BREAKING NEWS

శంకరాభరణం శాస్త్రి గారిగా మెప్పించిన జె.వి. సోమయాజులు

సప్తపది, త్యాగయ్య వంటి మేటి చిత్రాల్లో హుందాతనం తో కూడిన అద్భుత నటనని కనబరిచిన గొప్ప నటుడు అయిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులు గారు తెలుగు హృదయాల్లో ఇప్పటికి కూడా నాటుకు పోయారు. ఈయన గురించి ఎంత చెప్పిన తక్కువే. మరి ఆయన చిత్రాల గురించి జీవితం గురించి పూర్తిగా దీనిని చదివేయండి.

 1976 సంవత్సరం లో సోమయాజులు గారు జ్యోతి సినిమాల్లో నటించారు ఆ తర్వాత 1979వ సంవత్సరం శంకరాభరణం లో శంకర శాస్త్రి పాత్ర లో  నటించారు.  ఈ పాత్ర నిజంగా ఈయన సినీ కెరీర్ లో మలుపు  తిప్పేసింది. తెలుగు ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా కూడా శంకర శాస్త్రి పాత్ర తీసుకొచ్చింది. ఆ తర్వాత 1980వ సంవత్సరం లో యాజులు పాత్రలో సప్తపది సినిమాలో నటించారు అలానే వంశవృక్షం, త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు, నెలవంక, సితార, శ్రీ రాఘవేంద్ర, స్వాతిముత్యం, దేవాలయం, విజేత,  శ్రీ శిరిడి సాయి మహత్యం, కళ్యాణ తాంబూలం, ఆలాపన  మగధీరుడు ఇలా అనేక సినిమాల్లో ఆయన నటించారు.

 కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీ కన్నడ మలయాళ తమిళ చిత్రాలలో కూడా శంకరశాస్త్రి సోమయాజులు గారు నటించారు. సోమయాజులు పేరు కన్నా శంకరశాస్త్రి అంటే అందరికీ తెలిసేలా మారిపోయింది శంకరాభరణంతో. ఈయన జూన్ 30 ,1928సంవత్సరంలో జన్మించారు. ఈయనది లుకాలం  అగ్రహారం ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈయన  తండ్రి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పని చేశారు. ఈయన తల్లి సోమయాజులు  వెనక ఉండి ప్రోత్సహించేవారు. ఈమె ఆయన విజయాల వెనుక ఉండి నిరంతరం ప్రోత్సహించే వారు. ఈయన సోదరుడు జె.వి.రమణమూర్తి కూడా నటుడే.

సోమయాజులు గారికి  బాగా పేరు తెచ్చిన పాత్రలు శంకరాభరణంలో శంకరశాస్త్రి అలానే త్యాగయ్య సినిమాలో త్యాగయ్య పాత్ర. నిజంగా చక్కటి పేరు తీసుకొచ్చాయి. శంకరశాస్త్రి పాత్ర తో  పేరు పొంది ప్రేక్షకుల హృదయాల్లో నాటుకు పోయారు. రంగస్థలం వెండితెర బుల్లితెర  చిత్రాల్లో కూడా నటించారు. సోమయాజులు వారు విజయనగరం లో చదువుకున్నప్పటి నుంచి కూడా నాటకాలు వేసేవారు. తన సోదరుడు రమణమూర్తి తో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం  45 ఏళ్ల లో ఐదు వందల ప్రదర్శనలు ఇచ్చారు. కన్యాశుల్కం లో రామప్ప పంతులు పాత్రకు ప్రసిద్ధి అయ్యారు. 

 శంకరాభరణం లో జె వి సోమయాజులు:

 జె వి సోమయాజులు శంకర శాస్త్రి పాత్ర లో కనిపించారు. ఈయన గొప్ప సంగీత విద్వాంసుడు గా శంకరాభరణం లో  నటించాడు. సంగీతం అంటే చెవి కోసుకునే వాళ్ళ పాత్ర ఆయనిది. ఒక వేశ్య కూతురు గొప్ప నర్తకి తులసి ఆ వృత్తిని అసహ్యించుకుంటుంది. కలలను ఆరాధించే తులసి శంకరశాస్త్రిని గురు భావం తో  ఆరాధిస్తుంది. శంకర శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశ పడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తి లోనే కొనసాగాలని పట్టుబడుతుంది. శంకర శాస్త్రి సినిమా లో తులసికి అండగా నిలుస్తాడు. ఇలా ఇక్కడ అనేక మలుపులతో కొనసాగుతుంది కదా. పాశ్చాత్య సంగీతపు ఒరవడి లో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు.

