస్తే ఇక ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇంతకీ ఒరిజినల్ బ్రాండ్‌కు ఇమిటేషన్ బ్రాండ్‌కు తేడా ఏంటి అనే కదా? ఒరిజినల్ బ్రాండ్స్ లో హైక్వాలిటీ లెన్స్ యూజ్ చేస్తారు. కేటర్య్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎటువంటి అల్ట్రా వైలెట్ రేస్ మన కంటిని చేరకుండా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకే లాగా విజన్ కనిపిస్తుంది. ఐ స్రైయిన్ అవ్వదు. కంఫర్ట్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి బ్రాండెడ్ లో. పిండి కొద్దీ రొట్టె...