ఒక్కో యుగానికి ఒక్కో ధర్మం ఉంటుంది. ఏ యుగ ధర్మం ఆ యుగానిదే ...
రోమ్ లో ఉంటే " రోమన్ లా " ఉండు అన్నది పెద్దల మాట . కాలాన్ని బట్టి , ప్రాంతాన్ని బట్టి , మనుషులను బట్టి , సందర్భాన్ని బట్టి వ్యవహరించడం తెలివైన లక్షణం. మనం మన ఇంట్లో ఉంటే ఒకలా ఉంటాం. అదే మరొకరి ఇంటికి వెళ్తే ఇంకోలా ఉంటాం. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు సంతోషంగా పలకరిస్తాం. అశుభ కార్యాలకు వెళ్ళినప్పుడు బాధతో , ఓదార్పుగా పలకరిస్తాం. పలకరింపుల్లో అటు ఇటు అయితే ఇక అంతే సంగతులు. ఇవన్నీ
చిన్నతనంలోనే తెలియవు కానీ వయసుని బట్టి క్రమేపీ అలవాటు అవుతాయి.
ఇంతకీ ఇదంతా ఎందుకంటే !!! " ఇందు గలడందు లేడను సందేహం వలదు " అన్నట్లుగా కల్తీ లేని ప్రపంచం లేదు. తినే పదార్ధం అయినా , వాడే వస్తువు అయినా , నిత్యావసరాలయినా , ఎప్పుడో ఓ సారి వాడేవి అయినా కల్తీ తప్పనిసరి. కల్తీ నిరోధక చట్టాలు ఎన్ని ఉన్నా , అధికారులు ఎన్ని కేసులు రాస్తున్నా , కోర్టులు ఎన్ని సార్లు శిక్షలు విధిస్తున్నా కల్తీ లో మాత్రం కల్తీ లేదు. పూర్తి స్వచ్ఛమైన పదం ఏదైనా ఉందంటే అది కల్తీ మాత్రమే ...
అది కూడా కేవలం " దుంపల బళ్లో " చదువుకున్న తెలుగు మీడియం పిల్లలకు మాత్రమే సుమా... బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి , పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో ఇంగ్లీషు చదువుకున్న ఖరీదైన పిల్లగాళ్లకు కాదు.. ఎందుకంటే వీళ్లకు " కల్తీ " అనే పదానికి అర్థమే తెలియదు. వ్రాయనూలేరు , చదవునూ లేరు.
సర్వాంతర్యామిలా మారిపోయిన ఈ కల్తీ మహమ్మారి నుండి రక్షణ పొందేదెలా ??
నారు పోసినవాడు - నీరు పోయడా ?? కల్తీని సృష్టించిన వాడు , దానిని తట్టుకునే శక్తిని ప్రసాదించడా ?? తప్పకుండా ప్రసాదిస్తాడు. ఓ నాలుగైదు తరాల వెనక్కు వెళ్తే ఒక్కోరు సుమారుగా " అడ్డడు " బియ్యంతో వండిన అన్నం , రకరకాలైన శాఖాహారా , మాంసాహార వంటకాలతో , బాటు, పాతికేసి మామిడి పళ్ళు లేదా స్వీట్స్ తిని బ్రేవ్ మని త్రేంచేవారు. అప్పటి శరీర తత్వం అది. చక్కగా జీర్ణం అయ్యేది. తరువాత కాలంలో తిండి క్రమేపీ పడిపో వచ్చింది. తింటే ఆయాసం , తినకపోతే నీరసం. పిడికెడు అన్నం కూడా తినడానికి ఆప సోపాలు పడుతున్నారు. తిన్నా , తినకపోయినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ , ఫ్రీగా వచ్చే ఓ కొత్త సౌకర్యం. అన్నీ కల్తీయే అనుకుంటూ అన్నీ తినేస్తాం ,, కానీ దేనికీ నోరు కట్టుకోలేము.
ఇక సందట్లో సడెమియా అన్నట్లు కల్తీ లేని స్వచ్ఛమైన సరుకు మేము అమ్ముతాం అని రెట్టింపు రేట్లకు అమ్మేవారు కొందరు. వాటిని ఎగబడి కొనుక్కుని మరీ , వారికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేవారు ఇంకొందరు. అన్నీ కొబ్బరి నూనెతోనే తినమని ,అసలు నూనె వాడద్దు అని , అంబలి త్రాగమని , కొర్రలు తినమని , చిరు ధాన్యాలు తినమని , పచ్చికూరలు తినమని , ఆకు కూరలు తినమని , మళ్ళీ ఇందులో కొన్ని రకాలు తినవద్దని , చపాతీ తినమని , అబ్బే , పుల్కా తినమని , అమ్మో మైదా !!! అసలు కంటితో కూడా చూడవద్దని ,
అయోడిన్ సాల్ట్ మాత్రమే వాడాలని , మళ్ళీ అంతలోనే థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయని అంతెందుకు ? ఇంట్లో వాడే బల్బు కూడా ఫలానాదే వాడాలని కొందరు , అది వాడితేనే ఆరోగ్య సమస్యలు వస్తాయి అని కొందరు , కుక్కలను పెంచితే రోగాలు వస్తాయని కొందరు , వాటిని ప్రేమించాలని కొందరు , ఆఖరుకి ఏడాదికి ఒకసారి వచ్చే పండుగను కూడా ముందురోజు అని ఒకరు మర్నాడు అని మరొకరు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలను వివిధ మార్గాలలో ప్రచారం చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. వీటిని చూస్తున్న ప్రజలు మాత్రం ఏది తినాలో ? ఏది తినకూడదో ? దేనిని వాడాలో ? దేనిని వాడకూడదో ?? నిర్ణయించుకోలేక ,,
ఆ కసితో అవసరం ఉన్నా లేకున్నా అన్నీ వాడేస్తున్నారు.. శభాష్ .. ఇది కదా కావలసింది. నువ్వు ఎవరి మాటా వినకు , నీకు ఏం తినాలనిపిస్తే అది తిను ,
ఏం వాడాలనిపిస్తే అది వాడు ... నువ్వే రాజు - నువ్వే మంత్రి ... అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. అన్నీ మూసుకున్నా నూరేళ్లు ఎవరూ బ్రతకరు , అన్నీ మానేసి , అన్నేళ్ళు బ్రతికినా ఏమి సాధించాలని ?? కాకిలా కలకాలం బ్రతికే కన్నా , హంసలా ఆర్నెల్లు బ్రతకడం మేలు ...