ఇలా ఈ సినిమా సంగీతం గురించి శాస్త్రీయ సంగీత ఖ్యాతిని తెలియజేస్తుంది మంజుభార్గవి తులసి పాత్రలో బాగా నటిస్తుంది. ఆ చిత్రంలో పాటలు కూడా నిజంగా అద్భుతం ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించడం గొప్ప విశేషం. దేశవ్యాప్తంగా కూడా శాస్త్రీయ సంగీత అభిమానులు ఈ సినిమాని ప్రశంసించారు. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజంగా ప్రేక్షకుల్ని ఎంత గానో ఆకట్టుకుంది. కె విశ్వనాథ్ కి ఈ చిత్రం తర్వాత కళాతపస్వి పేరుపొందారు ఇలాంటి దర్శకుడు మంచి పేరు పొందడం ఒక విశేషమైతే శంకర శాస్త్రి కథ జెవి సోమయాజులు కెరియర్ మరో మలుపు తిరగడం మరో గొప్ప విశేషమని చెప్పాలి.

 జె వి సోమయాజులు గారి జీవితం :

చిన్ననాటి నుంచి  నాటకాలు చేయడం ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. వివిధ నాటకాలు చేసి గొప్ప పేరు పొందారు జె.వి.సోమయాజులు. ఆంధ్ర నాటక కళా పరిషత్తు లో బహుమతులు ఎన్నో గెలుచుకున్నారు. దీనితో ప్రతిభను మరింత పదును పెట్టుకోవాలని పట్టుదల తో ఈయన మనిషి మనిషి నాటకం,  గాలివాన అలాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీల లో నిలిచారు. ఈయన  అనేక ప్రదర్శనలు చేసి ఎన్నో బహుమతులు తో పాటు మరెందరో హృదయాలను గెలుచుకున్నారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అచంచలగా ఎదుగుతూ ఈయన డిప్యూటీ కలెక్టర్ స్థాయికి కూడా చేరుకున్నారు. మహబూబ్నగర్ లో  డెప్యూటీ కలెక్టర్ గా  ఆయన తన విధులు నిర్వర్తిస్తూ శంకరాభరణం సినిమాలో నటించారు ఈ చిత్రానికి ముందే రాధాకృష్ణయ్య సినిమా లో ఓ ముఖ్య పాత్ర ని కూడా ఈయన చేశారు. చెప్పాలంటే శంకరశాస్త్రి గా బాగా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత సప్తపది వంశవృక్షం ఇలా అనేక సినిమాల్లో ఆయన నటించారు.

 జె వి సోమయాజులు వారి మరణము :

ఎన్నో సినిమాలతో అనేక నాటకాలతో ఈయన ఎన్నో విజయాలను అందుకున్నారు. 150 సినిమాల్లో నటించిన టీవీ సీరియల్స్ లో కూడా ఆయన కొన్ని పాత్రలు చేశారు. ఈయనకి వివిధ పాత్రల ద్వారా కీర్తి లభించింది. ఈయన చివరి శ్వాస వరకు నటన మీద గౌరవంతో ఆరాధనా భావంతో జీవించారు. ఈయన  ఆఖరి దశలో మాత్రం  ఆరోగ్యం సహకరించలేదు. అయినప్పటికీ ఈయన చేయగలిగింది చేశాడు. కళాకారుడు కడవరకు కళాకారుడే  అని  సోదాహరణంగా నిరూపించారు.  రిటైర్ అయ్యేనాటికి సాంస్కృతిక విభాగం లో డైరెక్టర్గా ఈయన  కొనసాగించారు 2004 వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ లో  గుండెపోటుతో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు.

ఈయన ఇప్పుడు లేకపోయినా చేసిన  పాత్రలు...... నటించిన చిత్రాలు..... చరిత్రలో చిరస్మరణీయం.... ప్రేక్షకుల హృదయాల్లో నాటక పోయిన పాత్రలు అఖండం అమోఘం....