BREAKING NEWS

కష్టకాలంలో వలస కూలీలని ఆదుకున్న ఆపద్బాంధవుడు - సూను సూద్

ప్రతి ఒక్కరూ సమానమే. అందరూ ఒకటే మట్టి మీద పుట్టి..... ఒకటే మట్టి మీద జీవిస్తున్నాం.... ప్రతి ఒక్కరిది అదే రక్తం... అదే ప్రాణం... అంతా అదే అన్నంని తింటున్నాం. దీనిలో ఏ భిన్నము కూడా లేదు. అందరూ భగవంతుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాల తోనే బతుకుతున్నాం. అయితే తన కోసం తాను బతికేవాడు మనిషి కానీ మరొకరి కోసం సహాయం చేస్తూ మానవత్వంతో మసిలితే మహర్షి అవుతాడు.
  
రీల్ లో విలన్ అయినా రియల్ గా హీరోనే. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మంచి విలన్ గా పేరు పొందిన సోను సూద్  కష్టకాలంలో మాత్రం రెమ్యునరేషన్ ఏమీ తీసుకోకుండా హీరో అయ్యి మరొకరి కోసం బతుకుతున్నాడు. నిజంగా సోనూసూద్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.  ఎవరి స్వార్థంతో వాళ్లు.... ఎవరి పనులతో వాళ్ళు  సుఖంగా జీవిస్తున్న కాలంలో కూడా ఒకరి కోసం సహాయం చేయడానికి ముందుకు రావడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. దాదాపు 30 వేల మంది వలస కార్మికులను ఆదుకున్నాడు సోనుసూద్. కూలీల కోసం ఏకంగా  ప్రత్యేక విమానాలను ఏర్పాటు చెయ్యడం మామూలు విషయం కాదు.
 
ఎంతో మంది స్టార్స్  సినిమాలో హీరోలుగా నటించినా బయట మాత్రం మామూలు మనిషి గానే ఉంటున్నారు. కానీ చేసే పాత్రలు విలన్ వి అయినా తాను మాత్రం హీరోనే.  కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఇబ్బంది పెడుతోంది. కష్టకాలంలో ఈయన ఆదుకుని ఎంతో సేవ చేస్తున్నాడు. తన స్థాయిని మించి తాను సహాయం చేయడం విశేషం. వలస కార్మికుల పేరిట దేవుడయ్యాడు సోనూసూద్.  
 
గత కొంత కాలం నుండి కూడా ఈయన ఎంత గానో సేవ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి సోనూ సూద్‌కు అభ్యర్థనలు ఎన్నో వచ్చాయి. అలానే ఆయన ఎన్నో సార్లు తిరిగి బదులిచ్చారు కూడా. సహాయం చేస్తాం, చూడండి అని కబుర్లు చెప్పే వాళ్ళు ఉన్న ఈ సమాజం లో ఏ లాభం లేకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళని సొంత వాళ్ళుగా భావించి సమస్యకి చిటికె లో పరిష్కారం అందిస్తున్నాడు. ఇటువంటి కటిక కాలంలో ఎవరు చెయ్యలేని విధంగా తానూ చేస్తున్నాడు అంటే ఆయన గురించి ఇంకేం చెప్పనక్కర్లే. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టుందుకు లాక్‌డౌన్‌ విధించడం జరిగిన విషయం అందరికీ తెలిసినదే...ఈ  కారణంగా వేల మంది వలస కార్మికులు దేశం లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థల పై నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో చాలా మంది కార్మికులు కాలి నడకన తమ స్వస్థలాలకు పయనమయ్యారు. దేవుడా నీవే దిక్కు అని భారం వేసిన వలస కూలీల పాలిట దేవుడై రక్షించాడు ఈ రీయల్ హీరో.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా సోనూసూద్ మంచి సేవలని అందిస్తున్నాడు అని నెటిజన్లు చెప్పారు. అనేకులకు సహాయం అందించి తన పెద్ద మనసుని చాటుకున్నాడు. రైతులని కూడా ఆదుకోవడానికి ముందడుగు వేసాడు. ఆంధ్రప్రదేశ్‌ లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు సోనూ సూద్ ముందుకొచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు కాడెద్దులుగా మారిన కూతుళ్లను వీడియో లో చూసిన ఆయన తట్టుకోలేక పోయాడు.

ఆ కుటుంబానికి  తాను సహాయం చెయ్యాలని ఓ ట్రాక్టర్ పంపుతానని వెల్లడించారు. ఈ సాయంత్రానికల్లా ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతుందని ఆ రైతుకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం సోనూసూద్ ట్వీట్ చేశారు. ఇలా తను మరో కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఇలా వలస కూలీల నుండి ఈ రైతు వరకు ఎంతో మందిని ఆదుకుని కుటుంబాలని నిలబెట్టాడు ఈ మహానుభావుడు...
 
సౌత్ ఇండియన్ స్టార్లు ఎందరో సినిమాల్లో దుమ్ము దులిపారు. కానీ ఏం ప్రయోజనం....? బయటకి రాకుండా కేవలం ఇంటికే పరిమితం అయ్యి వంటలు, మొక్కలు, ఫిట్ నెస్ అంటూ కెమెరా లో మాత్రమే కనపడుతున్నారు. కానీ విలన్ అయిన సోను సూద్ మాత్రం కష కాలంలో ప్రజలకి దేవుడై అడిగిన వాళ్లకి, అడగని వాళ్ళకి కూడా మంచి మనసుతో ముందుకెళ్తున్నాడు. ఇటువంటి వారు ఒక్కరంటే చాలదా..? అనేలా సూను సూద్ ఆదుకుంటున్నాడు.
 
తాజాగా మరో మహిళకి ఉద్యోగం అందించడానికి ముందుకి వచ్చాడు. ఉద్యోగం కోల్పోయిన ఒక మహిళ పేదరికం వలన కూరగాయల్ని అమ్ముకుంటుంటే చూడలేక ఆమెని ఆదుకున్నాడు సూను సూద్. ఆమెకి ఇంటర్వ్యూ పెట్టి జాబ్ ఆఫర్ ఇచ్చాడట ఈ హీరో. సహనంతో శాంతి మార్గం లో వెళ్తూ ఇతరులని నడిపిస్తున్నాడు... ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు... పరులకి సహాయం చేసే పరోపకారుడు... స్వార్ధంతో పరుగులు పెడుతున్న జనాలకి పేదరికం తో ఇబ్బందులు పడుతున్న వాళ్లకి.... ఎక్కడెక్కడో చిక్కుకున్న వలస కూలీలకు  కూడా సాయం అందించాడు ఈ మహనీయుడు. 
 
'' కడుపు చేత పట్టుకున్నా... కన్నీళ్ళతో కటిక చీకట్లో కూరుకున్న....బ్రతుకే బరువుగా మారినా...... ఆదుకున్న మహర్షి... మానవత్వాన్ని చాటి...మంచితనాన్ని చూపి..."